Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రత్యక్ష ప్రసారం... | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Nov 21,2021

ప్రత్యక్ష ప్రసారం...

వరుస పండుగల సీజన్‌ కావటంతో షాపింగ్‌ మాల్‌ రద్దీగా ఉంది.. వెల్కం గర్ల్‌ డ్యూటీవేయటంతో వచ్చే, వెళ్ళే కస్టమర్లకు చిరునవ్వుతో స్వాగత, వీడ్కోలిస్తోంది పద్మ.. గంటలపాటు నిల్చునే ఉండటం వల్ల కాళ్లు పీకుతుండటంతో కొద్దిగా పక్కకొచ్చి ఒక స్టూల్‌పై కూర్చోబోతూ అప్పుడే అటుగా వస్తున్న సూపర్‌వైజర్‌ కంటపడింది.. 'ఏం నిలబడలేకపోతున్నావా.. ఓనర్‌వా సేల్స్‌ గర్ల్‌వా.. ఏం చూసు కోని ఆఫోజు అవ్వి చూసుకోనేనా'..అంటూ ఆమె వెనుకవైపు వెటకారపు చూపు చూడగానే బాణం దిగిన పక్షిలా విలవిల్లాడింది..
   మేనేజర్‌ క్యాబిన్‌ నుంచి తిరిగొస్తూ కనిపించగానే..
    'నీకు అరవంరాదుగా.. మరి ఎలా పిర్యాదు చేశావు' అంది సైమా పద్మకు ఎదురెళ్తూ.. 'ఏడుస్తూ చెప్పాను కన్నీళ్ళు అన్ని భాషల్లో ఒకటే' అంది పద్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా.... తనతో కలిసి ముందుకు నడుస్తూ నడుస్తూ వెనుతిరిగి మేనేజర్‌ క్యాబిన్‌ వైపు చూసింది సైమ ఏదో ఆశతో.. పద్మ మాత్రం ఏ ఆశాలేనట్టు ఇంటి బాట పట్టింది..
   చీర అప్పుడే విప్పినట్టుంది తను.. మంచ మ్మీద అదేదో డిజైన్‌ వేసినట్టుగా పడుంది.. అంతలో అక్కడి కొచ్చిన పార్వతి చీరను మడతపెట్ట బోతుండగా... 'వద్దులే అమ్మా ఉతికేసుకుంటా రేపటికి కావాలిగా' అంది..'
   చీరకట్టే ఈడు కూడారాని నీకెన్ని చిక్కులొచ్చాయే తల్లి' అని నిట్టూర్చింది పార్వతి...
  'రూల్‌ అమ్మా కంపల్సరీ చీరే కట్టు కోవాలి' అంటూ మూలు గుతుండే సరికి..
  'కాల్లొత్తనా బిడ్దా' .. అంటూ దగ్గరి
   కొచ్చింది పార్వతి..
   ఆ..కొంచెం అమృతాంజన్‌ కూడరాయి అమ్మా... అంది పద్మ నైటీ కొంచెం పైకెత్తుతూ.. మూత తీసినట్టుంది పార్వతి వాసన ఆచిన్న గదిలో అలుముకుంది.. అదేంటో.. అమృతాంజన్‌ బాటిల్‌ చూసినపు డల్లా.. చిన్నతనం గుర్తొస్తుంది... ఈమధ్య తరచూ దానివాడకం జరుగుతోది..
   'గింత చిన్నీడుకే కాళ్లతీపులైతె ఎట్లబిడ్డ.. ఆపని బంద్‌ జేయరాదు ఎట్లోగట్ల ఎల్లుతదిలేగని' అంది పార్వతి అమృతాంజన్‌ పట్తిస్తూ.. 'ఎప్పటికుంటయానె నొప్పులు అదే అలవాటైతదిలే' అంది పద్మ.. నైటీని మోకాళ్ల వరకు జరుపుకుంటూ..
