Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తానొక అక్షరాలు విచ్చుకుంటున్న మల్లెతీగ... | జోష్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జోష్
  • ➲
  • స్టోరి
  • Oct 23,2022

తానొక అక్షరాలు విచ్చుకుంటున్న మల్లెతీగ...

తొంగి తొంగి చూస్తున్న
నీ ఓర చూపులూ
నా కంటి రెప్పలను తాకుతున్నప్పుడు
నేనొక కొత్త ఊపిరినెత్తుకొని
మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది

నీ ముఖంపై
నల్లని కురులు నాతో దాగుడుమూతలు
ఆడుతున్నప్పుడు
నా యెదమీదికి మర్లవడ్డ
నీటిని అంతా ముడేసి
ఎనక్కి లాగేస్తున్నట్టు అనిపిస్తుంది.

నేను నీ చెంతలేనప్పుడు
నువ్వొక వాన జల్లువై
నాకోసం పరితపిస్తుంటే
నా మనుసొక
పాలింకిన పాలకంకి అవుతుంది.

నీ వెనక చల్లగాలిలా
అంటిపెట్టుకొని నన్ను కాపాడుకుంటుంటే
నేను నడిచే నిప్పుల తోవకు
నువ్వొక నీటి వాగులా అనిపిస్తుంది.
నా వైపు చూస్తూ
అందంగా నవ్వినప్పుడు
నీ మొహంలో వచ్చే వెలుగుకు
ఉడుకు ఉడుకు గంజిలో
నేనొక బువ్వ మెతుకును అవ్వలేనా..!

ఆ వెలుతురు కాంతులను
నా చీకటి దారుల ఇనుప కంచెలముందు
పూతోటలు పూయించి
ఓ పువ్వునై పూస్తున్నాను.

నవ్వడం మరిచిపోతున్న
నా పెదాలకు
నవ్వును పరిచయం చేసింది
నీ పరిచయమే కదా..!

మా పత్తి శెల్కలో
పత్తి ఆకులు ముడుసుకున్నట్లు
అలిగి నువ్వు మూతి ముడుసుకుంటే
సిగ్గెక్కిన నీ ఎరుపు సెంపలపైన
నా పెదాలు తడిచేస్తున్నప్పుడు
పత్తి పువ్వోలే అందంగా
నీ నవ్వులు పురుడోసుకుంటై.
నీ కనుబొమ్మలు... నాకై
నెమలి పింఛములా విచ్చుకుంటై

నా కంటిపాపల్లో నువ్వొక
అక్షరాల తీగవై పారుతున్నప్పుడు
నీ సొగసంచుకు కవిత్వాన్ని అల్లాలని
ఎప్పటికప్పుడు సీరా చుక్కనై వాలిపోతూ ఉంట..

నా కౌగిల్లో నువ్వు జారిపోతే
పేదోని ఇండ్ల అప్పు కాగితంలో
మిత్తీలు మోసుకొచ్చిన
కన్నీటి బరువు యాధికొత్తాంది

నా మనుసుకు ఊపిరందని క్షణాన
నీ పలకరింపే నాకొక
పచ్చని చేనులు మోసుకొచ్చిన
ప్రకృతి పైరగాలోసొంటిది.

నీ ఊపిరి నా ఊపిరితో
పెనవేసుకొని ఒక్కటైనప్పుడు
భూమాత ఒడిలోనుంచి
అప్పుడే పుట్టుకొచ్చే
మొక్కలవుతున్నం.

నీ పాదాలు చేసే అడుగుల సప్పుడుకు
నేనొక '' మువ్వల-పట్టీను'' అవుతానో
నీ సెంపల్లో మొలిచే సిగ్గుకు
నేనొక గాలి అణువును అవుతానో
కలసి వేసిన అడుగుల అలసటలు
చెబుతాయి.

మనిద్దరి మధ్య
కన్నీళ్ళు లేని ప్రేమను చూడాలని ఉంది
ఒకవేళ ఉంటే
ప్రేమతో ఆనందంగా వచ్చే కన్నీళ్ళు మాత్రమే
అయ్యి ఉండాలి..!

- శివకుమార్‌ తాళ్ళపల్లి , 9133232326.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతర్జాతీయంగా సత్తాచాటాలంటే అనువాదాలు తప్పనిసరి
సంక్రాంతి - నవకాంతి
చలి
ఐనా నాకేమీ తెలుసమ్మా..
దేశానికి పట్టుకొమ్మ టీ - హబ్‌
నిజాక్షరాలు
నిజం, ఇష్టం కలిసోస్తేనే...
పట్టపగలే
పాటంటే ప్రాణం
యువతకు స్ఫూర్తి ... మెస్సీ కీర్తి...
వాట్సాప్‌ 'డోంట్‌ డిస్టర్బ్‌' ఫీచర్‌
నా దృష్టిలో సినిమా అనేది ఒక అద్భుతమైన ఊహ..
ఆమె కళ్ళు
గుర్తించాల్సిన సమయం
జీవితం అంటే....
సంగీతమే అతని ప్రపంచం
చిత్తడైన మనసు
చెలీ...సఖీ...ప్రియా...
గజల్‌
చివరికి ...
సినిమా నా ప్రాణం..
నువ్వులేక...
మనషుల మదిని దోచే పూల పండుగ
కాలానికి అలవాటే!
నిన్నటి దారి
నేటి రాజా కీయం
వీరుడా పుట్టొద్దు...
'కీర్తి' పలుకులు
ఊరు వదిలి
మానసిక సంక్షోభంలో మంటో గావుకేకలే ఈ గల్పికలు

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.