Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం నుంచి ప్రారంభించాలనుకున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. పాదయాత్ర పునఃప్రారంభించడానికి చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించకూడదంటూ షర్మిలకు వరంగల్ పోలీసులు శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. గతంలో అనుమతి ఇచ్చినప్పుడు నిబంధనలను అతిక్రమించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని నోటీసులో పేర్కొన్నారు. అయితే దీనిపై శనివారం రాత్రి పొద్దుపోయే వరకు షర్మిల నుంచి సమాధానం రాకపోవడంతో పాదయాత్రను పోలీసులు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి, పాదయాత్రను వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి నుంచి పాదయాత్రను పునఃప్రారంభించాలని షర్మిల భావించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే షర్మిల పాదయాత్రను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.