Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తప్పెవరిది..? శిక్షెవరికి...? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Mar 17,2023

తప్పెవరిది..? శిక్షెవరికి...?

       ఇల్లొదిలి... ఊరొదిలి... కష్ట నష్టాలకోర్చి... రాత్రనక పగలనక పుస్తకాలతో కుస్తీ పట్టిన వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు నడి సంద్రంలో మునిగిపోయింది. తమ పిల్లలకు సర్కారీ కొలువులొస్తాయని ఆశించిన తల్లిదండ్రుల ఆశలు 'లీకేజీ' అనే ఒక్క దెబ్బతో అడియాశలయ్యాయి. డబ్బు, వలపు కోసం తన 'ప్రావీణ్యాన్ని' అంతా రంగరించి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాన్ని లీకు చేసిన ఓ దుర్మార్గుడు ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నాడు. కాషాయ పరివారపు కార్యకర్త ఒకడు ఈ తతంగాన్ని దగ్గరుండి నడిపించాడనే వార్తల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాల్లోని అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షను సైతం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రద్దు చేయటమనేది ఆయా అభ్యర్థులకు తీరని వేదనను మిగిల్చింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల నిర్వహణ ఎంత లోప భూయిష్టంగా ఉందనే విషయం విదితమవుతున్నది. ఇదే కాదు.. 2016లో ఎమ్‌సెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ, 2019లో ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు, ఫలితంగా 29మంది విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అయినా అలాంటి అనుభవాల నుంచి ఏలికలు గుణపాఠాలు నేర్వకపోవటం అత్యంత శోచనీయం. సరళీకృత ఆర్థిక విధానాల అమలు నేపథ్యంలో ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల లాభాపేక్ష వల్ల ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌, బీటెక్‌, ఎమ్‌టెక్‌ దాకా మార్కులు, ర్యాంకులు, డబ్బుల చుట్టే విద్యా విధానం నడవటం ఈ దుస్థితికి ప్రధాన కారణం.
అయితే ఇప్పుడు కొనసాగిన లీకేజీ వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా, పూర్తిగా ప్రభుత్వం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వైఫల్యమే. ఈ తతంగంతో సంబంధమున్న ప్రవీణ్‌, రాజశేఖర్‌, గురుకుల టీచర్‌ రేణుక, ఆమె భర్త పక్కా ప్లాన్‌ ప్రకారమే పేపర్లను లీక్‌ చేసి అభ్యర్థులకు వాటిని అమ్ముకున్నారు. సంబంధిత వ్యవహారం గుట్టు రట్టయింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమంటే... రద్దయిన ఏఈ పరీక్షా పత్రంతోపాటు ప్రవీణ్‌ పెన్‌ డ్రైవ్‌లో మరో మూడు పేపర్లు ఉండటం. టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్టుమెంటు పోస్టులకు సంబంధించిన పేపర్లు సదరు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించటంతో టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత ఈ తతంగంపై సిట్‌ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించటాన్నిబట్టి ఈ స్కామ్‌ తీవ్రత ఏ పాటిదో తెలుస్తున్నది.
ఈ క్రమంలో వరసగా, రోజుకోటిగా వెలుగు చూస్తున్న లీకేజీ లీలలతో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగబోతున్నదనే ఆందోళన నిరుద్యోగ అభ్యర్థులను వెంటాడుతున్నది. ప్రధానంగా గ్రూప్‌ -1 పరీక్షపై టీఎస్‌పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. పేపర్‌ లీకేజీ జరిగిన తీరుపైనా, ఇందులో టీఎస్‌పీఎస్సీ నిర్వాకంపైనా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగటంతో సర్కారు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మెన్‌తోపాటు అందులోని సభ్యులు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ అధికారిక వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ అంశంలో సర్కారు నిర్ణయం కోసం వేలాది మంది కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు. ఏతావాతా తేలిందేమంటే ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి చేసిన తప్పునకు లక్షలాది మంది నిరుద్యోగులు బలయ్యారు. వారి జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారాయి. ఎవరో చేసిన తప్పునకు వారు శిక్షననుభవిస్తూ మౌనంగా, దీనంగా రోదిస్తున్నారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని ఊరికే వదలకూడదు. నిందితులను రిమాండ్‌కు పంపటంతో సరిపెట్టకుండా నియామకాల విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మెన్‌, కమిషన్‌, కార్యదర్శి, మొత్తం సభ్యుల పాత్రపైనా సమగ్ర విచారణ జరిపించాలి. తద్వారా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడగలుగుతాం. లేదంటే నాలుగు రోజుల తర్వాత మళ్లీ ప్రశ్నాపత్రం లీకేజీలు, ఆ తర్వాత కేసులు, అటు తర్వాత నిందితులు బయటికి రావటం షరా మామూలుగా జరిగిపోతాయి. అంతిమంగా నష్టపోయేది, బలయ్యేది పేద పిల్లలే.. ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే అభాగ్యులే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!
ద్వేషగీతం
నిర్వీర్యం దిశగా... ప్రజాపంపిణీ వ్యవస్థ
జనం మీద కుహనా ప్రచార దాడి!
గిరిజన గోస...
అవునా? సీతమ్మా!
ఈ బాటకు బ్రేక్‌ కొట్టలేమా?
మార్చడం... కూల్చడమేనా..?

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.