Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మానకొండూర్
రోడ్డుపై ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఆ మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రం రాజీవనగర్ కాలనీ సమీపంలో వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఢీ కొట్టడంతో వారిద్దరూ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. రోజువారిలాగే మహిళలు ఇంటి నుంచి పనుల నిమిత్తం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మండలకేంద్రానికి చెందిన కడమంచి రాజవ్వ(37), పాస్తం లచ్చవ్వ (40) గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.