Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆపేస్తే.. అంతే సంగతులు... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 09,2022

ఆపేస్తే.. అంతే సంగతులు...

'ఆకలి మంటలు ఒకచోట.. అన్నపు రాసులు మరో చోట...' పేదలకు ఆహార పంపిణీలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది. 'అమ్మా పెట్టదు.. అడుక్కుని తిననివ్వదు...' అన్నట్టుంది బియ్యం సేకరణలో అది అనుసరిస్తున్న తీరు. తాజాగా 'నేను చెప్పినట్టు చెయ్యకపోతే బియ్యం సేకరణ ఆపేస్తాం...' అంటూ అది రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశమైంది. కాకపోతే తనకు తానుగా ఆ నిర్ణయం తీసుకున్నట్టు కాకుండా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) భుజాల మీద తుపాకీ పెట్టి తెలంగాణ సర్కారును కాల్చేందుకు మోడీ సర్కార్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది.. చేసింది. తద్వారా ధాన్యం, బియ్యం సేకరణ, పంపిణీ బాధ్యతల నుంచి అది క్రమక్రమంగా తప్పుకోజూస్తున్నది.
ఇందుకు సంబంధించి కేంద్రం చెబుతున్న కారణాల్లో ఒకటి.. రాష్ట్రంలో రెండు నెలలుగా బియ్యం పంపిణీ జరగటం లేదు. రెండోది.. మిల్లుల్లో పెద్దగా ధాన్యం నిల్వల్లేవు, కొన్నిచోట్ల ఉన్నా అవి లెక్కించేందుకు అనువుగా లేవు. మూడోది.. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవటం లేదు. మోడీ సర్కార్‌ ఎఫ్‌సీఐ ద్వారా చెప్పించిన ఈ మూడు కారణాలను... కారణాలు అనటం కంటే సాకులు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే లోపాలున్నప్పుడు వాటిని సరి చేయాలి తప్ప అవి ఉన్నాయనే కారణంతో అసలు వ్యవస్థనే దెబ్బతీయజూడటం సరికాదు.. సహేతుకం అంతకంటే కాదు. ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముద్దాయిని చేయాల్సి వస్తే.. అంతకంటే పెద్ద ముద్దాయి కేంద్రమే అవుతుంది. 'రెండు నెలల నుంచి బియ్యం పంపిణీ రాష్ట్రంలో జరగటం లేదు...' అని చెప్పటం ద్వారా ఇక్కడి సర్కారును ఇరకాటంలో పెట్టినప్పుడు... కరోనా కాలంలో జనం అరిగోస పడుతున్న సమయంలో కూడా గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాలను కేంద్రం ఎందుకు పంచలేదు...? అనేది కూడా చర్చకు రావాలి. దానికి ఘనత వహించిన బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. నియమ నిబంధనల ప్రకారం విపత్తులు, కరువు కాటకాలు సంభవించినప్పుడు ప్రజలకు పట్టెడన్నం పెట్టేందుకు వీలుగా కనీసంలో కనీసంగా రెండు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను గోదాముల్లో నిల్వ ఉంచాలి. ఇప్పుడు దేశంలోని గోడౌన్లలన్నింటిలో కలిపి అంతకు మూడు రెట్లకు పైగా (ఏడు కోట్ల టన్నులు) నిల్వలున్నాయి. వాటన్నింటినీ ఎలుకలు, పంది కొక్కులు తిన్నా ఫర్లేదు.. మేం మాత్రం వాటిని బయటకు తీయం... పేదలకు పంచబోమనే రీతిలో కేంద్రం వ్యవహరించిందంటే వారి పట్ల దాని చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో బియ్యం పంపిణీలో లోపాలున్నాయనే కారణంతో అసలు సేకరణనే ఆపేస్తామనటమనేది 'ఇంట్లో ఎలుకలున్నాయనే కారణంతో ఆ ఇంటినే తగలబెట్టటం...' అవుతుంది.
మరోవైపు ధాన్యం, బియ్యం సేకరణ, బియ్యం పంపిణీ అనే వాటిని కేంద్రం కేవలం ప్రభుత్వాల వ్యవహారాలుగానే చూస్తే అంతకుమించిన పొరపాటు ఇంకోటి ఉండదు. ఇది ఫక్తు రైతులు, రేషన్‌ వినియోగదారులైన పేదలు, సామాన్యులకు సంబంధించిన అంశం. ఇప్పటికే ధాన్యం, బియ్యం సేకరణకు సంబంధించి అనేక కొర్రీలేస్తున్న కేంద్రం... దానికి క్రమక్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తున్నది. ఇది రైతాంగానికి తీవ్ర నష్టం.. దేశానికి పెను ప్రమాదం. ఎఫ్‌సీఐ ఒకవేళ సేకరణ చేయకపోతే రైతులకు కనీస మద్దతు ధరలు లభించవు. అప్పుడు వారు ప్రయివేటు వ్యాపారులకు, మధ్య దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. అదే జరిగితే చాలా తక్కువ ధరకే ధాన్యాన్ని తెగనమ్మాలి. ఇప్పుడు మార్కెట్లో క్వింటాల్‌ ధాన్యానికి రూ.1,960 ధర ఉంది. ఇది రైతుకు లాభదాయకం. అదే ప్రయివేటు వారికి అమ్మాల్సి వస్తే రూ.1,600 లేదా రూ.1,500తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ప్రజలందరికీ ఆహార భద్రత అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల సరఫరా ఆగిపోతుంది. ఇప్పటికే ఈ సమస్య ఉత్తర భారతంలో కొనసాగు తున్నది. ఇప్పుడు కేంద్రం చర్యల వల్ల అది దక్షిణాదిన కూడా తలెత్తే అవకాశముంది. వాస్తవానికి దేశంలో ఆకలి చావుల్లేకుండా ఉన్నాయంటే దానికి కారణం పౌరసరఫరాల పంపిణీ వ్యవస్థే కారణం. ఇప్పుడు ఆ వ్యవస్థను చంపకుండా అడ్డుపడటం, కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణను ఆపేస్తామన్న కేంద్రానికి ఆస్కారమివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా లోపా లన్నింటినీ సరిచేసుకోవాలి. తద్వారా కేంద్రానికి సరైన నివేదికనివ్వాలి. అదే విధంగా మసీదులు, గుళ్లు, గోపురాల గురించి సొల్లు పురాణాలు వల్లె వేస్తున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి... బియ్యం సేకరణ ఆపకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సత్యం వధ.. ధర్మం చెర..!
ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు!
వైద్యమో.. చంద్రశేఖరా...
పాడిందే పాట...
ప్రహసనంగా పార్లమెంటు!
ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...

తాజా వార్తలు

08:48 PM

ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు

08:35 PM

నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

08:27 PM

భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

07:06 PM

కేంద్ర నిఘా సంస్థల దుర్వినియోగం : సీపీఐ(ఎం)

07:04 PM

నారాయ‌ణ కాలేజీకి ప్ర‌భుత్వం షోకాజ్ నోటీస్

06:44 PM

టాలీవుడ్ లో విషాదం..

06:37 PM

రామోజీ ఫిలిం సిటీకి అమిత్ షా

06:04 PM

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

05:33 PM

సీజేఐ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ

05:13 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

05:10 PM

మునుగోడులో మా ముందు మూడు ఆప్ష‌న్లు: సీపీఐ నారాయ‌ణ‌

05:10 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:08 PM

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

04:47 PM

చంద్ర‌బాబుకు ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స‌వాల్‌

04:35 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

04:06 PM

పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..

03:34 PM

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

03:26 PM

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!

03:07 PM

నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

02:32 PM

బాలికపై లైంగికదాడి చేయించిన స్నేహితురాలు

01:25 PM

సీబీఐ దాడుల్లో ఏం దొరకదు : అరవింద్ కేజ్రీవాల్

01:14 PM

200 కిలోల గంజాయి, ఏకే 47 పట్టివేత

01:09 PM

పాత యాదగిరిగుట్టలో రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

01:04 PM

ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

12:49 PM

ట్రాఫిక్ పోలీసులపై రాళ్లతో మందుబాబు దాడి

12:44 PM

20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

12:38 PM

హైదరాబాద్‌లో 1500లకు పైగా మల్టీనేషనల్ కంపెనీలు : కేటీఆర్

12:26 PM

తిరుమలను సందర్శించిన కర్ణాటక సీఎం

12:19 PM

ఫెర్రీ ఘాట్‌లో నీటమునిగిన ఐదుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు

12:06 PM

తెలంగాణ జవాన్ ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.