Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంగీతమే అతని ప్రపంచం | జోష్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జోష్
  • ➲
  • స్టోరి
  • Oct 09,2022

సంగీతమే అతని ప్రపంచం

           పాట అతని పేరు. స్వరాలు అతని ఊరు. చిన్నప్పటి నుంచి ఎస్‌.పి. బాల సుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ పెరిగాడు ఈ యువ గాయకుడు.. ఊహ తెలిసినప్పటి నుంచి సంగీతం తోనే తన ప్రయాణం అంటూ నడవసాగాడు. పాటల పదనిసలతో పరవళ్ళు తీస్తూ సాగుతున్నాడు. ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ తో సంగీత అభిమానుల హృదయాలను అలరిస్తున్నాడు. అటు గీతరచయితగా కూడా తన సత్తా చాటుకుంటున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ దూసుకొస్తున్నాడు. ఇప్పటికే ఇతని పాటలు ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలై శ్రోతల మన్ననలందుకున్నాయి. లక్షలాది మందిని ఆకర్షించాయి. పాటతో పాటే తన ప్రయాణమని, సంగీతమే తన ప్రపంచమని అంటున్న యువ గాయకుడు, సంగీతదర్శకుడు, గీతరచయిత సుమంత్‌ బొర్రాతో ఈ వారం నవతెలంగాణ జోష్‌...
- మీ జీవిత నేపథ్యం గురించి చెప్పండి?
ముందుగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా తల్లిదండ్రులు వాణి శ్రీనివాస్‌ బొర్ర గారికి నా నమఃసుమాంజలి.. అలాగే నా సోదరి చందన కూడా ఈ సంగీత ప్రయాణం చూసి ఎంతగానో సంతోషించేది. నేను కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంటలో పుట్టాను. మా నాన్న గారు కొత్తగూడెంలోని mmdc కంపెనీలో ఉద్యోగం చేసేవారు. అలా నా బాల్యం అంతా కూడా 10వ తరగతి వరకు కొత్త ఇందిరా ప్రియదర్శిని స్కూల్లో చదివాను. దాని ద్వారా ఇంటర్మీడియట్‌ కోసం నారాయణ జూనియర్‌ కళాశాలకు వెళ్లి అక్కడ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసాను. నా పై చదువులకు పంజాబ్‌ లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీకి వెళ్ళి నా గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్‌ చేసుకున్నాను. అక్కడే ప్రొఫెషనల్‌ గా నా సంగీత ప్రయాణం మొదలయింది.
- సంగీతం వైపు దృష్టి ఎలా మరలింది?
చిన్ననాటి నుంచి అనేకానేక పాటలపోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నాను. అవన్నీ కూడా సంగీతం పై ఎంతో మక్కువను పెంచాయి. అదేవిధంగా చిన్ననాటినుండి పాఠశాలల్లో నా బాల్య స్నేహితులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, బంధువులు ఎంతగానో ప్రోత్సహించారు. ఎన్నో ప్రశంసలు కూడా కురిపించారు. ఇవి అన్ని కూడా పట్టుదల తో , కృషితో జరిగాయి.. సంగీతంలో ఒక కొత్తదనం తీసుకురావాలన్న ఆసక్తి ఎంతగానో పెరిగి ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ తో జనాలని అలరించాలన్న తపన నాలో గట్టిగా స్థిరపడింది. అలా కొనసాగించినదే ఈ సంగీత ప్రయాణం..
- మీ పాటలప్రస్థానం గురించి చెప్పండి?
నా బాల్యం నుంచి నేను అన్ని రకాల పాటలను కూడా పాడేవాడిని. నా చిన్నతనంలో క్లాసికల్‌ మ్యూజిక్‌ లైట్‌ ఓకాల్‌ మీద ఎక్కువ మక్కువ ఉండేది.. అలా రాను రాను అనేక పాటలను వినడం వల్ల నాకు కొంచెం వెస్ట్రన్‌ క్లాసికల్‌ కలయికతో అనేక పాటలను చేయాలన్న సంకల్పం ఎక్కువగా ఉండేది.. అలా నా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకోవడానికి పంజాబ్‌ లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ లో చేరాను. అక్కడ అనేక దేశాలు నుంచి రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చే వారు. అందులోని కొందరు సంగీతంపైన ఆసక్తి చూపించి ఒక మ్యూజికల్‌ ట్రూప్‌ ఫామ్‌ చేశాను. అలా అనేక యూనివర్సిటీలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే వాడిని. మంచి ప్రోత్సాహం, గుర్తింపు అందరిలో లభించింది..
