Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ధర్నాకు దిగారు. ఆపై కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్ బాధితులకు అండగా ఉండి పోరాటం చేస్తామని తెలిపారు. రాజకీయ నాయకుల రియల్ ఎస్టేట్ల కోసం పేద రైతుల భూముల్లో నుండి రోడ్డు వేస్తున్నారని మండిపడ్డారు. చిన్న, సన్నకారి రైతులను ఆదుకోవాలన్నారు. భూమికి భూమిని ఇవ్వాలని అధికారులు మరోసారి సమీక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు డిసెంబర్ 8న రీజనల్ రింగ్ రోడ్ బాధితులు జాతీయ రహదారి దిగ్బంధం చేయనున్నారు.