   మరుసటి రోజు బస్‌లో వస్తున్నప్పుడు మా ఎలక్షన్స్‌ ప్రెస్‌మీట్‌ వీడియో చూస్తున్న సైమ.. 'ఈ గొట్టాం గాళ్ళేందే.. సినిమా వాళ్లమీదికి, రాజకీయ నాయకులమీదికి అట్లా కుక్కలెగబడినట్టెగబడతారు'.. అనగానే.. 'ష్‌.. తప్పు అలా అన కూడదు.. వాళ్లని మీడియా అనాలి.. మీడియా అంటే అందరికీ గౌరవం అందుకే వాళ్లెంత చికాకుపరిచే ప్రశ్నలడిగినా ఓపికగా సమాధానం చెబుతారు తప్ప ఎవరూ కోపగించుకోరు'... అని పద్మ ఖండించేసరికి....' ఏంటో వాళ్ల గొప్పతనం' అంది సైమా ఆవీడియో స్కిప్‌ చేస్తూ.. 'మీడియాది ప్రపంచ గొంతు ఆగొంతు ద్వారా తాము చెప్పాలనుకున్నది చెప్పాల్సినవాళ్లకి సులువుగా చేరుతుంది'.. అంది పద్మ దిగాల్సిన స్టాప్‌ దగ్గరికోస్తుండటంతో లేచి నిలబడుతూ..
   'ఏరు ఏంటాజాగు, ఎంతసేపు సర్దటం కానివ్వండి, పనికొచ్చారా పెళ్లికొచ్చారా'.. కొంచెం అరవం, కొంచెం తెలుగులో పెద్ద గొంతేసుకొని అరుస్తున్న సూపర్‌వైజర్‌ను చూస్తూ..' అరవం, అరవం అంటారు కానీ ఈ అరవోళ్లు ఒకటే అరిచిచస్తారే'... డ్రెస్‌లు బాక్సుల్లోకి సర్దుతూ అంది రజియా వచ్చీరాని తెలుగులో.. ఆమాట వినగానే కుప్పలుపడిన చీరెలు మడతేస్తున్న సైమ కిసుక్కున నవ్వింది.. 'వీళ్లదగ్గర పనిచేసేవాళ్లకే అరవచాకిరీ అనిపేరొచ్చిందను కుంటా' అని తనూ పంచ్‌ వేసేసరికి ఈసారి రజియా కూడా నవ్వింది..
   వరుస పండుగల సీజన్‌ కావటంతో షాపింగ్‌ మాల్‌ రద్దీగా ఉంది.. వెల్కం గర్ల్‌ డ్యూటీవేయటంతో వచ్చే, వెళ్ళే కస్టమర్లకు చిరునవ్వుతో స్వాగత, వీడ్కోలిస్తోంది పద్మ.. గంటలపాటు నిల్చునే ఉండటం వల్ల కాళ్లు పీకుతుండటంతో కొద్దిగా పక్కకొచ్చి ఒక స్టూల్‌పై కూర్చోబోతూ అప్పుడే అటుగా వస్తున్న సూపర్‌ వైజర్‌ కంటపడింది..
   ఏం నిలబడలేకపోతు న్నావా.. ఓనర్‌వా సేల్స్‌ గర్ల్‌వా.. ఏం చూసు కోని ఆఫోజు అవ్వి చూసుకోనేనా'.. అంటూ ఆమె వెనుకవైపు వెటకారపు చూపు చూడగానే బాణం దిగిన పక్షిలా విలవిల్లాడింది..
   'మీరు వీడికి కుక్క అనే పేరెందుకుపెట్టారో ఇప్పుడర్థ మవు తోంది' ... అంది పద్మ లంచ్‌ టైం లో..
   'ఈ కుక్కని అంటే అను గానీ ఆ కుక్కల్నేం అనకు.. అది యజ మానినే కాదు ఆ ఇంటిపనోళ్లనీ అంతే ప్రేమిస్తుంది, అదే విశ్వాస మిస్తుంది.. ఈ కుక్క యజమానిని మాత్రమే గుర్తిస్తుందీ..
  'ఎప్పుడు చూడు మొరగటమే, ఎప్పుడుచూడు అరవటమే'..
   'హహా'..
   'ఎందుకు నవ్వు
   ఏం లే.. చెప్పు
   ఏం లేదన్నాగా..
   ఉందిలే చెప్పు
   'ఏకుక్కకైనా బిస్కెట్లు పని చేస్తారు'
  'అంటే'..
   'ఈ కుక్కకి కావల్సింది ఆడ మాంసం'
   'హా 'ఆడ..మాంసం'
   'ఈ కుక్కలు మొరిగేదే అందుకులే'
   'హ్మ్ ...షోకేస్‌ బొమ్మలు బతికి పోయారు'
    'షోకేస్‌ ఉండబట్టికా'..
    'ప్రాణం లేకపోబట్టికి' నిట్టూరుస్తూ సైమాతో అంది పద్మ ..
    'ఆడతనం లేకపోబట్టి కూడా' ఖాళీ బాక్సులు స్టోర్‌ రూంలో పడేసేందుకు అప్పుడే అటువైపొస్తున్న రజియా మెల్లిగా వాళ్లకే వినపడేలా అంది....
