Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఢీల్లీ
నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ తరుణంలో ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి.
- కెమెరా లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు
- టీవీ పార్టులపై ప్రస్తుతం ఉన్న 5శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం
- వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరిగే అవకాశం
- లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన సామగ్రిపైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు
- రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి
ధరలు తగ్గేవి
- మొబైల్, ల్యాప్‌టాప్, డీఎస్‌ఎల్‌ఆర్‌ల కెమెరా లెన్సులు, టీవీ ప్యానెల్ పార్టులు, లిథియం అయాన్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం, డైమండ్‌ల తయారీ వస్తువులు
ధరలు పెరిగేవి
బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువులు, వెండి ఉత్పత్తులు, సిగరెట్లు, టైర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు, రాగి తుక్కు, రబ్బర్