Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇదెక్కడి న్యాయం? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 22,2022

ఇదెక్కడి న్యాయం?

           ఆర్మీలో 'అగ్నివీరుల' రిక్రూట్‌మెంట్‌కు కేంద్రం సోమవారమే నోటిఫికేషన్‌ జారీచేసింది. జులై నుంచి అభ్యర్థు రిజిస్ట్రేషన్‌ విధి విధానాలను కూడా ప్రకటించింది. అయినా, అగ్నిపథ్‌ను రద్దు చేయకుంటే తగ్గేదేలే అన్నట్టుగా యువత పోరాడుతోంది. నాలుగేండ్ల తరువాత తమ భవిష్యత్తు ఏమిటో తెలియని అభ్యర్థులపై కేంద్ర పెద్దల వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యంపోస్తున్నాయి. దేశం కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడటానికి వస్తున్న యువతకు డ్రైవర్స్‌, ఎలక్ట్రిషియన్స్‌, బట్టలు ఉతకడం, హెయిర్‌ కట్టింగ్‌ చేయడం వంటివి నేర్పిస్తామని, అది వారికి భవిష్యత్తులో ఉపాధినిస్తుందని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే చెబుతున్నారంటే ఈ దేశ సైనిక వ్యవస్థ మీద వారికి ఏ పాటి గౌరవముందో తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ మరో అడుగు ముందుకేసి మాజీ అగ్నివీరులకు తమ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామని సెలవిచ్చారు. దేశ సైనికులతో బీజేపీ ఒక ప్రయివేటు సైన్యాన్ని తయారుచేసుకోవడానికి ఈ పథకాన్ని వాడుకోనుంది అన్నడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ.
           2021 నాటికే ఆర్మీలో లక్షకుపైగా సైనికుల, అధికారుల కొరత ఉంది. రెండేండ్ల నుంచి రిక్రూట్‌మెంట్‌ లేదు. దేశభక్తి తమ సొంతమని రంకెలు వేసే బీజేపీ పెద్దలే కాంట్రాక్టు సిపాయిలను పెట్టుకొని సైన్యం నైపుణ్య సామర్ధ్యాలను నిర్వీర్యం చేయబూనడమంటే వారిది ముమ్మాటికీ నకిలీ దేశభక్తే కాదు, దేశద్రోహం కూడా. 2032 నాటికి సైన్యంలో 50 శాతం కాంట్రాక్టు సిపాయిలతో నింపడం మోడీ ప్రభుత్వ లక్ష్యం.
           రిటైరైన అగ్నిపథ్‌ సైనికులకు తాము ఉపాధి కల్పిస్తామంటూ మహీంద్రా వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు మద్దతు పలుకుతున్నారంటే సైన్యంలోకి కూడా ఉదారవాద విధానాలను ప్రవేశపెటేందుకేనన్నది స్పష్టం. ఇలాంటి వారు తమ ఆఫీసుల్లో ఒకరిద్దరికి, మహా అయితే వంద మందికి సెక్యూర్టీగార్డు ఉద్యోగాలిస్తారంతే! మరి మిగతా వారి సంగతేమిటి? అత్యున్నత త్యాగాలు చేసేందుకు సిద్ధపడ్డ నవ జవాన్లకు వారిచ్చే బహుమానం ఇదా! మరోవైపు నపూర్‌ శర్మ వ్యాఖ్యలపై కానీ, రైతులను కార్లుతో తొక్కించి చంపిన సందర్భంలో కానీ స్పందించని లోక్‌సత్తా అధినేత, కడుపుమండి సైనిక అభ్యర్థులు చేసిన చర్యను మాత్రం దేశద్రోహంగా వర్ణిస్తున్నారు. ఆయన మాత్రం మాజీ ఐఏఏస్‌గా, మాజీ ఎమ్మెల్యేగా రెండు పెన్షన్లు తీసుకోవచ్చు కానీ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని కాపలా కాసే సైనికులకు మాత్రం పెన్షనే వద్దా? ఇదెక్కడి న్యాయం జేపీ గారు?
సైన్యంలో పెన్షన్‌ వ్యయం పెరగడంతోనే అగ్నిపథ్‌ను తీసుకువస్తున్నట్టు కేంద్రం చెబుతోంది. అదే నిజమైతే చేయాల్సింది ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకుని రక్షణ బడ్జెట్‌ను తగ్గించుకోవడం కానీ దీనికి బదులుగా లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రయివేటుకు ధారాదత్తం చేసేస్తోంది. ఈ పరిణామంలో భాగమే 'అగ్నిపథ్‌'! ఇది శిక్షణ పొందిన యువకుల రిక్రూట్‌మెంట్‌ విధానాన్నేగాక, యువసైనికుల మనోధైర్యాన్ని మౌలికంగానే దెబ్బ తీస్తుందనడంలో సందేహం లేదు. అంతే కాదు, ఇది బీజేపీ ప్రభుత్వం 'ఒక ర్యాంకు ఒక పెన్షన్‌' విధానానికి కూడా వ్యతరేకమే. కానీ, ఇప్పుడు అదే బీజేపీ 'ర్యాంకూ లేదూ, పెన్షనూ లేదు' పొమ్మని పొగ పెడుతోంది. ఇది ఆర్మీ ఉద్యోగార్థుల భవితపై పిడుగు పాటే కదా!
ఎనిమిదేండ్లుగా ఇస్తానన్న రెండుకోట్ల ఉద్యోగాల ఊసేలేని మోడీ సర్కార్‌.. ఉన్న ఉద్యోగాలను సైతం ఊడకొట్టే పనిలో తలమునకలయ్యింది. అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 'అగ్నిపథ్‌' కింద నియమించేవారిలో నాలుగోవంతు మందిని 15ఏండ్ల సర్వీస్‌ వరకు కొనసాగిస్తామనీ, మిగిలిన వారికి స్వయం ఉపాధికి దోహదపడే ఆర్థిక సహకారాన్ని అందజేస్తామనీ చెబుతున్నది. అదెలా అని అడిగితే ఉపాధి అడిగితే పకోడిలు అమ్ముకొమని యువతకు ఉచిత సలహాలిస్తున్నారు. వారు మాత్రం దేశాన్ని పోగులు పెట్టి అమ్ముతున్నారు. వారేమో దేశభక్తులు.. మిగతా వారు మాత్రం దేశద్రోహులా? ఇదెక్కడి న్యాయం?

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!
ప్రధాని వంచనా శిల్పం
గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.