Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ ముగిశాయి. కేవలం మెయిన్స్ పరీక్షలు మాత్రమే మిగిలాయి. అయితే ఫిజికల్ ఈవెంట్స్‌లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాలేకపోయిన చాలా మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని కోర్టు ఆదేశించింది.
ఈ తరుణంలో కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంబర్‌పేట పోలీసు గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్‌లో ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఎత్తు విషయంలో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులు మరోసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే ఈ దరఖాస్తుతో పాటు అడ్మిట్‌కార్డును చూపించి, ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.