Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. శానససభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కంటివెలుగు లాంటి కార్యక్రమాన్ని పంజాబ్, ఢిల్లీలో చేపడతామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారని గుర్తుచేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలుచేసి రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. దళితులు ఆత్మగౌరవంతో బతికేలా దళితబంధు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు.