Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యువతకు స్ఫూర్తి ... మెస్సీ కీర్తి... | జోష్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జోష్
  • ➲
  • స్టోరి
  • Dec 25,2022

యువతకు స్ఫూర్తి ... మెస్సీ కీర్తి...

             మెస్సీ.. మెస్సీ.. మెస్సీ.. లియోనెల్‌ మెస్సీ.. నేడు ప్రపంచమంతా మార్మోగుతున్న పేరిది. వాస్తవానికి ఫిఫా సాకర్‌ సంగ్రామం ఆరంభ సమయం నుంచీ ఈ ఏడాది ప్రపంచం నోట్లో నానుతున్న నామమిది. ఆదివారం రాత్రి దోహాలోని లుసైల్‌ స్టేడియంలో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలిచిన తరువాత ఈ పేరు క్రీడా శిఖరాలను స్పృశిస్తూ ఖండాంతరాలను తాకింది. ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన సాకర్‌ వరల్డ్‌ కప్‌ను చేతిలోకి తీసుకుని మెస్సీ ముద్దాడగానే ప్రపంచం మురిసిపోయింది. అతడు తమ వాడే అన్నట్టు పొంగిపోయింది. అయితే, ఈ 35 ఏళ్ల అర్జెంటీనా మాస్ట్రో తన జీవన గమనంలో ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొన్నాడు. గ్రోత్‌ హార్మోన్‌ లోపంతో పొట్టివాడైన అతన్ని అనేక అవహేళనలు చుట్టిముట్టినా, చిరుతలా కదిలి వాటన్నంటినీ తన కాలితో గోల్‌పోస్టు అవతలికి తన్నిపారేశాడు. తను అనుకున్న 'గోల్స్‌'ను సాధించి గొప్ప ఆటగానిగా కీర్తిగడించాడు. చే గువేరా అంటే ప్రాణమిచ్చే మెస్సీ జీవితాన్ని పరికించి చూస్తే ఎన్నో విషయాలు స్ఫూర్తినిస్తాయి.
             మెస్సీ 1987 జూన్‌ 24న అర్జెంటీనాలోని రోసారియోలో ఫుట్‌బాల్‌ను ఇష్టపడే కుటుంబంలో జన్మించాడు. నలుగురు పిల్లల్లో మూడో సంతానం మెస్సీ. తోబుట్టువులలో ఇద్దరు అన్నలు, ఒక చెల్లి ఉన్నారు. తండ్రి జార్జ్‌ మెస్సీ ఉక్కు కార్మికుడు. తల్లి సెలియామారియా కుసిట్టిని క్లీనర్‌. చిన్నతనం నుంచీ మెస్సీ ఫుట్‌బాల్‌ ఆడటం పట్ల గొప్ప అభిరుచిని పెంచుకున్నాడు. కుటుంబం నుంచి అతనికి మద్దతు దొరికింది. దీంతో నాలుగు సంవత్సరాల చిన్న వయస్సులోనే గ్రాండోలీ పేరుతో ఉన్న స్థానిక ఫుట్‌బాల్‌ క్లబ్‌లో చేరాడు. మైదానంలో తన తోటి ఆటగాళ్ల నుంచి ఫుట్‌బాల్‌ను త్వరగా పట్టుకుని, బంతిని చాలా నిమిషాల పాటు తన పాదాల ఆధీనంలోనే ఉండేటట్టు చూసేవాడు. సాల్వడార్‌ అపారిసియో తొలి గురువు. చిన్నతనంలో ప్రతి మ్యాచ్‌లో మెస్సీ ఆరు నుంచి ఏడు గోల్స్‌ చేసేవాడు. తన కంటే చాలా పెద్ద ఆటగాళ్లు ఉన్నప్పటికీ అతను బెదిరేవాడుకాదు. ఆరు సంవత్సరాల వయస్సులో అతను తన నగరం రోసారియోలో ఉన్న క్లబ్‌ అట్లెటికో నెవెల్స్‌ ఓల్డ్‌ బార్సులో చేరాడు.
హార్మోన్‌ లోపంతో పొట్టివాడైనప్పటికీ..
             మెస్సీ ఇతర ఆటగాళ్లతో పోల్చినప్పుడు చాలా చిన్నవాడు. ఇప్పటికీ సాకర్‌ ఆడే అన్ని జట్లలో పొట్టి ఆటగాడు. కానీ అది అతనిని సాకర్‌లో టాప్‌ స్కోరర్‌గా మారకుండా ఆపలేకపోయింది. చిరుప్రాయంలోనే మెస్సీ బాగా ప్రాచుర్యంపొందాడు. అనేక ఫుట్‌బాల్‌ క్లబ్‌లు అతనిని నిశితంగా పరిశీలించసాగాయి. మెస్సీకి పదేళ్లు వచ్చే వరకూ పరిస్థితి బాగానే ఉంది. ఎండోక్రినాలజిస్ట్‌ డియెగో స్క్వార్జ్‌స్టెయిన్‌ మెస్సీకి గ్రోత్‌ హార్మోన్‌ లోపం ఉన్నట్లు నిర్ధారించాడు. ఆ విషయం మెస్సీ కుటుంబానికి తెలిసి వారి ఫుట్‌బాల్‌ కలలన్నింటినీ బద్దలు చేసింది. వాస్తవానికి గ్రోత్‌ హార్మోన్‌ లోపం (జిహెచ్‌డి) అరుదైన రుగ్మత. దీంతో వ్యక్తి పొడవుగా ఎదగలేడు. మెస్సీని ఈ హార్మోన్‌ లోపం చుట్టుముట్టింది. చికిత్సలో భాగంగా అతని తల్లిదండ్రులు ప్రతిరోజూ రాత్రి గ్రోత్‌ హార్మోన్లను అతని కాళ్ళకు ఇంజెక్ట్‌ చేసేవారు. మెస్సీ తండ్రి అతని చికిత్సను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే భరించగలిగాడు. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు న్యూవెల్స్‌ ఓల్డ్‌ బార్సు ఫుట్‌బాల్‌ క్లబ్‌ అతని చికిత్స కోసం డబ్బులు చెల్లించడాన్ని నిరాకరించింది. చాలా క్లబ్‌లు మెస్సీని వదులుకున్నాయి. కొద్ది కాలం తరువాత బార్సిలోనా జట్టు డైరెక్టర్‌ చార్లీ రెక్సాచ్‌ మెస్సీ గురించి ఆరా తీశాడు. తగు శిక్షణ అందేలా చూశాడు. బార్సిలోనా క్లబ్‌ తరుపున ఆడేందుకు మెస్సీతో 2000 డిసెంబర్‌ 14న తొలి ఒప్పందం చేసుకున్నాడు.
