Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంతర్జాతీయంగా సత్తాచాటాలంటే అనువాదాలు తప్పనిసరి | జోష్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జోష్
  • ➲
  • స్టోరి
  • Jan 15,2023

అంతర్జాతీయంగా సత్తాచాటాలంటే అనువాదాలు తప్పనిసరి

మీ నేపథ్యము, సాహిత్యం వైపు జరిగిన ప్రయాణం గురించి వివరించండి?
మాది తెలుగు-కన్నడ విభజన రేఖతో ముడిపడివున్న సరిహద్దు గ్రామాల్లో ఒకటైన గరినేకులపల్లి మా ఊరు (అనంతపురం జిల్లా, రామగిరి మండలం). మా ఊరు కర్ణాటకకు సరిహద్దుకి అర కిలోమీటర్‌ దూరంలోనే ఉంటుంది. మా ఊర్లో ప్రాథమికోన్నత వరకే పాఠశాల ఉండడం వల్ల నా ఉన్నత పాఠశాల విద్య పక్కనే ఉన్న కర్ణాటకలో సాగింది. మాది పూర్తిగా గొర్రెలు కాసే వృత్తి. రమ్యమైన రంగస్థల పద్యాలతో మొదలై అలాఅలా గురజాడ, శ్రీశ్రీ, జాషువా, వేమన, సర్వజ్ఞ, కువెంపు వంటివారి సాహిత్యాలలోకి తెలియంకుండానే ఆరాదిస్తూ పోయను. అస్త్విత్వ నేపథ్యంలో భాగంగా మా రాయలసీమ సాహిత్యంతో ప్రయాణం చేస్తున్నాను.
అనువాదకులుగా మారడానికి భౌగోళికపరంగా మీ ప్రాంతం కారణంగా చెప్పుకోవచ్చా?
ఒకింత అయ్యుండొచ్చు. భౌగోళికంగా కర్ణాటకతో మాకు సాంస్కృతిక, సామాజిక అనుబంధాలన్ని పెనవేసుకొని ఉంటాయి. మా సరిహద్దులో కన్నడకంటే తెలుగునే ఎక్కువగా మాట్లాడతారు. అయినా అక్కడి తెలుగువారిపై తప్పకుండా కన్నడ ప్రభావం ఉంటుంది. మాట్లాడే మాటల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది. మా ప్రాంత ప్రజలకు నాటి హైదరాబాద్‌, నేటి అమరావతి రాజధానిల కంటే బెంగుళూరుతోనే ఎక్కువ అనుభంధం కలిగి ఉంటారు. చాలామంది అసలు వాటిని చూసి కూడా ఉండరు. ప్రభుత్వ వ్యవహారాలు తప్పితే మిగతా అంతా మా జీవితాలు కర్ణాటకతోనే ముడిపడి ఉంటాయి. స్వతహాగా నేను తెలుగువాడిని. అయినా తెలుగు-కన్నడ రెండిటిని చదువుకున్నాను. అందువల్లే అనువాద సాహిత్యం, తులనాత్మక సాహిత్యం రెండు చేయగలుగుతున్నాను.
ఒక అనువాదకుడిగా తెలుగులో ఇప్పుడు వస్తున్న అనువాదాలు పాఠకుల్లో ఎంత మేరకు విజయవంతం అవుతున్నాయని భావిస్తున్నారు?
తెలుగులోకి జరుగుతున్న అనువాదాలపట్ల కొద్దో గొప్పో సంతృప్తిగా ఉన్నా తెలుగు నుంచి వెళ్తున్న అనువాదం విషయంలో ఏమంత సంతృప్తికరంగా జరగలేదనిపిస్తుంది. ఈ అనువాదాల విషయంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నామనిపిస్తుంది. ఇతరభాష నుంచి ఏ అనువాదం వచ్చినా తెలుగువారు అమితంగా ఇష్టపడి సోషల్‌ మీడియాలో గొప్పగా పంచుకుంటున్నటువంటి సందర్భాలు మనందరం చూస్తున్నాం. అంటే అనువాద రచనల్ని తెలుగుపాఠకులు బాగా ప్రోత్సహిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. భాషకు ఇదొక శుభపరిణామంగా భావించవచ్చు.
తెలుగు-కన్నడల అనువాదకులుగా ఈ రెండుభాషల మధ్య జరిగిన అనువాదాలకు మీరు చేస్తున్న కొనసాగింపు ఏంటి?
