Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'నీ ప్రేమకై' | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Feb 20,2022

'నీ ప్రేమకై'

తేజ్‌ ప్రాణాలతో ఉండి ఉంటే, కనీసం వేరే ఎవరితోనైనా హ్యాపీగా ఉంటాడనుకునేదాన్ని. అసలు ఈ లోకంలోనే లేడన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. తేజ్‌లేని నాకు.. బతకడమే బరువనిపించింది. ఇంట్లో నుంచి బయటకు రావాలనిపించలేదు. స్కూల్‌ కూడా మానేశాను. మూడు నెలలకు పైగా చీకట్లోనే.. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లింకిపోయాయి.
   మెట్రో స్టేషన్‌ రద్దిగా ఉంది. దూరంగా గుంపులో మాస్క్‌ పెట్టుకుని తేజ్‌ కనిపించాడు. మెట్రో రావడంతో ఎక్కాను. కాసేపటికి తేజ్‌ దగ్గరగా వచ్చి.. 'సారీ' అన్నాడు. కోపంతో నువ్వు ఇక్కడ్నుంచి వెళ్లిపో అని అరిచాను. కళ్లలోకి నీళ్లు తెచ్చుకుని నెక్ట్స్‌ స్టాప్‌లో దిగి వెళ్లిపోయాడు. ట్రైన్‌ స్టార్ట్‌ అయి వెళ్లి పోయింది. స్కూల్‌కి చేరుకున్నాను. అనవ సరంగా కోపడ్డానేమో, ఇప్పటికైనా అతను ఏం చెబుతాడో వినాల్సిందని మన సుకు అనిపించింది. అతనికి అప్పుడు దగ ్గరైనా, ఇప్పుడు దూరమైనా.. కారణం ప్రేమే.
   స్కూల్‌కి ఐదు నిమిషాలు లేటుగా వెళ్లాను. నా క్లాస్లో మరో వ్యక్తి ఉన్నారు. ఇంతలో రంగయ్య వచ్చి 'మేడమ్‌ ఈ క్లాస్‌ తేజ్‌ సార్‌ తీసుకుంటారంటా. మీరు నెక్ట్స్‌ క్లాస్‌ తీసుకోండి' అన్నాడు.
   'రంగయ్య... ఇతను కొత్తగా వచ్చారా?'
   'అవును మేడమ్‌. ఈరోజే వచ్చారు'
   అతను క్లాస్‌ చెబుతున్నాడు. చాలా అందంగా... బాగున్నాడు. నన్ను చూశాడు. నేను వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయాను. నా క్లాస్‌ టైం అయింది. వెళ్లి చూసేసరికి అతడింకా క్లాసులోనే ఉన్నాడు.
   'సార్‌ ఈ క్లాస్‌ కూడా మీరే తీసుకుం టారా? నేను రేపు తీసుకుంటాను' అన్నాను.
   'అయ్యో..! లేదు మేడమ్‌ అయిపోయింది తీసుకోండి' అని బయటకు వచ్చి ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయాడు. అలా కలిసినప్పుడు మాట్లాడేవాడు. కానీ, నాకే అతనితో ఎక్కువగా మాట్లాడాలనిపించేది. కొన్ని రోజులకి, ఓ రోజు సూపర్‌ మార్కెట్కి వెళ్లి వస్తుంటే కనిపించాడు.
   'హలో అండి. మీరేంటి ఇక్కడీ'
    'హాయ్ మేడమ్‌. నేను ఇక్కడే ఉంటాను'
    'అవునా..! మా ఇల్లు కూడా ఆ పార్క్‌ పక్కనే' అన్నాను.
    'నేను రోజూ సాయంత్రం ఆ పార్కుకి వస్తూ ఉంటాను' అన్నాడు. అయ్యో ఈ విషయం తెలిసుంటే నేను రోజు ఆ పార్కుకి వచ్చేదాన్ని కదా అని మనసులో అనుకున్నాను.