    'సరేలే మీరు నడవండి.. నేను వాష్‌ రూంకెళ్లొస్తా'.. అంది పద్మ.. 'డ్యూటీ ఎక్కేటైం అవుతోంది' అంది సైమ తన చేతివాచ్‌ వైపు చూపిస్తూ.. 'ఇంకా అయిదారు నిమిషాలుందిగా' అంటూ వాష్‌ రూంవైపు నడిచింది..
    ఖైదీల ములాఖత్‌ కోసం జైళ్ళో ఒకచోటున్నట్టు వాష్‌ రూం అంతరాత్మల్ని కలుసుకునేచోటు.. అద్దంలోకి చూడగానే ఎవరి అంతరాత్మ వాళ్లకు కనిపిస్తుంది.. ఎవరికీ చూపలేని దుఖపుమూట అక్కడ విప్పుకుంటారు కొందరు ఏకాంతంగా....
    అద్దంలో.. పద్మతోపాటు తన ప్రతిరూపమూ ఏడుస్తూనే ఉంది.. మెడను కుడివైపుతిప్పి తన వెనుక భాగం వైపు చూసుకుంది.. తరువాత ఎడమకు తిప్పి చూసుకుంది.. ఎటునుంచీ కనిపించకక పోవటంతో... వెనుకద్దంలోకి చూసింది.. ఆవెంటనే తన సీటు గురించి సూపర్‌ వైజర్‌ మురికి మాటలు ప్రతిధ్వనించారు.. అప్పటికే తన అయిదు నిముషాల గడువు ముగియటంతో వెనుదిరిగింది... సగం తెరిచి ఉన్న లెట్రిన్‌లో నుంచి వెస్ట్రన్‌ కమోడ్‌ నోరు తెరిచి తననే చూస్తోంది...
    'నా కళ్లమీద నేను నిలబడాలి'... ఇంటర్‌ పూర్తవుతూనే కలలు కనేది పద్మ.. దిగువ మధ్యతరగతి కుటుంబం కావటంతో తను తల్లిదండ్రులకు భారం కాకూడదని తన ఉద్దేశ్యం.. బీటెక్‌ ఫీజు కట్టేందుకు తల్లి తనపుస్తెలు తాకట్టుపెట్టి డబ్బుతెచ్చే ప్రయత్నాల్లో ఉండగా.. అప్పటికే మంచంలో ఉన్న తండ్రికి మరింత సీరియస్‌ అయ్యింది.. దాంతో పుస్తెల్ని పూర్తిగా అమ్మేసి ఆ డబ్బంతా హాస్పటల్ళకు ధారపోయటంతో తను బీటెక్‌ మెట్టెక్క లేకపోయింది.. షాపింగ్‌ మాల్లో ఖాళీల గురించి తన వీధిలో కొందరి ద్వారా తెలుసుకొని వచ్చి జాయిన్‌ అయ్యింది.. అన్ని కార్యాలయాల్లో మాదిరిగా అక్కడ కుర్చీలుండవని వచ్చిన దగ్గర్నుంచి ఇంటికెళ్ళేదాక నిలబడే పని చేయాల్సి ఉంటుందని చెపితే పట్టించుకోకపోయినా అదెంతనరకమో అనుభవంలో తెలుస్తోంది..
    షాపింగ్‌ మాల్‌లో తను చేరి ఆరునెలలు దాటుతోంది.. రెండోనెల నుంచే సూపర్‌వైజర్‌ వేధింపులు మొదలై ఏనెల కానెల అధికమవుతున్నాయి.. ప్రతినెలా పని ఇక మానేద్దా మనుకునేంతలో ఏదో ఒక ఆర్థిక కష్టం ఎదురవు తుండటంతో గుండెరాయి చేసుకుంటోంది..
    ఇంటికి వచ్చీ రావటంతోనే అలసటగా కుర్చీలో కూలబడింది పద్మ.. నేలమీద కూర్చోని ఏదో పని చేసుకుంటున్న పార్వతి పద్మ పాదాల వైపు చూస్తూ.. 'పాదాలా ఇవి దోసకాయలా... ఇలా పగిలాయేంటే'.. అంది ఆమాట వింటూ కుడిచేతిని తనపాదంపై స్శృంచగానే పగుళ్లు గరుకుగరుకుగా తగిలాయి.. ఇంతలో సైబాల్‌ డబ్బా మూత తీస్తూ ఆనెర్రెల్లో పూసింది పార్వతి.. లావు తగ్గాలమ్మా, ఎక్కువ బరువు వల్లనేమో అంది పద్మ.. ఇది లావు కాదే నువ్వు పుట్టినప్పటి నుంచి బొద్దుగానే ఉంటావ్‌ అంది పార్వతి..