- గాయకుల్లో మీకు రోల్‌ మోడల్‌ ఎవరు?
నేను చిన్నప్పటి నుంచి గాన గంధర్వుడు ఎస్‌.పి.బాల సుబ్రహ్మణ్యం గారి పాటలను ఎంతగానో ఇష్టపడే వాడిని. చిన్నప్పటినుండి కూడా ఎంతగానో ఆదరించేవాడిని.. ఆయన పాటలలో కంఠస్థ స్వరమాధుర్యాన్ని ఎంతగానో ఆరాధించే వాడిని.. అందువలన నా మొదటి మెట్టు ఆయన నుంచి ప్రారంభమైనది.
- ఏకకాలంలో సంగీతదర్శకుడిగా, గాయకుడిగా, గీతరచయితగా దూసుకెళ్ళడం మామూలు విషయం కాదు..ఇన్ని కోణాల్లో మీరు కృషి చేస్తున్నారు. ఇందుకు సమయాన్ని ఎలా కేటాయించుకుంటున్నారు?
నా మొదటి మెట్టు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఏదో సాధించాలనే తపనతో కష్టపడే వాడిని..అటు నేను వృత్తి రీత్యా పురోహితున్ని. నా చదువు కి కూడా ఏ మాత్రం అడ్డు లేకుండా చాలా పగధ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసుకునే వాడిని.. ఇప్పుడు కూడా ఒక ఉన్నత ఉద్యోగం చేస్తూ నా సంగీత ప్రయాణ యాత్రను కొనసాగిస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూనే వాటి భావాలను బాగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను.. సంగీత సాహిత్యంలో ఎంత మంది ఉన్నా అందరూ ఒక వైపు అయితే బాలు గారు మాత్రం ఒక వైపు ఎందుకంటే ఆయన పాడే విధానం గానీ ఆయన హావ భావాలు కానీ ఆయన స్వర ఉచ్ఛారణ చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది.. అలా ఆయన పాటలు వింటూనే ఆ భావాలకు అర్థాలు తెలుసుకునే వాడిని.. అప్పుడు నేను కూడా ఒక రచయితగా గుర్తింపు తెచ్ఛుకోవాలనే తపనతో నా సొంతంగా పాటలు రాయడం వైపు ఆసక్తి చూపించే వాడిని.
- మీకు జీవితంలో ఎంతో ఆనందాన్నిచ్చిన సంఘటన?
నేను నా మిత్రుడు వెంకటేష్‌ వుప్పల నా గ్రాడ్యుయేషన్‌ నుండి కూడా ఎన్నో రంగస్థల ప్రదర్శనలు చేసేవాళ్లం. చదువుకునే రోజుల్లో,నన్ను సొంతంగా పాటలు కంపోజ్‌ చేసే సత్తా నీకు ఉందీ అని ఎంతగానో ప్రోత్సహించే వాడు.. అలా నేను పాటలను స్వరపరచడం మొదలెట్టాను. వెంకటేష్‌ వుప్పల, నేను పంజాబ్‌ లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూని వర్శిటీలో ఇద్దరం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి హైదరాబాద్‌ వచ్చాం..కోవిడ్‌ లో ఇంట్లోనే కూర్చోని కొన్ని పాటలను స్వరపరిచి పెట్టుకొని కొంచెం పరిస్థితులు సరిదిద్దుకున్నాక అన్నీ బాగు అయ్యాక పాట రిలీజ్‌ చేద్దామని ''ఎలా మరి రావా'' అని ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ కంపోజ్‌ చేసి రెడీ వీడియో కూడా చేసి పెట్టుకున్నాం. అదే సమయం లో ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ సహాయంతో ఆ పాట విదుదల చేయాలని అనుకోని వారి దగ్గరకు వెళ్ళాం..అది చూసి విని వాళ్ళు ఎంతగానో ప్రశంసలు కురిపించారు.. ఆ క్షణం జీవితంలో మరువరానిది..ఆ పాట ప్రేక్షకులు ఎంతగానో వీక్షించి ఆదరించారు..కొంతమంది సినీ ప్రముఖుల మన్ననలను కూడా పొందాము. ఆ పాట లక్ష వ్యూస్‌ దాటింది..