    'సరే మేడమ్‌. రేపటి ఎగ్జామ్‌కి క్వశ్చన్స్‌ ప్రిపేర్‌ చేయాలి' అంటూ వెళ్లిపోయాడు. ఎప్పుడూ వర్క్‌ వర్క్‌ అంటాడు. కాస్త ఏదైనా మాట్లాడుదామంటే టైం ఇవ్వడు అనుకున్నాను. ఆ మరుసటి రోజు సాయత్రం స్కూల్‌ నుంచి రాగానే పార్క్‌కి వెళ్లి.. ఓ దగ్గర కూర్చొని ఆలోచిస్తుంటే, హీరోలా వచ్చాడతను.
    'హలో సార్‌' అని గట్టిగా అరిచా. దగ్గరగా వచ్చి, 'మేడమ్‌ మీరు ఇక్కడీ'
    'నేను కూడా అప్పుడప్పుడు ఈ పార్కుకి వస్తూ ఉంటా' అని అబద్ధం చెప్పాను. ఇద్దరి నడక మొదలైంది. స్పీడ్‌గా నడుస్తున్నాడు. అతన్ని అనుసరించడం నా వల్ల కాలేదు.
    'చెప్పండి మీ గురించి ?' అన్నాడు.
    'మీరు కొంచెం నెమ్మదిగా నడవండి ప్లీజ్‌' అన్నాను.
    అతను ఓ నవ్వు నవ్వి 'సరే చెప్పండి మీ గురించి?' మళ్లీ అన్నాడు.
    'నేనూ, నాన్న ఇక్కడే ఉంటాం. మన స్కూల్లో టూ ఇయర్స్‌ నుంచి వర్క్‌ చేస్తు న్నాను. మీరు?'
    'నేను వరంగల్‌ నుంచి రీసెంట్‌గా వచ్చాను. అమ్మ, నాన్న అక్కడే ఉంటారు'
    'నైస్‌. మీకు పెళ్లైందా?'
    'ఇంకా లేదు. మీకు మాత్రం పెళ్లైంది అనుకున్నా. ఫస్ట్‌ టైం చూసినప్పుడు.'
    'ఎందుకు.. నేను అలా కనిపిస్తున్నానా?'
    'లేదు. చీరలో చూసా కదా.! అయిందేమో అనుకున్నా' అన్నాడు. అతని మాటకు నవ్వొచ్చింది. అతనూ నవ్వాడు. ఓ రోజు నెంబర్‌ అడిగితే ఇచ్చాడు. రోజూ పార్కులో ఓ చోట కూర్చొని, నాకోసం ఎదురు చూసేవాడు. అక్కడ కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. రోజూ అతన్ని కలుస్తున్నప్పటికీ, నైట్‌ చాటింగ్‌ కానీ, ఫోన్‌ కానీ చేసేదాన్ని. అతనూ నాతో అదే చనువుతో మాట్లాడేవాడు. స్కూల్‌కి ప్రతీ రోజూ ఒకే సమయానికి మెట్రో ట్రైన్‌లో వెళ్లేవాళ్లం. స్కూల్‌ అయిపోయాకా.. అక్కడక్కడా తిరిగి మళ్లీ మెట్రోలో ఇంటికి వచ్చేవాళ్లం.
    కొన్ని రోజులకు, పదే పదే అతని వెంటపడుతున్నానేమే అని, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడేమోనన్న ఆలోచనలు మొదలయ్యాయి. అయితే అవన్నీ నాలో ప్రశ్నలుగానే ఉన్నాయి. ఓ రెండు రోజులు అతనితో మాట్లాడలేదు. మెట్రోలో, పార్కులో కూడా కలవలేదు. ఫోనూ చేయలేదు. మూడో రోజు స్కూల్లో కనిపించి, 'సాయంత్రం పార్కులో కలుద్దాం' అన్నాడు.
    నాకేమో, నా మనసులో తలెత్తిన ఆ ఆలోచనలన్నింటికీ సమాధానం కావాలనిపించింది. అందుకే ఆరోజు పార్కుకి వెళ్లలేదు. మరుసటి రోజు స్కూల్లో కలిశాడు. 'నిన్న సాయంత్రం పార్కుకి రాలేదు. ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు?' అని అడిగాడు.