మనలో చాలామందికి ఆంగ్ల సాహిత్యాన్ని, వారి సంస్కృతిని గురించి తెలుసుకోవాలనే ఉన్నంత కుతూహలం, ఉబలాటం మన సంస్కృతిని, సాహిత్యాన్ని, చరిత్రను ఇతరులకు తెలియజేయాలనే తపన లేకపోవడం చాలా బాధాకరం. ప్రత్యేకించి మనం మనకు ఇరుగుపొరుగున ఉన్న సాహిత్యాలను ముందుగా తెలుసుకోవాలి. సహచర భాషా సాహిత్యాల్లోని సంగీతం, నాటకరంగం, చరిత్ర, సంఘసంస్కర్తలు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తెలుగు-కన్నడ సాహిత్యాల గురించి ప్రస్తావిస్తే ఆ అనుబంధం ఈనాటిది కాదు. అనుబంధాన్ని అనేకమంది బలోపేతం చేయడానికి చాలావరకు కృషి చేశారు. చేస్తున్నారు. వారిలో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, వీరకేసరి సీతారామశాస్త్రి, టీ.ఎస్‌. వెంకన్నయ్య, తంగిరాల వెంకట సుబ్బారావు, శ్రీధర్‌ మూర్తి, ఆర్‌.వి.ఎస్‌. సుందరం, జి.ఎస్‌ మోహన్‌, జానుమద్ధి హనుమత్‌ శాస్త్రి... మొదలైనవారి కృషి అనన్యమైనది. ఈ కోవలోనే రంగనాథ రామచంద్రరావు, ముకుంద రామారావు, కుం. వీరభద్రప్ప, కొలుకులూరి ఆశాజ్యోతి, రామనాథం నాయుడు, అజరు వర్మ అల్లూరి, స. రఘునాథ లాంటి వారు కూడా అనేక అనువాదాలు చేస్తున్నారు. అయితే నేను ప్రత్యేకించి తులనాత్మక సాహిత్యంతోపాటు అనువాదాలను కూడా సమాంతరంగా చేస్తున్నాను. ఇంతవరకు కన్నడ సాహిత్యంలో బీరప్పల సంస్కృతి, కత్తిని, కలాన్ని పట్టి సమాంతరంగా రాణించిన బహుజనస్త్రీల సాహిత్య, జీవిత విశేషాల గురించి అధ్యయనం చేసి తెలుగువారికి చెప్పే ప్రయత్నం చేశాను. తెలుగు కన్నడ ప్రాచీన కవయిత్రుల సాహిత్యం గురించి అంతవరకు ఆ ప్రయత్నం జరగలేదు. ఈ సోదర భాషల మధ్య ఉన్న ఖాళీలు నావంతుగా పూరించే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నా.
తులనాత్మకత, అనువాదాలు మధ్య తెలుగు భాషకు ఇప్పటివరకు లబ్ధి చేకూరింది ఎంత అంటే ఏమి చెబుతారు?
అనువాదాలు ఏ భాషకైన ప్రయోజనమే చేకూరుస్తాయి. అది తెలుగుభాషకు ఎంతమేరకు లబ్ధి చేకూరింది అన్న విషయం చర్చించాల్సివస్తే తెలుగు సాహిత్యం ప్రారంభమే అనువాదంతో మొదలైంది. ఆ ప్రవాహం ప్రాచీన సాహిత్యంతో పరుగులు పెట్టిన తర్వాత కాలంలో కాస్త మందగిం చాయి. తెలుగులో వచ్చిన ఆధునిక సాహిత్యం లోని బలమైన వాదాల సాహిత్యాలు పరభాషల్లోకి విరివిగా తీసుకొచ్చినట్లైతే అప్పుడు తెలుగు రచయితలకు లబ్ధి చేకూరు తుంది. కందుకూరి. గురజాడ, జాషువా, విశ్వనాథ, సినారె, కాళోజి, దాశరథి లాంటి రచయితల రచనలు కూడా విరివిగా ఇతరభాషలోకి అనువాదాలు చేస్తే అప్పుడు మన రచయితలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభిస్తుంది. ఈ విషయంలో కేంద్ర సాహిత్య అకాడమీ తప్పితే మిగతా సంస్థలు వాటికి ఆదరణ కలిగించ లేదనే చెప్పాలి.
మీ ''తగటు'', ''ఇరుగు-పొరుగు'' తులనాత్మక వ్యాసాలు తెలుగువాళ్లకు కన్నడపై ఏ విధమైన అవగాహనని ఏర్పరచుతాయని నమ్ముతున్నారు?
