Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అమెరికాలోని మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం బ్యాంకు ఖాతాదారుల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి దానిలో కార్డు పెట్టి ఎదురుగా నిలుచుంటే కస్టమర్ ఫొటో తీసి ఖాతాలో ఎంత మొత్తం ఉందో ఏటీఎంపైన ఏర్పాటు చేసిన లీడర్ బోర్డుపై అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తోంది. నిల్వ మొత్తం పక్కనే ఖాతాదారుడి ఫొటో కూడా ఉంటుంది. ఖాతాలో ఎక్కువ మొత్తం నిల్వ ఉన్న ఖాతాదారుడి పేరు మొదటి స్థానంలో ఉండి. అవరోహణ క్రమంలో సున్నా బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ల పేర్లనూ చూపిస్తోంది. ఈ ఏటీఎంను న్యూయార్క్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సీహెచ్‌ఎఫ్ సంస్థతో కలిసి పెర్రోటిన్‌గ్యాలరీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ప్రయోగాత్మకంగా దీనిని మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు. సాధారణ ఏటీఎంలో లాగానే ఇందులోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చట. అయితే కొత్తదనంతో ఉండటం వలన చాలా మంది ప్రజలు దీనిని ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తుడడం విశేషం.