    'కొంచెం బిజీగా ఉండే' అన్నాను.
    'ఈ రోజైనా వస్తారా?' పాపం అనిపించి 'సరే వస్తాను' అన్నాను. కొన్ని ప్రశ్నలకు జవాబు వెంటనే దొరక్కపోయినా మనసుకు ఆనందంగానే ఉంటుంది. ఆ రోజు సాయంత్రం పార్కులో మా ఫేవరెట్‌ ప్లేస్‌లో కూర్చుని ఉన్నా. అతను కూడా వచ్చాడు. ఏమీ మాట్లాడలేదు. 'ఏమైంది ఏం మాట్లాడట్లేరు?' నెమ్మదిగా అడిగాను.
    'నన్ను తేజ్‌ అని పిలవండి' అని కాస్త చనువుగా అన్నాడు.
    'మీరు కూడా నన్ను దివ్య అని పిలవండి' అని లేచి ముందుకు నడిచాను. అతనూ నాతో నడుస్తూ, 'సరే దివ్య. నిజంగా మూడు రోజులుగా బిజీగా ఉన్నావా?' అమాయకంగా అడిగాడు.
    'లేదు. పదేపదే ఫోన్‌ చేసి ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది'
    'నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు పరిచయం అయ్యాకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను' అన్నాడు.
    ఆ ఒక్క మాటతో.. నా మనసు గాల్లో తేలినట్లయింది. నేను అతన్ని ఇష్టపడుతున్నానని అర్థమై ఉంటుందా అనిపించింది.
    'ఎందుకు అంత హ్యాపీ?' కావాలనే అడిగాను.
    'మనకోసం ఎదురు చూసేవాళ్లు.. ఫోన్‌ చేసేవాళ్లు ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే మీరు నాకు స్పెషల్‌' అన్నాడు. తేజ్‌ మాటలకు నాకు పట్టలేని సంతోషం తన్నుకొచ్చింది. అయినా ఆపుకొని, 'నువ్వంటే నాకు గౌరవం తేజ్‌. రెస్పెక్ట్‌ ఇస్తావు. చాలా సిన్సియర్‌గా ఉంటావు. ఇవే నీతో నన్ను మాట్లాడించాయి' అన్నాను. నా మాటలకు అతను కళ్లు నన్ను చూసి ఓ అందమైన నవ్వు నవ్వాయి. నేనూ చిన్నగా నవ్వా. తర్వాత నడకతో పాటు మా మాటలు కూడా ప్రయాణించాయి.
    చీకటి పడింది. రూం వరకు వచ్చి వదిలిపెట్టాడు. నేను లోపలికి వెళ్లే వరకు నన్నలా చూస్తూనే ఉండిపోయాడు. నేనే ఫోన్‌ చేసి, ఇక వెళ్లమని చెప్పిన తర్వాత వెళ్లిపోయాడు.
    అలా రోజు చేసేవాడు. పోను పోనూ తేజ్‌ పూర్తిగా నా లైఫ్‌లోకి వచ్చాడనిపించింది. ఎంతలా అంటే అతన్ని చూడకుంటే రోజు గడవదు అనేలా. రోజుకి ఎన్నిసార్లు కలిసినా రాత్రి ఫోన్లో మళ్లీ ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళం.
    తేజ్‌తో ఆరు నెలల పరిచయం అర నిమిషంలో అయిపోయింది. అతనే నా గడియారం అయిపోయాడు. నా సంతోషంకు కారణమయ్యాడు. ఇక నా మనసులో మాట అతనికి చెప్పాలని అనుకున్నాను.
    ఓ రోజు సాయంత్రం తన బర్త్‌ డే అని పిలిస్తే అందంగా తయారయ్యి రూంకి వెళ్లాను. నన్నలా చూడగానే, 'చాలా అందంగా ఉన్నావు. చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది' అన్నాడు.
    నాకు తెలియని సిగ్గు తన్నుకొచ్చింది. అది కవర్‌ చేస్తూ 'హ్యాపీ బర్త్‌ డే తేజ్‌' అన్నాను.
    'థాంక్యూ దివ్య. నేను బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకోను. బట్‌ ఈ సారి నీతో సెలబ్రేట్‌ చేసుకోవాలి అనిపించింది' అన్నాడు.
    'సరే, ఏంటి అలా చూస్తున్నావ్‌?'
    'ఈ రోజు నాకు స్పెషల్‌ డే. చాలా హ్యాపీగా నా బర్త్‌ డే నీతో సెలబ్రేట్‌ చేసుకుంటున్నాను'
    'నాకు అర్థం అయింది' అని నవ్వాను. కేక్‌ కట్‌ చేయించి తినిపించాను. నాకూ తినిపించాడు.
    'థాంక్యూ దివ్య. గిఫ్ట్‌ లేదా?' అన్నాడు.
    'ఇస్తానులే'
    'సరే కానీ, నీకు ఓ విషయం చెప్పాలి' అని నెమ్మదిగా అన్నాడు.
    'ఏంటది?'
    'నీతో పరిచయమై చాలా రోజులైంది. నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను బాగా అర్థం చేసుకుంటావు. సొంత మనిషిలా చూస్తావు. బాగా కేర్‌ తీసుకుంటావు. అది నాకు చాలా ఇష్టం'
    'నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్‌ తేజ్‌. చాలా కేర్‌ తీసుకుంటావు. అది నాకెంతో నచ్చుతుంది'
    'అవును అనుకో కానీ, నాలో ఉంది ఇష్టం మాత్రమే కాదు'
    'మరి ఏంటి?' నెమ్మదిగా అడిగాను.
    'అంటే, నీకు ఆ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు'
    అప్పుడర్థమైంది. నేనంటే తేజ్‌కి చాలా ఇష్టమని, 'పర్లేదు తేజ్‌, చెప్పు. నేను ఏం అనుకోను' అన్నాను.
    'కొంచెం భయంగా ఉంది'
    'బాబు నేను ఏం అనుకోను చెప్పు ప్లీజ్‌' అతని మాట కోసం వేచి చూస్తూ అన్నాను.
    'చెప్పలేకపోతున్నా'
    'సరే ఇక నువ్వు చెప్పలేవు కానీ, నేను వెళ్తున్నా' అని లేచి బయటకు వచ్చాను.
    నా వెనకే వచ్చి నా చెయ్యి పట్టుకుని 'ఆగు చెప్తాను' అని తనవైపుకు తిప్పుకుని దగ్గరకు లాక్కున్నాడు.
    కళ్లలోకి చూస్తూ, రెండు చేతులు పట్టుకుని 'దివ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంతలా ఎవరి మీద ఇష్టం, ప్రేమ పెంచుకోలేదు. స్కూల్లో ఫస్ట్‌ టైం చూసినప్పుడే నాకు చాలా నచ్చావు. నీకు తెలియకుండా నిన్ను చూసేవాడిని. ఎక్కడ ఉంటావో తెలుసుకొని ఇక్కడ రూం తీసుకున్నాను. నువ్వు నా గురించి తీసుకునే కేర్‌, నాపై నువ్వు చూపించే ప్రేమ ఇవన్ని నేను మిస్‌ చేసుకోలేను. నువ్వు నాకు కావాలి. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను' అని నా చేతిపై ముద్దు పెట్టాడు.
    అతని మాటలకు నాకు సంతోషమేసింది. నాకంటే ముందే నన్ను ఇష్టపడ్డాడు. నిజంగా చాలా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. తేజ్‌ని వదులుకోకూడదని మనస్సులో అనుకున్నాను.
    'ఏంటి దివ్య? ఆలోచిస్తున్నావు. తప్పుగా మాట్లాడానా?'
    నాకు అతని కళ్లలోకి చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మనస్సు ఆనందంతో పరుగులు పెడుతుంది. నా రెండు చేతులతో తన తలని దగ్గరగా తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టి ఇదే నీ బర్త్‌ డే గిఫ్ట్‌ అని అక్కడ్నుంచి వెళ్లిపోయాను. ఆ టైంలో నా ప్రేమను ఇంతకన్నా ఎలా వ్యక్తపరచాలో నాకర్థం కాలేదు.
    అర్థం చేసుకునే ప్రేమ దొరికితే రోజులు కూడా తెలియవు. ఎన్ని సార్లు కలిసినా మళ్లీ మళ్లీ కలవాలని, మాట్లాడా లనిపిస్తోంది. హ్యాపీగా మా ప్రేమ ప్రయాణం సాగుతోంది.
    ఓ రోజు ఫంక్షన్‌ ఉండి తేజ్‌కి చెప్పి నాన్నతో ఊరెళ్లాను. రెండు రోజులు అయ్యాక, తేజ్‌కి సర్‌ఫ్రైజ్‌ ఇద్దామని రూం దగ్గరకు వెళ్తే, తేజ్‌ లేడు. ఓ అమ్మాయి ఉంది. 'ఎవరు కావాలి?' అడిగింది.
    'తేజ్‌?' అన్నాను.
    'మా బావే. బయటకు వెళ్ళాడు. వస్తాడు కూర్చోండి' అంది.
    ఈ అమ్మాయి ఎవరని ఆలోచిస్తుంటే, 'మా బావాతో నాకు త్వరలో పెళ్లి. తెలుసా?' అని నవ్వింది.
    'ఏంటి పెళ్లా? మీ బావకు ఈ పెళ్లి ఇష్టమేనా మరి?' కంగారుగా అడిగాను.
    'ఇష్టం లేకుంటే పెళ్లి ఎందుకు ఫిక్స్‌ చేస్తారు' మళ్లీ నవ్వుతూ చెప్పింది.
    ఆమె ఆ మాట పూర్తి చేయకముందే వెళ్లిపోయాను. పెళ్లికి రెడీ అయి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంతకన్నా మోసం ఉంటుందా. అనవసరంగా అతని వెంట పడ్డాను. ఏడుపు తన్నుకొచ్చింది. అతని ముఖం చూడొద్దు అనుకున్నాను. ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఆ కోపం ఎలా పోతుంది. పాతుకుపోయింది.
    ఫోన్‌ చేస్తే, లిఫ్ట్‌ చేయలేదు. మెసేజ్‌కి రిప్లరు ఇవ్వలేదు. స్కూల్లో మాట్లాడానికి దగ్గరగా వచ్చాడు. 'నువ్వు నాతో మాట్లాడానికి ట్రై చేస్తే నేను ఈ స్కూల్‌ వదిలి వెళ్లిపోతాను' అని అరిచాను. అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
    మెట్రోలో, పార్కులో... ఎక్కడ కలిసినా వెళ్లిపో అని అరిచేశాను. డైరెక్ట్‌గా ఇంటి దగ్గరకు వచ్చాడు.
    'ఏం కావాలి తేజ్‌ నీకు?'
    'ఎందుకు నా మీద కోపం'
    'నువ్వు నన్ను మోసం చేశావు. నీకు పెళ్లి ఫిక్స్‌ అయినా, నేనంటే ఇష్టమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశావు. ఇప్పుడు ఏడిపిస్తున్నావు'
    'పెళ్లి ఫిక్స్‌ అయిన మాట నిజమే కానీ..' అని ఏదో చెప్పబోయాడు.
    'మళ్లీ కొత్త అబద్ధం చెబుతావా. నిన్ను చూడాలని కూడా లేదు. ఇంకోసారి నన్ను కలవడం, ఫోన్‌ చేయడం చేస్తే, వెళ్లిపోతాను. నీకు దూరంగా.!' అని అరిచాను. అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
    బయటకు వెళ్తే కనిపిస్తాడని.. ఇంట్లోనే ఉండిపోయాను. రెండ్రోజులకి ఇంటి దగ్గరకు మళ్లీ వచ్చాడు.
    'నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి' అడిగాడు.
    'నువ్వు నిజం చెబుతున్నావ్‌ అని ఎలా నమ్మాలి. నీకు పెళ్లి ఫిక్స్‌ అయిన మాట నిజమేనా?'
