Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చదువు'కొనే'దెట్టా..? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

చదువు'కొనే'దెట్టా..?

రాష్ట్రంలో ఈనెల పదమూడు నుంచి బడి గంటలు మోగాయి. వేసవి సెలవుల సరదాలను తీర్చుకున్న పిల్లలు... పుస్తకాల సంచిని భుజానేసుకుని తిరిగి బడుల్లో కాలు మోపారు. వారిని ఆ విధంగా బళ్లలో దిగబెట్టేసరికి తల్లిదండ్రులకు చుక్కలు కనిపించాయి. షరా మామూలుగా పుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫారాలు, టైలు, షూల పేరుతో ప్రయివేటు, కార్పొరేటు స్కూళ్లు వారి జేబులను గుల్ల చేశాయి. వీటిపై నిఘా ఉంచి.. ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నదే తప్ప నోరు మెదపటం లేదు. మరోవైపు ఫీజుల నియంత్రణ కోసం 2017లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన తిరుపతిరావు కమిటీ... ఆ ఫీజుల్ని తగ్గించాలంటూ సిఫారసు చేయకపోగా, వాటిని ప్రతీయేటా 10 నుంచి 30 శాతం వరకూ పెంచుకోవచ్చంటూ పేర్కొనటం విస్మయపరిచే అంశం. ఇదే సమయంలో ఆ కమిటీ... ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లోని టీచర్లకు ఎంతెంత జీతాలివ్వాలనే దానిపై మాత్రం ఎలాంటి సిఫారసులూ చేయకపోవటం గమనార్హం. ఇలాంటి పరిణామాల మధ్య 2018లో సదరు కమిటీ ఇచ్చిన నివేదికపై విమర్శలు, భిన్నాభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. పోనీ కనీసం తప్పుల తడకగా ఉన్న ఆ రిపోర్టునైనా ప్రభుత్వం బయటపెట్టిందా..? అంటే అదీ లేదు. మరోవైపు ఈ యేడాది జనవరిలో 'ఫీజులను నియంత్రిస్తాం...' అంటూ మరోసారి ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు, అందుకోసం ఏకంగా మంత్రివర్గ ఉపసంఘాన్నే ఏర్పాటు చేసింది. ఇందుకోసం చట్టం తీసుకొస్తామంటూ ప్రకటించినప్పటికీ... మార్చిలో నిర్వహించిన బడ్జెట్‌ సమావేశాల్లో మాత్రం దాని ఊసే ఎత్తలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆ చట్టాన్ని తీసుకురావాలంటే కచ్చితంగా ఆర్డినెన్సును రూపొందిం చాల్సిందే. ఆ పని చేయాలన్న చిత్తశుద్ధి సర్కారుకు ఉంటుందా..? ఒకవేళ ఉన్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గవర్నర్‌కు దాన్ని పంపించి.. ఆర్డినెన్స్‌ను జారీ చేయించగలరా..? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
కమిటీలు, చట్టాలు, వాటి కథా కమానీషు ఇలా ఉండగా... అసలు వాటితో ఎలాంటి సంబంధమూ లేకుండానే ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు... ఈ యేడాది ఇప్పటికే తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని విపరీతం గా మోపాయి. కరోనా సమయంలో ఫీజు వసూలు చేయని స్కూళ్లు, ఒకవేళ వసూలు చేసినా ఎంతో కొంత తగ్గించి తీసుకున్న పాఠశాలలు... ఇప్పుడు తమ ప్రతాపాన్ని చూపాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏకంగా 10 నుంచి 30 శాతం ఫీజులు పెంచిన ఆయా పాఠశాలలు... వాటిని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. కరోనా టైంలో ఫీజులను పూర్తిగా వసూలు చేసిన స్కూళ్లు సైతం ఇదే బాటపట్టి తామేం తక్కువ కాదని నిరూపించాయి. కోవిడ్‌ వల్ల ఉపాధి కోల్పోయి... అప్పట్లో ఫీజులే చెల్లించని తల్లిదండ్రులు ఇప్పటి పరిస్థితి చూసి మరింత జంకుతున్నారు.
ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. ప్రభుత్వ బడుల దుస్థితి మరో రకంగా ఉంది. 'సర్కారు బడులను బలోపేతం చేస్తాం.. మన ఊరు-మన బడి ద్వారా వాటి దశను, దిశను మారుస్తామనే' ప్రభుత్వ పెద్దల హామీల వర్షం మధ్య పాఠశాలలకు చేరుకున్న పిల్లలకు, ఉపాధ్యాయులకు ఆ ఆనందం తొలిరోజే ఆవిరైంది. రాష్ట్రంలోని అనేక బడుల్లో సమస్యలు తిష్టేవేయటమే ఇందుకు కారణం. మంచినీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు తదితర సమస్యలు ఇటు పంతుళ్లను, అటు పోరగాళ్లను వెక్కిరించాయి. పారిశుధ్య కార్మికులు లేకపోవటంతో టీచర్లే చీపుర్లు పట్టి పాయఖానాలను శుభ్రం చేయాల్సిన దుస్థితి. ప్రస్తుత వర్షాకాలంలో మంచినీరు, పారిశుధ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో ఇటు పిల్లలు, అటు టీచర్లు రకరకాల రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. బడుల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికులది మరో రకమైన సమస్య. గత పదిహేనేండ్లుగా సేవలందిస్తున్న వీరి వేతనం నెలకు కేవలం వెయ్యి రూపాయలే. దీన్ని రూ.మూడు వేలకు పెంచుతామంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని బాలికలకు అవసరమైన అనేక వస్తువులతో కూడిన కిట్లను అందిస్తామంటూ గత మార్చి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ముందస్తు ప్రణాళిక లేయకుండా సర్కారు ఉదాశీనంగా వ్యవహరించటంతో ఇప్పటి వరకూ వాటికి అతీగతీ లేకుండా పోయింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీలను భర్తీ చేయకపోవటం, విద్యా వాలంటీర్లను నియమించకపోవటం తదితర సమస్యలు వీటికి అదనం. ఈ నేపథ్యంలో నేటి భావి భారత పౌరులు... ఇటు చదువుకోలేక, అటు చదువులను కొనలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన అనేక రంగాలను ప్రయివేటీకరించటం ద్వారా ఆయా బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోజూడటమే ఇందుకు కారణం. దాని పర్యవసానమే ఈ 'చదువుల గోస...'. ఇటీవల బాసర ట్రిబుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళననుబట్టి ప్రభుత్వ విద్యారంగంపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో విదితమవుతున్నది. అందుకే ప్రయివేటు, కార్పొరేటు స్కూళ్లలో ఫీజుల తగ్గింపు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుదలకు ఇటు తల్లి దండ్రులు, అటు ఉపాధ్యాయులు, మేధావులు నికరంగా పోరాడాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!
ప్రధాని వంచనా శిల్పం
గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.