Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: న్యూజిలాండ్ తో మూడో వన్డేలో భారత్ బ్యాటింగ్ లో నిరాశ పరిచింది. ప్రత్యర్థి ముంగిట చిన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ శిఖర్ ధవన్ (28) మంచి ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేసినా మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (13) నిరాశ పరిచాడు. మూడో నంబర్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (49) సత్తా చాటాడు. కానీ, రిషబ్ పంత్ (10), ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ (6)తో పాటు దీపక్ హుడా (6) పూర్తిగా విఫలం అయ్యారు. దాంతో, 170 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ 200 ల్లోపే ఆలౌటయ్యింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 7 ఓవర్లు ముగిసేసరికి 28 పరుగులు చేసింది.