Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదారాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. షర్మిల నోరు అదుపులో పెట్టుకోకపోతే తాము ఆంధ్రలో అడుగుపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. షర్మిల పాదయాత్ర కొనసాగించడం అనేది ఆమె మాటతీరుపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు జగనన్న బాణం అంటున్నారని, ఇప్పుడు బీజేపీ బాణం అంటున్నారని సుదర్శన్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. పులివెందులలో ఓటేసిన షర్మిల తెలంగాణ బిడ్డ ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్ ఆంధ్ర బిడ్డ అయితే షర్మిల తెలంగాణ బిడ్డ అవుతుందా? అని అన్నారు.