Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కు రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి అవార్డు దక్కింది. రాజాబహద్దూర్ వేంకట రామారెడ్డి నగర పోలీస్ కమిషనర్‌గా మొట్టమొదట పనిచేశారు. అమీన్ (ఎస్‌ఐ) నుంచి కొత్వాల్ (నగర పోలీస్ కమిషనర్) వరకు ఎదిగిన రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి ప్రజల అభివృద్ధి, న్యాయం కోసం కృషి చేసేవారు. అడుగడుగునా ఆదర్శాన్ని చాటిన ఆయనను బ్రిటీష్ అధికారులు 'ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంఫైర్' టైటిల్‌తో సత్కరించారు. 'రాజాబహద్దూర్' అంటూ నిజాం రాజు బిరుదిచ్చారు. అంతటి మహనీయుని (ఆగస్టు 22, 1869-1953) జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ' రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి' పేరుమీద అవార్డును ప్రదానం చేస్తారు. ఇదిలావుండగా ఆయన పేరుమీద ట్రస్టును ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు విధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డును అందజేస్తున్నారు. 148 జయంతి సందర్భంగా ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్సులో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్ శ్రీధర్‌కు నగర పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. సంచలన నేరాలు ఛేదించడం తోపాటు, అంతర్రాష్ట్ర నేరగాళ్లను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. నగరంలో సంచలనం రేపిన చైన్‌స్నాచర్లను, దృష్టి మళ్లించి దోపిడీ చేసే ముఠాలతోపాటు బవారీయా గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ముఠాలను చాకచక్యంగా పట్టుకు న్నారు. 398 చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. వారితోపాటు సంచలనం రేపిన హత్య కేసులను ఛేదించారు. గతంలో సేవాపథకాన్ని అందుకున్న శ్రీధర్ 27 మెరుగైన ప్రతిభ, 165 ఉత్తమ సేవలు పథకాలతోపాటు 25 క్యాష్ అవార్డులను అందుకున్నారు. సోమవారం గోల్డ్ మెడల్‌తో పాటు క్యాష్ అవార్డును అందుకు న్నారు. సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్, డీసీపీ కమలాసన్ రెడ్డి, టాస్క్‌ఫోర్సు అదనపు డీసీపీ కోఠిరెడ్డి తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.