Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు సోమవారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక కరోనా సమయంలో మూతపడిన ధర్మగుండం ఆదివారం (నిన్న) పున:ప్రారంభించారు. కరోనా వల్ల 32 నెలల పాటు ధర్మగుండంలో పుణ్య స్నానాలకు భక్తులు నోచుకోలేదు. దీంతో ధర్మగుండంలో స్నాన్నాలు ఆచరించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు.