Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ ఈడీ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Mar 18,2023

మోడీ ఈడీ

''ఈడీ...'' ఇప్పుడిది దేశంలో మోడీతో పాటే వినపడుతున్న మాట. ఇంకా చెప్పాలంటే ''మోడీయే ఈడీ - ఈడీయే మోడీ'' అన్న చందంగా ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మారిపోయాయి. క్రమేణా ఈ రెండూ జతకూడి ''మోడీ ఈడీ'' అనే ఒకే పదంగా రూపాంతరం చెందాయి. అంతిమంగా ఇప్పుడీ పదం ప్రజల సరికొత్త అభివ్యక్తికి ప్రతీకగా వాడుకలోకొచ్చింది. ప్రతిపక్షాల చేతిలో ఓ పదునైన విమర్శకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అందువల్ల ప్రస్తుతం దేశంలో ఏ ప్రాంతానికెళ్ళినా వినిపించే మాట ''మోడీ ఈడీ''. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ కవితపై విచారణ నేపథ్యంలో మన తెలంగాణలోనూ ఇది ''మహ''పాపులారిటీ సాధించింది. నేడు ఈ ''మోడీ ఈడీ'' దాడులంటూ లేని రాష్ట్రమూ, రాజకీయ విపక్షమూ లేదంటే అతిశయోక్తి కాదేమో!
దేశం నలుమూలలా తమ అధికార వాంఛ నెరవేర్చే ఆయుధంగా ఈడీని వాడుతోంది మోడీ సర్కార్‌. ఒక్క ఈడీ ఏం ఖర్మ... సమస్త దర్యాప్తు సంస్థల నుండి గవర్నర్‌ల వ్యవస్థ వరకూ ప్రతిదీ ఇందుకు సాధనమే. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికీ, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి వీటన్నిటినీ వాడుకోవడం ఒక విధానంగా సాగిస్తోంది మోడీ నేతృత్వం. నేడు దేశంలోని బీజేపీ ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నికైన వాటి కంటే ఇలా దొడ్డిదారిన ఏర్పాటు చేసుకున్నవే ఎక్కువ కావడం ఒక భౌతిక వాస్తవం. అయితే, ఈ దర్యాప్తు సంస్థల దాడులకు గురవుతున్నవారంతా నిర్దోషులేనని చెప్పలేం. కానీ, ఈ మోడీ కాలంలో ఈడీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో నేర నిరూపణ రేటు కేవలం 0.5శాతం మాత్రమే. అదే సమయంలో ఈ కేసుల్లో ఇరుక్కున్న అవినీతి నేతలనేకులు బీజేపీలో చేరితే రాత్రికి రాత్రే పునీతులు కావడం, లేదా దర్యాప్తులన్నీ ఉన్నఫలంగా నిలిచిపోవడం నిర్లజ్జగా జరిగిపోతోంది. ఇది మొదట్లో విస్తుగొలిపినా, ఆ తరువాత సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే నిన్నగాక మొన్న అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటనకు ''వాషింగ్‌ పౌడర్‌ నిర్మా'' అంటూ ఆసక్తికరమైన ప్రకటనలు స్వాగతం పలికాయి. వారితో చేరితే ఎంతటి అవినీతి మరకలైనా తొలగిస్తారన్నది వాటి సారాంశం. అవి ఏర్పాటు చేసింది ఎవరో, అందులో వారి ప్రయోజనమేమిటో తెలియదు గానీ, అవి ఇచ్చే సందేశం మాత్రం ఓ సత్యం. ఈ దాడుల లక్ష్యం అధికార విస్తరణ, ప్రత్యర్థులపై కక్షసాధింపే తప్ప, అవినీతిని నిర్మూలన ఎంత మాత్రమూ కాదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది కూడా అదే. కవిత విషయంలో ఈడీ విచారణా తతంగమంతా కేవలం కేసీఆర్‌ను బలహీనపరిచే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. అయితే ఇక్కడ ఉద్దేశం కవిత నిర్దోషి అని చెప్పడం కాదు. నిజంగానే లిక్కర్‌ స్కామ్‌ జరిగిందా? జరిగితే అందులో కవిత పాత్ర ఉందా లేదా? అన్నవి తేలాల్సిన విషయాలే. కానీ ఆమెపై ఈడీని ప్రయోగించడం వెనుక గల రాజకీయ దురుద్దేశం మాత్రం ఓ బహిరంగ రహస్యం. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలో రాజకీయాధికారాన్ని స్వాధీనం చేసుకోవాలన్న కుతంత్రం తప్ప, అవినీతి పరులను పట్టుకోవాలన్న నిజాయితీ ఆవగింజంతైనా కనిపించదు. విపక్ష నేతల మీదే తప్ప స్వపక్ష నేతలపై ఎలాంటి దాడులూ దర్యాప్తులూ ఈ మోడీ కాలంలో ఎరుగం. కేవలం రాజకీయ ప్రయోజనాలే తప్ప, ఈ ఈడీ దాడుల్లో నైతికత మచ్చుకైనా కానరాదు. ఒకప్పుడు ఈడీలాంటి దర్యాప్తు సంస్థలు నేతలెవరిమీదైనా కేసులు నమోదు చేస్తే వారి అవినీతి గుట్టురట్టయిందని భావించేవారు. కొంతకాలం తరువాత ఈ కేసులు నిజమైనవా, లేక కక్షసాధింపు చర్యలా అన్న అనుమానాలు కలిగేవి. ఇక ఇప్పుడైతే ఇలాంటి చర్యలు కేవలం ప్రతీకార చర్యలు మాత్రమే అనుకునే స్థాయికి పరిస్థితులు మారాయి. ఇంతటి ''ఘనతకు'' అర్హుడు గనకనే ఈడీకి ముందు మోడీ చేరి, ఈడీ కాస్తా ''మోడీ ఈడీ''గా చలామణీ అవుతోంది.
ఇటీవల హిండెన్‌బర్గ్‌ నివేదిక అదాని అవినీతి సామ్రాజ్యాన్ని కుప్పకూల్చినంత పనిచేసింది. అదానీ దేశాన్ని ఇంతగా దగా చేయగలిగాడంటే అందుకు ప్రధాని మద్దతే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని పార్లమెంటు అట్టుడుకుతున్నా అది కంఠశోషగానే మిగిలిపోతోంది. లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్మును అప్పులుగా అదానీకి కట్టబెట్టిన సర్కారు నిర్వాకంపైనా, అదానీ అవినీతిపైనా ఏ ఉలుకూ పలుకూ లేదు. చివరికి న్యాయస్థానం తనంతట తానే ఓ కమిటిని నియమిస్తే, వీరు మాత్రం అదానినీ ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే క్రికెట్‌ ముసుగులో ఆస్ట్రేలియా ప్రధానిని రప్పించి ఊసులాడారని గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమకు అనుకూలురైతే రక్షించడం, ప్రతికూలురైతే శిక్షించడం... ఇప్పుడిదే బీజేపీ మార్కు ప్రజాస్వామ్యం! అవినీతికి ఆధారాలుంటే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అస్మదీయులకో న్యాయం, తస్మదీయులకో న్యాయం. అన్న చందాన వ్యవహరించడమే ఇప్పుడీ 'మోడీ ఈడీ' చెపుతున్న న్యాయం! ఇది ఎంతటి దుర్వినియోగం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలుగు పాటకు జేజేలు
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!
ద్వేషగీతం
నిర్వీర్యం దిశగా... ప్రజాపంపిణీ వ్యవస్థ
జనం మీద కుహనా ప్రచార దాడి!
గిరిజన గోస...
అవునా? సీతమ్మా!
ఈ బాటకు బ్రేక్‌ కొట్టలేమా?
మార్చడం... కూల్చడమేనా..?

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.