Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బారాముల్లా : పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన బారాముల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. జమ్మూ-కశ్మీరులో 1990వ దశకం నుంచి ఉగ్రవాదం వల్ల 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జమ్మూ-కశ్మీర్ అభివృద్ధిలో వెనుకబడటానికి మూడు కుటుంబాలే కారణమని ఆరోపించారు. అవి అబ్దుల్లాలు (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు (పీడీపీ), నెహ్రూ-గాంధీలు (కాంగ్రెస్) అన్నారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కొందరు అంటున్నారని, ఆ దేశంతో మనం ఎందుకు చర్చలు జరపాలని ప్రశ్నించారు. చర్చలు జరిపేది లేదన్నారు. మనం బారాముల్లా ప్రజలతో, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఎన్ని గ్రామాలకు విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని ప్రశ్నించారు. మన ప్రభుత్వం కశ్మీరులోని అన్ని గ్రామాలకు విద్యుత్తు కనెక్షన్లను ఇచ్చిందని చెప్పారు. జమ్మూ-కశ్మీర్‌ను దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది తమ లక్ష్యమని చెప్పారు.