Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమిత్‌షా అబద్ధాలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Mar 14,2020

అమిత్‌షా అబద్ధాలు

ఢిల్లీ మారణకాండపై రెండు వారాల తరువాత ఎట్టకేలకు హౌంమంత్రి అమిత్‌షా నోరువిప్పారు. అయితే పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్దాలు పలికారు. ఢిల్లీ మారణహౌమం పాలకుల ప్రమేయంతో సాగిందన్నది సత్యం. 'ఇది ప్రణాళికతో కూడిన కుట్ర' అని హౌం మంత్రి అమిత్‌షా పార్లమెంటులో వాస్తవాన్నే చెప్పారు. అయితే ''దీని వెనుక ప్రతిపక్షం, సీఏఏ వ్యతిరేకులు ఉన్నారు'' అని పచ్చి అబద్ధం పలికారు. దేశ రాజధానిలో ఇంతటి ఘోరకలి సాగుతుంటే దానిని ఆపేందుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయని మంత్రి, మీరు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు ''అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌లో ఉన్నారు. అది నా పార్లమెంటు నియోజకవర్గం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు బాధ్యతలు అప్పగించాను'' అని సమాధానం ఇచ్చారు. ప్రజల ప్రాణాల కన్నా అమెరికా అధ్యక్షుని మెప్పుపొందడమే మిన్న అని షా నిస్సిగ్గుగా శెలవిచ్చారు. ఈ మారణహౌమం పోలీసుల సహకారం లేకుండా సాగదన్నది సత్యం. పోలీసుల తీరుకు పాలకుల ఆదేశమే కారణమన్నదీ అంతే సత్యం. నిజానికి ఈ మారణ కాండను ఆపలేనంత శక్తి హీనులు కారు ఢిల్లీ పోలీసులు. వారు పాలకుల వత్తిడికి లొంగకుంటే కచ్ఛితంగా మారణకాండను మొదట్లోనే అడ్డుకోగలిగేవారు. కానీ పాలకుల ఆదేశాలు వారి చేతులు కట్టేశాయి. వృత్తి ధర్మాన్ని మరిచి నేరస్తులకు కొమ్ముకాచి తామూ నేరస్తులుగా మిగిలిపోయారు. పోలీసుల ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలతో రెచ్చిపోయిన మతోన్మాద మూకలు సాక్షాత్తూ దేశ రాజధాని నడిబొడ్డుమీదనే ఆడిన నెత్తుటి జలకాలాటలో 53మంది అభాగ్యుల ప్రాణాలు అనంతవాయివుల్లో కలిసిపోయాయి. వందలాది గృహాలు, వ్యాపార కేంద్రాలు, బడులూ బుగ్గిపాలయ్యాయి. దాదాపు 500మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రులపాలయ్యారు. ఇంత జరుగుతున్నా కేంద్ర హౌంమంత్రి ఆ నరమేధాన్ని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా, తన మౌనంతో నేరస్తులకు పరోక్ష మద్దతు పలికారు. మంత్రి మౌనంలోని అసలు అర్థాన్ని గ్రహించిన ఆయన ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు నేరస్తులకు చేతనైన సాయమందించి తమ స్వామి భక్తిని చాటుకున్నారు.
వాస్తవానికి, ఢిల్లీలో మారణకాండ జరిగే అవకాశమున్నదని ఆరు ఇంటెలిజన్స్‌ బృందాలు ప్రభుత్వాలను హెచ్చరించాయి. అయినా, ఢిల్లీ పోలీసులను తమ ఆధీనంలో ఉంచుకొని ఉన్న కేంద్ర పాలకులు, ఢిల్లీ నరమేధ ముష్కరులలో ఎక్కువమంది సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ పాలకులు స్పందించలేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వందలాదిగా ఢిల్లీలో చొరబడి విధ్వంసం సృష్టించారని చెబుతున్న హౌంమంత్రి వారిని అడ్డుకునేందుకు తామేమి చేశారో చెప్పకుండా దాటవేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమేనన్న వాస్తవాన్ని మరుగు పరుస్తున్నారు. ఈ మారణకాండలో తమ వైఫల్యంకానీ, ప్రమేయంకానీ లేదని చెప్పుకొనేందుకు పడరాని పాట్లు పడ్డారు. నిండు సభలో నోటి కొచ్చిన అబద్దమల్లా ఆడారు. మారణహౌమాన్ని 36గంటల్లో ఆపిన పోలీసులను అభినందించారు. పోలీసుల పాత్రను ప్రశ్నించిన విపక్షాలకు ''బలగాలను ప్రశ్నించడమంటే వారిని నిరాశపరచడమే'' అని నిందించారు. నిజమే! బలగాలను ఎవ్వరూ ప్రశ్నించకూడదు. సామూహిక హింసాకాండకు సహకరిస్తున్నా పోలీసులను ప్రశ్నించకూడదు. ఇదీ ఖాకీలపై కమలం అధినేతలకు ఉన్న అపారమైన ప్రేమ. కమలనాథులకు ఖాకీల అండ. ఖాకీలకు కమలనాథుల అండదండ.