    'ఇంటి ముందు మురిక్కాలు వలా ఈ ఇరుకు సందొకటి' అనుకుంది పద్మ మరుసటి రోజు షాప్‌లో మరొక సేల్స్‌గర్ల్‌ని దాటుకుంటూ తన స్థానంలో నిలబడెందు కెళుతూ..
    'చూడండి మేడం ఇవి లేటెస్ట్‌... కొత్తగా వచ్చారు'.. అప్డేట్‌ ట్రెండీస్‌ రుచి చూపిస్తోంది కస్టమర్స్‌ను రిసీవ్‌ చేసుకుంటూ.. నిద్రపోతున్నప్పుడు వాళ్లింట్లో వాళ్లెవరన్నా గమనిస్తే చాలామంది సేల్స్‌ గర్ల్స్‌ నిద్రలోనూ ఇదే కలవరిస్తారేమో... అప్పటికీ పగళ్లు కొందరు తమ పరధ్యానలో ఇలానే పలవరిస్తుంటారు.. నర్సరీ పిల్లోళ్లకు గుణింతాలు, పదాలు, ఎక్కాలు నోట్లో తిరిగినట్టు..
    చదువుకున్న దానివి అంత చిన్న పన్లోకెందుకే అంది తల్లి తను షాపింగ్‌ మాల్‌లో చేరతానన్న రోజు.. చిన్నదైతే కానీ నాకాళ్లమీద నేను నిలబడాలి అంది పద్మ... ఇప్పుడిలా నిలబడుతున్నప్పుడల్లా అది గుర్తొచ్చి నవ్వొస్తుంటుంది తనకు..
    కానీ కొన్ని రోజులుగా తనలో నవ్వులేదు.. చీటికిమాటికి వేధింపుమాటలే గుర్తొస్తున్నారు.. షాపింగ్‌ మాల్‌ అసలు యజమాని చెన్నైలో ఉంటాడట.. మేనేజర్‌, సూపర్వైజర్‌ ఇంకా ఇతర మగ సిబ్బందంతా అరవోళ్ళే..
    'అదిగో.. ఆ అమ్మాయిని గద్దిస్తు న్నాడే సూపర్‌వైజర్‌ వాడిపేరు కుక్కుటేశ్వర్రావు.. కానీ వాడ్ని మేమంతా కుక్కటేశ్వర్రావ్‌ అని పిలుస్తాం'.. వాడు అలా అరుస్తున్నాడంటే ఆ అమ్మాయి పనిచేయటం లేదని కాదు, తనదారికి రావటం లేదని పనిలో చేరిన కొత్తలో రజియా చెప్పిన మాటలు అక్షరసత్యాల్లాని పిస్తున్నారు.. సూపర్‌వైజర్‌ కోటేశ్వర్రావ్‌ మీద మేనేజర్‌కు పిర్యాదు చేసినా ఫలితం లేకపోగా అప్పటి నుంచి వేధింపులు మరింత అధికమయ్యారు.. కొద్దినిమిషాలు లేట్‌ అయినా గంట కోత విధించటం, ఏదన్నా అత్యవసరం ఉన్నా ఒక గంట కూడా ముందు పంపించకపోవటం వంటి సమస్యలొచ్చాయి..
    ఆలోచిస్తున్న పద్మ హఠాత్తుగా లేచి వాష్‌ రూం వైపు నడిచింది.. లోనికి ఎవరూ వెళ్లటానికి వీల్లేకుండా అడ్దంగా బైఠాయిం చింది.. మొదట ఆవిషయాన్ని కస్టమర్స్‌ గుర్తించి సూపర్‌ వైజర్‌కు పిర్యాదు చేశారు.. సూపర్‌ వైజర్‌ గద్దించినా పద్మ పట్టించు కోకపోవటంతో మేనేజర్‌కు కంప్లైంట్‌ చేశాడు సూపర్‌వైజర్‌.. షాపింగ్‌మాల్‌లో ఒక యువతి ధర్నా చేస్తోందన్న వార్త అలా, అలా మీడియకు చేరింది.. వెంట వెంటనే చానెళ్ల లైవ్‌ కవరేజీ మొదలయ్యింది..