    'అవును. నిజమే' అన్నాడు.
    'ఎప్పుడు ఫిక్స్‌ అయింది?'
    'రెండేళ్ల క్రితమే'
    'రెండేళ్ల క్రితం ఫిక్స్‌ అయింది. ఇప్పుడు నన్ను ప్రేమించావు. అక్కడ ఆ అమ్మాయిని మోసం చేసి, ఇక్కడ నన్ను మోసం చేశావు. ఇక లైఫ్‌లో నాకు కనిపించకు ప్లీజ్‌' అని ఏడుస్తూ అన్నాను.
    'అసలు ఎలాంటి పరిస్థితిలో ఆ పెళ్లికి ఒప్పుకున్నాను అంటే?'
    'పరిస్థితి ఏదైనా కావొచ్చు. నాతో ప్రేమలో ఉండి ఇన్ని నెలలు అవుతుంది. ఒక్క రోజు కూడా నాకు ఆ విషయం గురించి చెప్పలేదు. అక్కడ నీకు కాబోయే భార్య, మా బావతో నాకు పెళ్లి అని సంబరపడుతోంది. కనీసం ఆ అమ్మాయిని అయినా మోసం చేయకుండా, హ్యాపీగా చూసుకో. వెళ్లిపో'
    నా మాటలకు కళ్లలోకి నీళ్లు తెచ్చుకుని, అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. తర్వాత స్కూల్‌ నుంచీ వెళ్లిపోయాడు. పార్కులో, మెట్రోలో కూడా కనిపించలేదు. రూం కూడా ఖాళీ చేసినట్లు తెలిసింది.
    తేజ్‌ నిజాన్ని దాచి నా ప్రేమను అబద్దాన్ని చేశాడు. ఒంటరిగా కూర్చొని ఎన్ని రోజులు ఏడ్చానో చెప్పలేను. తేజ్‌, నా ప్రేమను తెల్లారని చీకటిని చేశాడు. అతని ప్రేమ కోసం అంతలా ఆరాట పడ్డాను. ఇప్పుడు నా ప్రేమను ఓ జ్ఞాపకం చేశాడు.
    తేజ్‌తో మాట్లాడక నాలుగు నెలలవుతోంది. అమ్మాయిలు దేనినై తట్టుకుంటారేమో కానీ, నమ్మకాన్ని అబద్దం చేస్తే తట్టుకోరు కదా. ట్రైన్లో కలిసినప్పుడు ఏం చెబుతాడో వినాల్సింది. నేను ఎంత ద్వేషించినా.. ఎప్పుడూ ఒక్క మాట అనలేదు. ఆ మరుసటి రోజు అదే మెట్రో స్టేషన్‌లో కనిపిస్తాడేమోనని చూశా, కనిపించలేదు. నలభై రోజుల్నుంచి అలానే గమనించినప్పటికీ కనిపించలేదు. ఈసారి కనిపిస్తే సారీ చెప్పి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని మంచిగా చెబుతా. పాపం ఆ అమ్మాయి లైఫ్‌ ఎందుకు నాలా అవ్వడం.
    ఆ మరుసటి రోజు మెట్రో స్టేషన్‌లో కనిపిస్తాడేమోనని మళ్లీ చూశా, కనిపించలేదు. కానీ, తేజ్‌ మరదలు లానే ఓ అమ్మాయి కనిపించింది. దగ్గరకు వెళ్లి, 'మీరు తేజ్‌ మరదలే కదా' అన్నాను.
    'అవును' అని ముఖానికి ఉన్న మాస్కు తీసింది.
    'నన్ను గుర్తు పట్టారా ?' అని నేను మాస్కు తీశాను.
    'మిమ్ముల్ని ఎలా మర్చిపోగలను'
    'మిమ్మల్ని చూస్తుంటే పెళ్లి అయిందనిపిస్తుంది' అన్నాను.
    'అవును. అయింది' అంది.