సీఏఏ లాంటి తమ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌ లాంటి చోట్ల ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున స్థిరంగా ఉద్యమించడాన్ని కమలనాథులు జీర్ణించుకోలేక పోయారు.వారికి ఒక గుణపాఠం నేర్పడం ద్వారా, ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్తం కాకుండా ఆపేందుకు సిద్ధమయ్యారు. మూకలకు కత్తులు, కర్రలు, రాళ్ళు, ఇటుకలు, తుపాకులు, పెట్రోల్‌ బాంబులూ అందించి ప్రజల మీదకు వదిలారు. వారికి అడ్డూ ఆపూ లేకుండా పోలీసులను కట్టడి చేశారు. కాబట్టే అంతటి విధ్వంసం సృష్టించడం అల్లరి మూకలకు సాధ్యమయ్యింది. 'దేశ ద్రోహులను కాల్చి పారేయాలి' అంటూ బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా పోలీసు ఉన్నతాధికారి ముందే ఇచ్చిన పిలుపే విధ్వంసకాండ ప్రారంభానికి నాంది పలికిందని బాధితులు గుండెలు బాదుకుంటుంటే, పోలీసులు కపిల్‌మిశ్రాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. 'దేశ ద్రోహులను కాల్చి పారేయాలి' అని కపిల్‌ మిశ్రా ఇచ్చిన పిలుపు ఏ వర్గాన్నీ ఉద్దేశించినది కాదనీ, అందువల్ల దానిని విద్వేష ప్రసంగంగా పరిగణించలేమని'' రాత పూర్వకంగా కోర్టుకు తెలిపి తమ ప్రభు భక్తిని ప్రపంచానికి చాటారు.
పోలీసు వ్యవస్థ పాలకుల ముందు ఎలా సాగిలపడుతుందో మరోసారి రుజువయ్యింది. అలాగే తాము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ప్రశ్నిస్తే న్యాయవ్యవస్థను సైతం తాము విడచిపెట్టమని, బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధర్‌ అర్థరాత్రి బదిలీ ద్వారా ఓ హెచ్ఛరికను ప్రజలకు వినిపించింది కమలం సర్కార్‌. పోలీసు, న్యాయవ్యవస్థ ప్రజలను రక్షించే శక్తిని కోల్పోయిన తరువాత ఇక ప్రజల సంఘటిత శక్తి మాత్రమే వారిని రక్షించగలదు. ఢిల్లీలో మరింత విధ్వంసం, ప్రాణనష్టం జరగకుండా ప్రజల సంఘటిత శక్తే వారిని కాపాడింది. ఈ సంఘటిత శక్తే దేశ వ్యాప్తంగా మరింత విస్తృతం కావాలి. రాజ్య ప్రాయోజిత మతోన్మాద శక్తుల విధ్వంసకాండకు అడ్డుకట్ట వేయాలి.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...
అప్రమత్తతే ఆయుధం
వివక్ష మీద వివక్ష...
మహాప్రమాదం

తాజా వార్తలు

10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

07:37 PM

మంకీపాక్స్ నేపథ్యంలో ముంబైలో అలర్ట్..!

07:24 PM

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

07:19 PM

జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

07:12 PM

మహిళల టీ20 ఛాలెంజ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్

06:52 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

06:40 PM

నాని 'అంటే .. సుందరానికీ`నుంచి పాట విడుదల..

06:33 PM

విమానంలోకి పొగమంచు.. భయాందోళనకు గురైన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు

06:17 PM

కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

06:13 PM

భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర : ప్రధాని మోడీ

05:51 PM

ఓయో రూంలో విషం తాగిన యువకుడు

05:41 PM

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

05:30 PM

నిజామాబాద్‌లో విక‌సించిన‌ ప్రకృతి వింత 'మే`పుష్పం

05:21 PM

ఆ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి : పవన్ కల్యాణ్

05:15 PM

మచిలీపట్నం బీచ్‌లో ఇద్ద‌రు విద్యా‌ర్థినీలు మృతి

04:57 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.