    'మేం ఆడ కావొచ్చు, మగ కావొచ్చు.. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్స్‌, బార్‌ షాప్స్‌ పనుల్లో మేం ఇక నిలబడి పనిచేయం.. కూర్చునే హక్కు సాధనకు ఒక్కటిగా నిలబడతాం.. ఇకమేం పగిలిన మడమలం కాబోం నొప్పిపాదాలం, ఉబ్బిన సిరలం కాబోం'.. స్థిరంగా మాట్లాడుతోంది పద్మ.. తన తిరుగుబాటుకు సైమా మద్దతు పలుకుతూ తన గొంతు విప్పింది.... 'మేం మనుషులమా దీప స్థంభాలమా.. కూర్చుని పనిచేస్తాం, వెల్కంగర్ల్‌ టు సేల్స్‌ గర్ల్‌ రోజుకెన్ని గంటలు నిల్చోవాలి.. మాకు కూర్చునే హక్కుండాలి.. ఈలోగా మరికొందరు సేల్స్‌ గర్ల్స్‌ చేరటంతో 'షాపింగ్‌ మాల్స్‌లో రైట్‌ టు సిట్‌ ఇంప్లిమెంట్‌ కావాల్సిందే' నినాదాలు మార్మోగు తున్నాయి.. ఎన్నాళ్ల నుంచో అణిచిపెట్తిన ఆవేశం తలా ఒకరిలో ఒకోమాటగా పెల్లు బుకుతోంది.. 'కూర్చుని పనిచేసే ఏర్పాట్లు చేయిం చమని సూపర్‌ వైజర్‌ను అడిగితే మేనేజర్‌ని అడగమన్నాడు మేనేజర్‌కు మొరపెట్టుకుంటే యాజమాన్యానికి తెలియజేస్తానని చేతులుదులుపుకున్నాడు, ఓనరెవరో మాకు తెలియదు ఎప్పుడో అప్పుడొచ్చినప్పుడు చెపితే నచ్చితేనే పనిచెరు లేదంటే మానెరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు... ఎక్కడా మాకోసం ఒక్క కుర్చీలేదు.. కస్టమర్స్‌ కోసం వేసున్న కుర్చీల్లో మేం కూర్చోకూడదు.. డ్యూటీకి వచ్చాక గంటలు గడియారంలో గంటలు గడుస్తుంటం అందరికీ తెలుస్తుంటుంది..గంటగంటకూ మా కాళ్లు లాగుతుండటం అధికమవుతుండటం మాకు మాత్రమే తెలుస్తుంది.. పద్మ స్వరం మరింత పెంచింది..' ఇదుగో ఈ వాష్‌ రూం లోపలి ఈ లెట్రిన్‌లో ఉన్న ఈ వెస్ట్న్ర్‌ కమోడ్‌ తప్ప ఇంకెక్కడా ముడ్డిమోపే చోటులేదు అందుకే మా సమస్య ఇక్కడి నుంచే ప్రపంచానికి తెలియజేయా లనుకున్నా.. అందుకే ఇక్కడ ధర్నా చేస్తున్నాం.. మేమే కాదు ప్రతిచోట మాలాంటోళ్లంతా ధర్నాకు దిగాలి ఇది నా ఒక్కదాని సమస్యే కాదు.. అందరూ పని బహిష్కరించండి.. అందుకే ఇక్కడి నుంచి లైవ్‌ చేస్తున్నా.. మీడియా సోదరులు కూడా వాళ్ల చానెళ్లలో లైవ్‌ ఇస్తున్నారు.. షాపింగ్‌ మాల్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూడండి మాకు మద్దతు తెలపండి..రైట్‌ టు సిట్‌ హక్కు అమలుకు తోడ్పడండి'.. ఆవేదన వెళ్లగక్కుతున్న పద్మ లైవ్‌ ప్రధానమంత్రి దృష్టికి చేరింది.
- శ్రీనివాస్‌ సూఫీ, 9346611455

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మలుపు
మా అక్కయ్య
బ్లాక్‌ లేక్‌
మాటల మూటలు
నిర్లక్ష్యం ఖరీదు
స్టాట్యూటరీ వార్నింగ్‌
ఎవడైతేనేం
పరీక్ష
అర్థం - పరమార్థం
బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సహాయకారి
సరాగాల శ్రీమతి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...
కానుగచెట్టు ఇల్లు..
ఎండి పోయిన చేపలు
ఎవరు ముందు?
పునరాగమనం
పాకీజ
బంధం
ఎవరికి తెలుసు?
గోస
'నీ ప్రేమకై'
ప్రేమ వాంగ్మూలం
'వజ్రాల భరిణె'
నెగటివ్‌
ఆ ఇద్దర్ని కలవబోతుంది

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.