Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెఎ.పాల్ తెలంగాణ జిల్లాల్లో డిసెంబర్ 7 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 13న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ బిడ్డలారా అవినీతి పరులను మీరు నమ్ముతారా ఢిల్లీ, పంజాబ్ ప్రజల్లాగా మార్పు కోరుకుంటారా అని పాల్ ప్రశ్నించారు.
తాను వారం రోజులు అమెరికాకు వెళ్లి వచ్చే సరికి రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని పాల్ వ్యాఖ్యానించారు. వందల కోట్ల రూపాయలతో బీజేపీవారు ఎమ్మెల్యే లను కొనడం కూడా మనం చూస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికలే లాస్ట్ ఎన్నికలని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కావాలా మార్పు కోరుకుంటున్నారా అని ప్రజలను అడిగారు కెఎ.పాల్. వైఎస్. షర్మిల గురించి మాట్లాడుతూ తన అన్న జగన్ నాలుగేళ్ళలో రాజన్న రాజ్యం తీసుకొని రాలేదని, రాక్షస రాజ్యం, అవినీతి రాజ్యం తీసుకొని వచ్చారని తెలిపారు. తాను ప్రపంచానికి తెలుగు వారి సత్తా చూపానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కెఎ.పాల్ కోరారు.