- మీరు పొందిన ఉత్తమమైన ప్రశంస?
2016 లో గణనాయక అని ఒక భక్తి ఆల్బమ్‌ ని తెలుగు వన్‌ ఛానల్‌ ద్వారా రిలీజ్‌ చేయడం జరిగింది..అది నేను స్వర పరిచిన మొదటి పాట.. ఆ పాటకి నా స్నేహితులు చాలా సపోర్ట్‌ చేసారు విజువల్స్‌ బాగా రావటానికి.. ఆ సమయం లో నేను గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నాను. జీవితంలో మార్చి పోలేని క్షణాలవి.. దాని తర్వాత 2020లో విశ్వం అని ఇంకో పాట నా మిత్రుడు రాఘవ శర్మతో కలిసి ఆదిత్య మ్యూజిక్‌ వాళ్ళని సంప్రదించి అందులో విడుదల చేసాను..వారికి ఆ పాట ఎంతగానో నచ్చింది..అలాగే ప్రేక్షకులు కూడా ఆదరించారు. 2022లో పడిపోయా.. పాటతో మరో విజయం మమ్మల్ని వరించింది..
నా మిత్రుడు వెంకటేష్‌ వుప్పల సంగీత సారథ్యంలో సుమంత్‌ బొర్ర నిర్మాణంలో వచ్చిన పాట 'పడిపోయా' పాట.. ప్రేక్షకులతోపాటు మెహర్‌ రమేష్‌, తరుణ్‌ భాస్కర్‌, గీతా భాస్కర్‌, సంగీత దర్శకులు స్వీకర్‌ అగస్తి, కార్తీక్‌ కొడకండ్ల,గాయకుడు దీపు వంటి పరిశ్రమ ప్రముఖులనూ ఫిదా చేసింది. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ పాటని సుమంత్‌ బొర్ర ఆలపించారు. అటు సినిమా పాటలు, ఇటు ఆల్బమ్‌ సాంగ్స్‌ శ్రోతల్ని, ప్రేక్షకుల్ని ఊర్రూ తలూగిస్తున్నారు. ఇప్పుడు 'పడిపోయా' పాట ద్వారా మాకు మరింత మంచి గుర్తింపు వచ్చింది. కొత్తదనం ఉండేలా కంపోజ్‌ చేస్తే, పాటలోనూ ఆ కొత్తదనం కనిపిస్తుంది. 'తెలుగు, దక్షిణాది సంగీత పరిశ్రమలో పాశ్చాత్య టచ్‌ ని తీసుకురావాలనే స్పష్టమైన లక్ష్యాలతో సంగీత విజయం సాధించామని అనుకుంటున్నాం. పరిశ్రమకు వచ్చాం. మా అభిరుచిని కళలోకి తీసుకురావడంలో రొటీన్‌ కి భిన్నంగా ఉండాలని మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ వెంకటేష్‌ వుప్పల కొత్తగా ఆలోచిస్తూ, తన మార్క్‌ ని క్రియేట్‌ చేశారు. మూడు సంవత్సరాల నుండి ఆదిత్య మ్యూజిక్‌ తో కలిసి పని చేశాం. ఇది నా జీవితంలో ఉత్తమమైన ప్రశంసగా, అభినందనగా భావిస్తాను..
- ఎలాంటి పాటలకి ట్యూన్‌ చేయడమంటే ఎక్కువ ఇష్టం? అంటే ఫోక్‌ ఆ? రొమాంటిక్‌ ఆ? మెసేజ్‌ ఓరియంటెడ్‌ ఆ?
