Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?

బడ్జెట్‌ అంటే వచ్చే లెక్క.. పోయే లెక్క మాత్రమే కాదు. ఎవరి దగ్గర్నుంచి రాబడొస్తోంది..? ఆ రాబడి లోంచి ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారనేది కూడా కీలకం. 2014 తర్వాత కేంద్రం తన బడ్జెట్ల ద్వారా కార్పొరేట్లకు అర్పిస్తున్న మొత్తాలు.. ముట్టజెప్తున్న వనరులు నక్షత్ర మండలానికి చేరాయి. ఈ క్రమంలో దేశంలోని పేదలు మరింత పేదలుగా మారుతుండగా.. ధనికులు, సంపన్నులు, శతకోటీశ్వరుల అవతారమెత్తారు. కరోనా కాలంలో ప్రాణ వాయువు దొరక్క పేదలు సమిధలవగా.. ప్రధాని మోడీ దోస్తులు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోయారు. అదీ మన కేంద్ర బడ్జెట్‌ తీరు తెన్నులు. ఇప్పుడు ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఆయా బడ్జెట్ల సందర్భం రానే వచ్చింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండగా... ఫిబ్రవరి మూడున రాష్ట్ర శాసనసభా బడ్జెట్‌ సమావేశాలు ఆరంభం కానున్నాయి. సాధారణ షెడ్యూల్‌ ప్రకారం ఈ యేడాది డిసెంబరులో మన రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. అంటే సెప్టెంబరులోనో, అక్టోబరులోనో సంబంధిత నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఆ రీత్యా కేసీఆర్‌ నేతృత్వంలో రెండోసారి ఏర్పడిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్‌. మరోవైపు కేంద్రంలోని పార్లమెంటుకు సైతం వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ లేదా మేలో ఎన్నికలను నిర్వహించాలి. ఆ రీత్యా కేంద్రంలోని మోడీ సర్కారుకు కూడా ఈనెలాఖరులో ప్రవేశపెట్టబోయేదే పూర్తి స్థాయి బడ్జెట్‌. వచ్చే ఏడాదిలో ఆ ప్రభుత్వం జమా ఖర్చుల కోసం ఓటాన్‌ అకౌంట్‌ను మాత్రమే ప్రతిపాదించే అవకాశముంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర, దేశ ప్రజలకు ఇవి అత్యంత ముఖ్యమైన పద్దులు.
ఈ పద్దులన్నీ పరిశీలిస్తే... ఏ బడ్జెట్‌ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంచనాలు భారీగా వేసుకోవటం, ఆచరణలో చతికిలబడటం అనే చందంగా పరిస్థితి తయారైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా వాస్తవాలకు అనుగుణంగా పద్దు కూర్పు ఉండటం లేదన్న విషయాన్ని గత ఎనిమిదిన్నరేండ్ల గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రతీయేటా ప్రవేశపెట్టే బడ్జెట్లు భారీగా ఉంటున్నా, ఆ అంచనాల్లో నూటికి 50 నుంచి 60శాతానికి మించి ఆదాయం రావటం లేదన్నది కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు తేల్చి చెబుతున్న నిజం. ఈ ఆదాయం తగ్గుదల అనేది పేదలు, సామాన్యుల సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి కూడా ప్రభుత్వం పదే పదే భారీ అంకెలు, సంఖ్యలతో పద్దును నింపేస్తున్నది. వాస్తవ ఆదాయానికి భిన్నంగా అంకెలను ఎక్కువ చేసి చూపటం ద్వారా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ కాగ్‌ మొట్టికాయలేసిన సందర్భాలు కోకొల్లలు. అయినా సర్కారు వారి తీరులో ఏ కోశానా మార్పు రావటం లేదు.
ఇక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ల తీరు తెన్నులను నిశితంగా పరిశీలిస్తే... రాష్ట్రాలకు రిక్త హస్తం చూపటంలో 'తగ్గేదేలే' అనే చందంగా ఉంది వ్యవహారం. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిదిన్నరేండ్ల కాలంలో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ నిధులివ్వకుండా వాటి కడుపు మాడ్చుతున్న వైనం కడు బాధాకరం. ప్రస్తుతం అమల్లో ఉన్న (2022-23 బడ్జెట్‌, జనవరితో ముగుస్తుంది) బడ్జెట్‌లో కూడా తెలంగాణకు ఇదే అనుభవంలోకి రానున్నదని ఆర్థిక నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో కేంద్రం నుంచి తెలంగాణకు సుమారు రూ.59 వేల కోట్లు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసుకోగా... ఇప్పటి వరకూ రూ.25 వేల కోట్లే వచ్చాయంటే కేంద్రం ఏ రీతిలో మనకు మొండి చేయి చూపిందో విదితమవుతున్నది. కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు రూ.18 వేల కోట్లు వస్తాయని భావిస్తే... సుమారు తొమ్మిది వేల కోట్లే విదిల్చటమనేది రాష్ట్రాల పట్ల కేంద్ర సర్కార్‌ వైఖరిని స్పష్టం చేస్తున్నది. రూ.మూడు వేల కోట్ల మేర రావాల్సిన జీఎస్టీ పరిహారాల్లో ఇప్పటి వరకూ రూ.రెండు వేల కోట్లే మనకొచ్చాయి. విచిత్రమేమంటే బడ్జెట్‌కు సంబంధంలేని ఉపాధి హామీ నిధుల విషయంలో కూడా కేంద్రం కొర్రీలేస్తోంది. ఆ నిధుల్లోంచి రూ.150 కోట్లు వినియోగించుకుని రాష్ట్రంలో ధాన్యపు కల్లాలు నిర్మించి, కూలీలకు ఉపాధి కల్పిస్తే... వాటిని తిరిగిచ్చేయా లంటూ మోడీ సర్కార్‌ హుకూం జారీ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి అన్ని రకాలుగా మోడీ సర్కారు మనకు ధోకా ఇచ్చింది. అందువల్ల ఈనెలాఖరులో ప్రతిపాదించ బోయే బడ్జెట్‌లోనైనా కేంద్రం రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించాలి. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలును ప్రతిబింబించే విధంగా పద్దును ప్రతిపాదించాలి. ఒకవేళ మోడీ సర్కారు ఆ రకంగా వ్యవహరించక పోతే దాని మెడలు వంచి నిధులు, గ్రాంట్లు, ఆర్థిక ప్యాకేజీలు సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి. ఇదే సమయంలో తాను కూడా అతి అంచనాలు, భారీ పద్దులకు పోకుండా వాస్తవాలతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. అప్పుడే నిజమైన ప్రజా పద్దు సాకారమవుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సిసిఐ 'కృష్ణా'ర్పణం
సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

12:16 PM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

12:16 PM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

12:16 PM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

12:17 PM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.