ఒక రచయిత ఆలోచనలను రెండుభాషల్లోకి అందించే ప్రయత్నం ఎప్పుడూ కొత్తదే. నేను రాసిన ''ఇరుగు-పొరుగు'' ''తగటు'' అనే పుస్తకాలు పూర్తిగా తులనాత్మకమైనవి. కన్నడ భాషలో ఉన్న 'బండాయ' సాహిత్యాన్ని తెలుగుభాషలో వచ్చిన దళిత, బహుజన, మైనార్టీ వాదాలతో పోల్చి చూసే ప్రయత్నం చేశాను. అలాగే ఇరుభాషల్లోని శృంగార కవితల్ని, పత్రికల్లో మహిళలు చేసిన కృషిని, స్వాతంత్రం పూర్వం కన్నడ నవలల్లో స్త్రీ పాత్రల చిత్రణని తులనాత్మక కోణంలో చెప్పాను. కన్నడ సాహిత్యాన్ని తెలుగువారి అవగాహనలోకి తెచ్చుకొనేందుకు ఈ పుస్తకాలు ఉపకరిస్తాయని భావిస్తున్నా.
పస్తుతం ఆంగ్లంకి జరిగే అనువాదాలు అధికంగా ఉన్నాయి. ఇతర ప్రాంతీయ భాషల్లోకి జరిగే అనువాదాలు తక్కువగా ఉన్నాయి. రెండింటిలో వేటివల్ల భాషకు అధిక ప్రయోజనం చేకూరుతుంది?
ఎన్ని భాషల్లోకి అనువాదం జరిగితే అంత ప్రయోజనం మూలభాషకి. అంతర్జాతీయంగా ఉన్న పాఠకులను ఆకర్షించడానికి ఆంగ్లం మధ్యమంగా ఉపయోగపడుతుంది. ఆ భాషద్వారా ఇతర భాషల్లోకి అనువదించడానికి సులువవుతుంది. అంతర్జాతీయతతో పాటు జాతీయంగా కూడా అనువాదాలు జరగాలి. ఆంగ్లంతో పాటు అన్ని ప్రధాన భారతీయభాషల్లోకి కూడా విరివిగా అనువాదం జరగాలి. వీటివల్ల రచయితకంటే భాషకు అధిక ప్రయోజనం చేకూరుతుంది.
అన్ని భాషల్లోనూ అన్యభాషా పదప్రయోగాలు ఎక్కువగానే వచ్చి చేరుతున్నాయి. అనువాదం చేస్తున్నప్పుడు వీటివలన సులభతరమవుతుందా క్లిష్టతరమవుతుందా?
అనువాదం ఎప్పుడూ సంక్లిష్టమేనదే. మూలభాష నుండి లక్ష్యభాషలోకి అనువాదం అంత సులువైన పనేంకాదు. లక్ష్యభాషలోని పదజాలంపై సున్నితమైన అవగాహనతోపాటు ప్రాంతీయత, మాండలికాలపై సుక్ష్మత తప్పనిసరి. ఒకోసారి మూలభాషలోని పదానికి లక్ష్యభాషలోని సమాంతర పదానికి భావపొంతన కుదరకపోవచ్చు. తిట్లు కూడా ఒక భాషలో ఉపయోగించినంత సులభంగా ఇంకొక భాషలో ఉపయోగిస్తే అది వివాదమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. మూలభాష చదువుతున్నప్పుడు కలిగే భావోద్వేగం, సన్నివేశాలు, పాత్రల ఉన్నతం, హృదయాన్ని కరిగించే సందర్భాలు, అమాయకత్వం, మూర?త్వం లక్ష్యభాషలో అంతే స్థాయిలో పండించాలంటే రచయిత ప్రసవవేదన అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే రచయితకున్నంత స్వేచ్చ అనువాదకుడికి ఉండదు.
కన్నడ రచయితలతో పోల్చితే తెలుగు రచయితలు వాడే అన్య భాషాపదాలు ఎక్కువ. అందులో సంస్కృత, ఆంగ్లభాషా పదాలే అధికం. అనువాదమప్పుడు ఒకింత సమస్యగానే ఉంటుంది. ప్రపంచీకరణ వల్ల ఇప్పుడు అన్ని భాషల్లోకి అన్యభాషా పదాలు ప్రవేశిస్తున్నాయి. వాటికి సమానార్థక నూతన పదసృష్టి జరుగుతుంది. వీటి నుంచి కూడా అనువాదకుడికి ఇబ్బందులు ఉంటాయి. భాషల్లో నూతనంగా కలిగే మార్పులపై అనువాదకుడికి నిరంతర అవగాహన ఏర్పరుచుకొని ఉండాలి.