కొత్త అధ్యయనానికి నాంది
             2001 ఫిబ్రవరిలో మెస్సీ, అతని కుటుంబం స్పెయిన్‌కు మకాం మార్చారు. అప్పటికి మెస్సీకి 13 ఏళ్లు. అతడు ఇక్కడ కొత్త సమస్యలను ఎదుర్కొన్నాడు. విదేశీ ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని నిబంధనల కారణంగా మొదటి సంవత్సరంలో చాలా అరుదుగా ఫుట్‌బాల్‌ ఆడాడు. 2002లో మెస్సీ పేరు రాయల్‌ స్పానిష్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌లో నమోదు చేయబడింది. ఇతర ఫుట్‌బాల్‌ ఆటగాళ్లతో పోల్చినప్పుడు మెస్సీ చాలా పొట్టిగా ఉన్నందున అతని సహచరులు అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయేవారు. మెస్సీ మైదానంలో ఆడటం చూసి వారి సందేహాలన్నీ తీరాయి. మెస్సీకి తన ఎత్తు తన లోపమని తెలుసు కాబట్టి అతను తన లోపాన్ని భర్తీ చేయడానికి చాలా కష్టపడి ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేశాడు.
అంతర్జాతీయ ఆరంగేట్రం ఇలా..
             2005 ఆగస్టు 17న హంగేరీతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో మెస్సీ తన మొదటి అంతర్జాతీయ ఆరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే బార్సిలోనా క్లబ్‌ ర్యాంకుల్లోకి ఎదిగాడు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఫుట్‌బాల్‌ కెరీర్‌లో లెక్కలేనన్ని విజయాలు సాధించాడు. అర్జెంటీనా నెదర్లాండ్స్‌లో జరిగిన 2005 ఫిఫా వరల్డ్‌ యూత్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడు మెస్సీనే. ఆరు గోల్స్‌ చేసి గోల్డెన్‌ బాల్‌, షూ రెండింటినీ గెలుచుకున్నాడు. 2007 మార్చి 10న తన మొదటి హ్యాట్రిక్‌ సాధించాడు. చైనాలోని బీజింగ్‌లో జరిగిన 2008 సమ్మర్‌ ఒలింపిక్స్‌లో ఒలింపిక్‌ బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. 2012లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక గోల్స్‌ కొట్టి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు. ఆ ఒక్క ఏడాదే అతడు మొత్తం 91 గోల్స్‌ చేశాడు. మారడోనా కాలం తరువాత కొద్ది కాలం పాటు నిస్తేజంగా ఉన్న అర్జెంటీనాకు కొత్త ఊపిరిలూదాడు. తను ఆడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ బలమైన జట్టుగా తీర్చిదిద్దాడు. 2009, 2010, 2011, 2012, 2015 సంవత్సరాల్లో వరల్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఏడు బాలన్‌ డిఓర్‌ అవార్డులను కైవశం చేసుకున్నాడు. మెస్సీ క్లబ్‌, తాను ఆడిన దేశం కోసం 793 గోల్స్‌ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఫుట్‌బాల్‌ ప్రపంచంలోని దాదాపు అన్ని రికార్డులనూ అతడు ముద్దాడాడు.
చే గువేరా, మారడోనా అంటే ఎనలేని ప్రేమ
             ప్రపంచ విప్లవకారుడు, యూత్‌ ఐకాన్‌ చే గువేరా, ఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనా అంటే మెస్సీకి ఎనలేని ప్రేమ. ఇదే విషయాన్ని 2011లో మీడియాకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో అతడు గుర్తు చేశాడు. 'ఎక్కడైనా చే గువేరా, మారడోనా బొమ్మలతో కూడిన చొక్కాలను చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. అందమైన అనుభూతికి లోనవుతాను. మారడోనా, చే గువేరాలు గొప్ప వ్యక్తులు' అని మెస్సీ చెప్పుకొచ్చాడు.

