Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో నేడు జరిగిన తొలి వన్డేలో భారత్ కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ జట్టును విజయం వరించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి 46 ఓవర్లలో ఛేదించింది. బౌలర్ మెహిదీ హసన్ (38 నాటౌట్) బంగ్లాదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ లిటన్ దాస్ 41, షకీబల్ హసన్ 29 పరుగులు చేశారు.
ఛేజింగ్ లో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆ తర్వాత టీమిండియా ఫీల్డర్ల దయతో గెలుపు తీరాలకు చేరింది. బంగ్లాదేశ్ చివరి ఒక్క వికెట్ ను తీయడానికి టీమిండియా బౌలర్లు విశ్వప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, దీపక్ చహర్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.