Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నీతిమాలిన చర్య | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jul 06,2022

నీతిమాలిన చర్య

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేరళ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడి ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన దాడిగా పరిగణించాలి. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం అలుపెరగని పోరుసల్ఫిన ఎకె గోపాలన్‌ పేరిట ఉన్న కార్యాలయంపైనే దాడికి తెగించడం దుర్మార్గం. ఈ దాడి వెనకున్న పిరికిపందలకు ప్రజాస్వామ్య విలువలపై ఏమాత్రం గౌరవం లేదని స్పష్టమవుతున్నది. దేశంలోనే ఆదర్శనీయమైన రీతిలో సుపరిపాలన అందిస్తున్న కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వాన్ని, వామపక్షాలను ప్రధానంగా సీపీఐ(ఎం)ను లక్ష్యంగా చేసుకొని కొంతకాలంగా సాగుతున్న కుట్రలు, కుతంత్రాల్లో భాగమే గురువారం రాత్రి జరిగిన బాంబుదాడి.
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, దాడి జరిగిన తీరు చూస్తుంటే ఈ ముష్కర దాడి వెనుక ఎవరి 'హస్తం' ఉందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కన్నూరు జిల్లాలో సరిగ్గా వారం కిందట జైలు నుంచి విడుదలైన ముగ్గురు యువజన కాంగ్రెస్‌ నేతలకు అక్కడి జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం పూల దండలతో ఘనస్వాగతం పలికింది. ఆ ముగ్గురు నేతలూ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై హత్యాయత్నానికి ఒడిగట్టిన కేసులో ప్రధాన నిందితులు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అంతమెందించేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న దుండగులను ఊరేగించే దుస్థితికి కాంగ్రెస్‌ దిగజారిపోయిందంటే హింసా రాజకీయాల్లో 'హస్త'లాఘవాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. లోక్‌సభకు వేనాడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ నియోజకవర్గ కార్యాలయంపై, కొన్ని రోజుల కిందట జరిగిన అవాంఛనీయ ఘటనను సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. అయినా, కాంగ్రెస్‌ ధోరణి మారలేదు. 'దేశాభిమాని' పత్రిక కార్యాలయంపైనా దాడికి తెగబడింది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం) ఈ దాడిపై శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిందే తప్ప కాంగ్రెస్‌ తరహాలో ప్రతిదాడులకు పూనుకోలేదు. అధికారం కోసం ఎంతటి అనైతికానికైనా పాల్పడే కాంగ్రెస్‌లాంటి పాలకపక్షాలకు, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచే వామపక్షాలకు ఇదే తేడా. అంతేకాదు అటు ప్రభుత్వంలో కానీ, ఇటు పార్టీ పరంగా కానీ తనపై ఏ చిన్నపాటి విమర్శలొచ్చినా వాటిని సరిదిద్దుకొని ప్రజాస్వామ్యయుతంగా మార్క్సిస్టు పార్టీ ముందుకు సాగుతోంది. కోవిడ్‌ విపత్తులో ప్రతిపక్ష పార్టీల నేతలను తనతోపాటే ఒకే వేదికపై కూర్చుబెట్టుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన ఏకైక ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ ప్రత్యేకత చాటుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకు మార్క్సిస్టు పార్టీ ఇచ్చే ప్రాధాన్యత అది అని ప్రశంసలు వెల్లువెత్తాయి.
కేరళలో వామపక్ష ప్రభుత్వ విజయాలను, మార్క్సిస్టు సైద్ధాంతిక భావజాల విస్తృతిని జీర్ణించుకోలేని మితవాద మతతత్వశక్తులు కేరళను మతోన్మాద ఆగడాలకు రణక్షేత్రంగా మార్చేందుకు నిరంతరం కుట్రలు కుతంత్రాలు పన్నుతూనే ఉన్నాయి. వాటితో కాంగ్రెస్‌ జతకలసి వామపక్ష ప్రభుత్వంపై విషం గక్కుతున్నది. వామపక్షాల కార్యాలయాలు, కార్మిక, ప్రజాసంఘాల కార్యాలయాలు, 'దేశాభిమాని' వంటి ప్రజా పత్రికల కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతున్నది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య విలువలు గురించి జాతీయస్థాయిలో నీతులు చెప్పే కాంగ్రెస్‌ పార్టీ, కేరళలో మాత్రం మతతత్వ శక్తులతో అంటకాగుతూ బీజేపీతో అనైతిక బంధాన్ని కొనసాగిస్తున్నది. బీజేపీకి బి-టీమ్‌గా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందన్న విమర్శలకు, ఇటీవల కేరళలో చోటు చేసుకున్న పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కానీ ఎర్రజెండాను గుండెలపై హత్తుకున్న నవ కేరళ ప్రజానీకం ఆ కుట్రలను ఎప్పటికప్పుడు చిత్తుచేస్తూవస్తోంది. దీనిని కూడా అదే స్ఫూర్తితో ఎదుర్కొంటారని ఆశిద్దాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...
ఇదేం ''గతి'' సార్‌!
శ్రీలంకపై ఐఎంఎఫ్‌
ఆనందం అందని ద్రాక్షేనా..?
ధనిక దేశాల్లో మాంద్య ఘంటికలు మనకూ హెచ్చరికే!
'పీస్‌' ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే?

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.