అనువాదాలు విరివిగా జరగాలంటే ఏం చేయాలి?
అనువాదం అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఒక రచయిత ఆలోచనలను విశ్వవ్యాప్తం చేయడం అంటే చిన్నవిషయం కాదు. అందుకు ప్రతి విశ్వవిద్యాలయంలోనూ అనువాద పీఠాలు, అనువాదశాఖలు ఏర్పాటు చేసి పూర్తిగా అనువా దాలకే ఆ విభాగాలను పరిమితం చేయాలి. అప్పుడు జాతీయంగా, అంతర్జాతీయంగా మన తెలుగు సత్తా చాటుతుంది. అంతర్జాలం అన్ని రంగాల్లో ప్రభావం చూపు తున్న తరణంలో సాహిత్య సంస్థలు కూడా సదవకాశంగా భావించి అనువాదాలపై దృష్టి సారించాలి. ఇందుకు పాఠకుల నుంచి కంటే ప్రభుత్వాల సహకారం అధికంగా ఉండాలి.
అనువాదకులుగా అక్కడికి ఇక్కడికి ఏమి తేడాలు గమనించారు?
సాహిత్యం విషయంలో అన్నింటిలోనూ కన్నడవారు ముందున్నారు. ప్రతుల అమ్మకం నుంచి పత్రికలువాళ్ళు ఇచ్చే పారితోషకం వరకు. అక్కడ భాష విషయంలో అందరు ఐఖ్యత-సఖ్యత పాటిస్తారు. భాషకు సంబంధించి ఎవరు కృషి చేసిన గుర్తించి, ప్రోత్సహించడంలో ముందుంటారు. రచయిత లతో సమానంగా అనువాదకుల్ని భావి స్తారు. ఇప్పుడిప్పుడే తెలుగులో ఆ వాతా వరణం ఏర్పడుతుంది.
అనువాదకుడిగా భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి?
ప్రస్తుతం కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ దృక్పథం అనే పుస్తకాన్ని కన్నడ లోకి అనువదిస్తున్నాను. కన్నడంలోని కవిరాజమార్గాన్ని తెలుగులోకి అనువ దించాలని వున్నా.. కన్నడతో పోల్చితే తెలుగులో ూ+దీు ('గే' సాహిత్యం) సాహిత్యం చాలా తక్కువగా వచ్చింది. వాటిని కూడా అనువదించాలి. చూడాలి. ఎంతమేరకు సఫలీకృతుణ్ణి అవుతానో.
- బి. మదన మోహన్‌ రెడ్డి, 9989894308
  పరిశోధక విద్యార్ధి,హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రకృతితో రీచార్జ్‌ అవుతున్న టెక్కి
మా అమ్మ అందరిలా కాదు
ఫ్లాష్‌ ఫ్లాష్‌
ఘోష
క‌థ‌లు విందాం రారండోయ్‌..!
నీలిపొద్దు పువ్వు
కొసరు
తొలి సారె
చందమామ కథ
సంక్రాంతి - నవకాంతి
చలి
ఐనా నాకేమీ తెలుసమ్మా..
దేశానికి పట్టుకొమ్మ టీ - హబ్‌
నిజాక్షరాలు
నిజం, ఇష్టం కలిసోస్తేనే...
పట్టపగలే
పాటంటే ప్రాణం
యువతకు స్ఫూర్తి ... మెస్సీ కీర్తి...
వాట్సాప్‌ 'డోంట్‌ డిస్టర్బ్‌' ఫీచర్‌
నా దృష్టిలో సినిమా అనేది ఒక అద్భుతమైన ఊహ..
తానొక అక్షరాలు విచ్చుకుంటున్న మల్లెతీగ...
ఆమె కళ్ళు
గుర్తించాల్సిన సమయం
జీవితం అంటే....
సంగీతమే అతని ప్రపంచం
చిత్తడైన మనసు
చెలీ...సఖీ...ప్రియా...
గజల్‌
చివరికి ...
సినిమా నా ప్రాణం..

తాజా వార్తలు

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.