నేను ఎక్కువ మెలోడీలు, మెసేజ్‌ ఓరియెంటెడ్‌, వెస్ట్రన్‌ మరియు క్లాసికల్‌ కాంబినేషన్‌ జానపద పాటలు కంపోజ్‌ చేయడానికి మక్కువ చూపిస్తాను.చేసిన పాట ఏదైనా ట్రెండీగా ఉండేలా చూసుకోవటం..నాకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకోవటం నా ప్రత్యేకత. దీనితో పాటుగా ప్రేక్షకులకి వినసొంపుగా ఉండేలా చేస్తాను..
- మీరు పొందిన పురస్కారాల గురించి చెప్పండి?
నేను బాల్యంలో అనేక జిల్లా స్థాయీ పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలిచేవాడిని.. వాటికంటే ఎక్కువగా నాకు చాలా అద్భుతమైన ప్రోత్సాహం నా గ్రాడ్యుయేషన్‌ రోజులే. అవే నాకు గొప్ప జ్ఞాపకం, పేరు తెచ్చి పెట్టాయి. నేను నా సొంతగా పాటలు విడుదల చేయటం మొదలు పెట్టాక అనుకోకుండా నా కష్టానికి కొంత మంది పత్రిక మీడియా విలేకరులు గుర్తుంచి నా గురించి,నా పాటల గురించి మరియు సంగీత ప్రయాణం గురించి రాయటం జరిగింది.అది నా జీవితంలో ఊహించని ఒక మధుర జ్ఞాపకం,అలా మరెన్నో పత్రికలు ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ది పయనీర్‌, ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, హిందూస్తాన్‌ టైమ్స్‌, తెలంగాణ టుడే, ది హాన్స్‌ ఇండియా, దిశా డైలీ "(TIMES OF INDIA,THE PIONEER,THE NEW INDIAN EXPRESS,HINDUSTAN TIMES,TELANGANA TODAY,THE HANS INDIA,DISHA DAILY)  మీడియా విలేకర్లు ఎంతగానో ప్రోత్సాహించారు.. ఈ ప్రశంసలనే నా పురస్కారాలుగా భావిస్తాను..
- చివరగా..పాటంటే ఒక్క మాటలో ఏం చెప్తారు?
పాట ఒక మధురానుభూతి..అనిర్వచనీయమైన ఆనందం.. దానిని ఒక్క మాటలో చెప్పి ముగించలేం.. దాని గొప్పతనాన్ని వర్ణించడం వీలు కాదు..

- జోష్‌ టీం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతర్జాతీయంగా సత్తాచాటాలంటే అనువాదాలు తప్పనిసరి
సంక్రాంతి - నవకాంతి
చలి
ఐనా నాకేమీ తెలుసమ్మా..
దేశానికి పట్టుకొమ్మ టీ - హబ్‌
నిజాక్షరాలు
నిజం, ఇష్టం కలిసోస్తేనే...
పట్టపగలే
పాటంటే ప్రాణం
యువతకు స్ఫూర్తి ... మెస్సీ కీర్తి...
వాట్సాప్‌ 'డోంట్‌ డిస్టర్బ్‌' ఫీచర్‌
నా దృష్టిలో సినిమా అనేది ఒక అద్భుతమైన ఊహ..
తానొక అక్షరాలు విచ్చుకుంటున్న మల్లెతీగ...
ఆమె కళ్ళు
గుర్తించాల్సిన సమయం
జీవితం అంటే....
చిత్తడైన మనసు
చెలీ...సఖీ...ప్రియా...
గజల్‌
చివరికి ...
సినిమా నా ప్రాణం..
నువ్వులేక...
మనషుల మదిని దోచే పూల పండుగ
కాలానికి అలవాటే!
నిన్నటి దారి
నేటి రాజా కీయం
వీరుడా పుట్టొద్దు...
'కీర్తి' పలుకులు
ఊరు వదిలి
మానసిక సంక్షోభంలో మంటో గావుకేకలే ఈ గల్పికలు

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.