Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని అన్నారు. తెలంగాణ పదం కూడా వినిపించకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తెరపైకి తెచ్చారని తెలిపారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని.. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయిందని చెప్పారు. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్‌కు అర్హత లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలన్నారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.