- కోడూరు అప్పలనాయుడు,
  94915 70765

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క‌థ‌లు విందాం రారండోయ్‌..!
నీలిపొద్దు పువ్వు
కొసరు
తొలి సారె
చందమామ కథ
అంతర్జాతీయంగా సత్తాచాటాలంటే అనువాదాలు తప్పనిసరి
సంక్రాంతి - నవకాంతి
చలి
ఐనా నాకేమీ తెలుసమ్మా..
దేశానికి పట్టుకొమ్మ టీ - హబ్‌
నిజాక్షరాలు
నిజం, ఇష్టం కలిసోస్తేనే...
పట్టపగలే
పాటంటే ప్రాణం
వాట్సాప్‌ 'డోంట్‌ డిస్టర్బ్‌' ఫీచర్‌
నా దృష్టిలో సినిమా అనేది ఒక అద్భుతమైన ఊహ..
తానొక అక్షరాలు విచ్చుకుంటున్న మల్లెతీగ...
ఆమె కళ్ళు
గుర్తించాల్సిన సమయం
జీవితం అంటే....
సంగీతమే అతని ప్రపంచం
చిత్తడైన మనసు
చెలీ...సఖీ...ప్రియా...
గజల్‌
చివరికి ...
సినిమా నా ప్రాణం..
నువ్వులేక...
మనషుల మదిని దోచే పూల పండుగ
కాలానికి అలవాటే!
నిన్నటి దారి

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.