Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ధి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ధి

- తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి.ప్రకాష్‌
నవతెలంగాణ-ధూల్‌పేట్‌
జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ధి అని తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి.ప్రకాష్‌ అన్నారు. సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఆచార్య జయశంకర్‌ ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ పరామర్శ' అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం కంటే జలమే విలువైనదన్నారు. జల సంరక్షణ దృష్టి లేకపోతే వచ్చే తరం మనల్ని క్షమించదని, నీటివనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవటంలో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో తాగునీటి సమస్యలు ఎదురవుతాయని, ఈ దుస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం జలవనరులను అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. 46 వేల జలసంఘాలను నియమించి వాటి సేవల ద్వారానే నీటి వనరుల అభివృద్ధి సాధ్యమైందన్నారు. కార్యక్రమాల్లో ఎన్‌జీవో సంస్థలు, కళాశాలలు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐటీ రంగంలో చాలా ప్రగతి సాధించి, విస్తృతంగా ఉపాధి అవకాశాలను పెంచిందన్నారు. ప్రస్తుతం ఫార్మా రంగంలో చేస్తున్న కృషి ఫలితంగా భవిష్యత్తులో హైదరాబాద్‌, ప్రపంచానికే ఫార్మా క్యాపిటల్‌ కానున్నదని అన్నారు. తెలంగాణలో 60 శాతం సాగుభూమి పెరిగిందని, 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి అయితే, 2021లో తెలంగాణలో 240 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందన్నారు. ఇదే రాష్ట్రం సాధించిన ప్రగతి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో, సిటీ కళాశాల నాయకుడిగా తనకు పునర్జన్మనిచ్చిందని గుర్తు చేసుకున్నారు.
స్టేట్‌ బాంక్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రానీ మాట్లాడుతూ హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అంతర్జాతీయ సంస్థలన్నీ నగరం వైపు చూస్తున్నాయని అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదని, రాష్ట్రాభివృద్ధికి ఇదొక మంచి సూచిక అని అన్నారు. టి.హబ్‌ ఒక వినూత్న ప్రయత్నమని ఆయన కొనియాడారు. వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.రఘునందన రావు 'తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం' అంశంపై మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం చాలా సంక్షోభంలో ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, వివిధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అధిక భూమి సాగులోకి వచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ డా.పి.బాలభాస్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ, వస్తూత్పత్తి, ఎగుమతి రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో జరుగుతున్న కృషి, ఎదురవుతున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు విషయ నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. అనంతరం పరిశోధనా పత్రాలతో ముద్రించిన ప్రత్యేక సంచికను వి.ప్రకాష్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు డాక్టర్‌.జి.యాదగిరి, డాక్టర్‌.రాజేందర్‌ సింగ్‌, డాక్టర్‌.డి.టి.చారి, డాక్టర్‌. సౌందర్య, సురేశ్‌, ఆచార్య రేవతి, ఆచార్య విజరు, ఆచార్య డైసీ, డాక్టర్‌.బాల శ్రీనివాస్‌, డాక్టర్‌.గోపాల సుదర్శనం, డాక్టర్‌.వేణు ప్రసాద్‌, డాక్టర్‌.పావని, డాక్టర్‌.కృష్ణవేణి, లతారాణి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా సీక సాయికుమార్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు
గగన సేవలు ఇక హైదరాబాద్‌ నుంచి..
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం విడ్డూరం
పెండింగ్‌ అభివృద్ధి పనులను మొదలు పెడతాం
నేటి బాలికలే రేపటి మహిళలు
పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి :చైర్మన్‌ అబ్దుల్లా సాది
సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రవీణ్‌
కుత్బుల్లాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం
రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
సైదాబాద్‌ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు: సర్పంచ్‌ మల్లేష్‌
తెలంగాణ వెల్నెస్‌ సెంటర్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఔట్సోర్సింగ్‌..
క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించిన శ్రీనివాస గుప్తా
కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుదాం
అర్హులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
జై గణేశా భక్తి సమితిని క్యాలెండర్‌ ఆవిష్కరణ
ప్రజలకు సేవ చేయడం అభినందనీయం
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అద్భుత విజయాలు
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి
వైశ్యులు, బ్రాహ్మణులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలు
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రకృతిని కాపాడుకోవడానికి మిగిలింది ఆరేండ్లే
ట్రీ-కటింగ్‌ పేరుతో భారీ కొమ్మలు నిరికివేత
చదువుతో కూడిన ఆరోగ్య సేవలు అవసరం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కాలేరు
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.