Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బ్యాంకులకు బురిడీ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

బ్యాంకులకు బురిడీ

బ్యాంకులకు కార్పొరేట్లు టోపీ వేస్తున్నారని మరోసారి నిర్థారణ అయింది. ఆర్‌టీఐ పిటిషన్‌కు సమాధానంగా ఐదేండ్లలో పది లక్షల కోట్ల రూపాయలకుపైగా రుణాలు మాఫీ చేసినట్లు సాక్షాత్తు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే ప్రకటించింది. మట్టిని దైవంగా... పైరును ప్రాణంగా భావించి స్వేదంతో నేలను తడిపే రైతు, కౌలు రైతు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణాలందవు. ఎవరికైనా అందినా లక్షలోపు తీసుకున్న వారే ఎక్కువ. మద్దతు ధర రాక, అతివృష్టి అనావృష్టి, అనారోగ్యం తదితర కారణాల వల్ల ఎవరైనా సకాలంలో కట్టలేక పోతే... సర్కారు వారి పాట అంటూ ఊరంతా ముందుగా దండోరా వేసి మరీ వారికున్న కొద్దిపాటి పొలాన్నో, ఇంటినో వేలం వేస్తారు. ఈ తతంగంతో మనస్తాపానికి గురై పరువు పోయిందని ఊపిరి తీసుకున్నవారు, ఉన్న ఊరిని వదిలి వలస పక్షుల్లా ఎగిరిపోయి అవస్థలు పడుతున్న అన్నదాతలెంతమందో! కానీ ఇందుకు భిన్నంగా ఈ దేశంలో వేలకోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ల దర్జాయే వేరు..!
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణాలు తీసుకున్న కార్పొరేట్లలో ఎగ్గొట్టిన వారే ఎక్కువని సాక్షాత్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే తెలిపింది. గత ఐదేండ్లలోనే పది లక్షల తొమ్మిది వేల 510 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. తీసుకున్న రుణానికి సంబంధించి 90రోజులకుపైగా వాయిదా లేదా వడ్డీ చెల్లించకపోయిన వాటిని నాన్‌ పెర్ఫార్మెన్స్‌ అసెట్స్‌ (ఎన్‌పిఎ) అంటారు. ఈ జాబితాలోకి వచ్చిన మొత్తాల్లో 13 శాతమే అంటే లక్షా 32వేల 36 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. గత పదేండ్లలో కార్పొరేట్ల రుణాలు రూ.13 లక్షల 22 వేల 309 కోట్లు మాఫీ అయితే, అందులో యూపీఏ పాలనలో 2012 నుంచి 2014 ఆర్థిక సంవత్సరం వరకూ మాఫీ అయినవి 75,227 కోట్లు. మిగతా రూ.12,47,08 కోట్ల రుణాలు మాఫీ చేసింది కాషాయ పార్టీ ఏలుబడిలోనే. ఇలా మాఫీ చేసిన కార్పొరేట్ల పేర్లు వెల్లడించడానికి కూడా సర్కారు అంగీకరించక పోవడం గమనార్హం.
కరోనా విరుచుకుపడిన 2019లో కష్టజీవులను ఆదుకోవడానికి చేతులు రాని మోడీ సర్కారు కార్పొరేట్‌ టాక్స్‌ను 10శాతం తగ్గించింది. అందువల్ల కార్పొరేట్లకు ఏడాదికి తగ్గిన పన్నులు లక్షా 84 వేల కోట్లు. 2019-20లో పెట్రో ధరల పెరుగుదల ద్వారా రూ.2 లక్షల 40 వేల కోట్ల పన్నులు అదనంగా వసూలు చేశారు. ఇటీవల కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ సమావేశంలో మీరు ఎందుకు పెట్టుబడులు పెట్టడంలేదని కార్పొరేట్లను నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. సంపద సృష్టికర్తలుగా చెబుతున్న కార్పొరేట్లు ఉపాధి కల్పనకు పెట్టుబడులు పెట్టలేదని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్‌రాక్‌ నివేదిక ప్రకారం కోటి రూపాయలకుపైగా విలువైన కార్లు, విల్లాల కొనుగోళ్లు, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లు బాగా పెరిగాయి. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజరుమాల్యా, నీరవ్‌మోడీ తదితరుల చరిత్ర జగమెరిగినదే !
ఏడాదికి రెండున్నర లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంది. వీరిని మోడీ సర్కారు ఊరించి ఉసూరుమనిపిస్తోంది. ట్యాక్స్‌ కట్టకపోయినా రిటర్న్స్‌ సమర్పించాలంటూ వీరిని ట్యాక్స్‌ నెట్‌లోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. వారి ఆదాయ పరిమితి పెంచితే వస్తువులు, సేవల వినియోగానికి ఖర్చు చేస్తారు. అందువల్ల సరుకుల అమ్మకాలు పెరుగుతాయి. సంక్షోభ సమయంలో ఈ కొనుగోళ్లు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. మరోవైపు దేశం కోసం శ్రమించే రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. 2019లో అట్టహాసంగా ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పి.ఎం కిసాన్‌) కింద కేంద్రం సహాయం అందించే రైతుల్లో ఎనిమిది కోట్ల మంది అంటే మూడింట రెండొంతుల మందికి మొండిచేయి చూపారు. 2019 ఫిబ్రవరిలో తొలి విడతకూ, 2022 మే-జూన్‌లో 11వ విడతకూ మధ్య లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల నుంచి 3.87 కోట్లకు తగ్గింది. చేసిన అప్పు ఎలాగైనా తీర్చాలనేది సామాన్యుడు, రైతన్న తపన కాగా, ఎగ్గొట్టే అన్ని అవకాశాలు కార్పొరేట్లకు ఇస్తోంది కాషాయ ప్రభుత్వమే. సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగేలా ఆర్థిక విధానాలు మారితేనే దేశానికి రక్ష.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు
మోడీ ''ప్రతిభ''

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.