    ఆ మాటతో తేజ్‌ నాకోసం తిరిగి వస్తాడు అన్న హోప్‌ కూడా పోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. 'సరే వస్తాను' అని వెళ్లబోతుంటే, 'ఒక్క నిమిషం అండి. మీతో మాట్లాడాలి. మీ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామా' అంది. ఇద్దరం మాస్కులు పెట్టుకుని ఇంటికి వచ్చాం. నాన్న ఊరెళ్లాడు. 'నాతో మాట్లాడాలి అన్నారు. చెప్పండి' అన్నాను.
    'నాకు పెళ్లి అయింది. కానీ మా బావతో కాదు' అని చెప్పింది.
    'మీ బావతో కాకుంటే, మరి మీ బావ ఎక్కడీ' ఆత్రుతగా అడిగాను. 'నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. 'అయ్యో. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు' కంగారుగా అన్నాను. 'మీరు, మా బావను ప్రేమించారు కదా' 'అవును' అన్నాను.
    ''మా బావ మంచి వ్యక్తి. మా అత్తయ్య కోసం నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నారు. రెండేండ్ల క్రితమే పెళ్లి ఫిక్స్‌ చేశారు. కానీ, జాబ్‌ వచ్చాకే చేసుకుంటానని కండిషన్‌ పెట్టి హైదరాబాద్‌కి వచ్చాడు. మీరు ఆ రోజు మా బావా కోసం రూంకి వచ్చిన రోజే, నేను ఎగ్జామ్‌ ఉందని హైదరాబాద్‌కి వచ్చాను. మా బావతో నీకోసం ఓ అమ్మాయి వచ్చివెళ్లిందని, ఎవరు తను అని అడిగితే..'తనని నేను ప్రేమిస్తున్నాని, తననే పెళ్లి చేసుకుంటానని' చెప్పాడు. నాకు ఏడుపొచ్చింది. ఇంటికొచ్చి అత్త య్యకు చెప్పాను. తర్వాత బావ ఇంటికి వచ్చి, 'కావేరిని నేను పెళ్లి చేసుకోలేను. చిన్నప్పటి నుంచి తనపై నాకు అలాంటి ఫీలింగ్‌ లేదు. మీ బలవంతం వల్లే ఒప్పుకున్నాను. ఇప్పుడు చెబుతున్నా, హైదరాబాద్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. ఆమె లేకుంటే బ్రతకలేను' అని అత్తయ్యకు చెబుతూ బావ చాలా ఏడ్చాడు. మా బావ ఏడవటం అదే ఫస్ట్‌ టైం. ఒక అమ్మాయి కోసం ఇంతలా బాధపడుతున్నాడని మేము అసలు ఊహించలేదు. బావ ఇష్టాన్ని అత్తయ్య కాదనలేకపో యింది. తర్వాత మంచి అబ్బాయిని చూసి మా బావే దగ్గర ఉండి నా పెళ్లి చేశాడు. మా అమ్మనాన్న ఉంటే కూడా అంత గ్రాండ్‌గా పెళ్లి చేయలేరేమో అనిపించింది''
    'మరి ఇప్పుడు మీ బావ ఎక్కడీ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు?' కంగారుగా అడిగాను.
    నా మాటకు ఆమె ఇంకా ఏడుస్తూ 'కొన్ని రోజుల క్రితం మా బావ హైదరాబాద్‌ వచ్చాడు. ఆ మరుసటి మూడు రోజుల తర్వాత బావ నుంచి ఫోన్‌ వచ్చింది. కరోనా వచ్చింది, ఆసుపత్రిలో ఉన్నానని అత్తయ్యకు చెబితే, అందరం కలిసి వచ్చాం. బావకి కరోనా రావడంతో ఎవరిని హాస్పిటల్‌లోనికి కూడా రానివ్వలేదు. పరిస్థితి బాలేదు ఇప్పుడే ఏం చెప్పలేం, ఆక్సిజన్‌ అందిస్తున్నాం అని డాక్టర్లు అన్నారు. సరిగ్గా పది రోజుల తర్వాత బావ చనిపోయాడు' అని కావేరి గట్టిగా ఏడ్చింది. ఆ మాట విని నా గుండె పగిలినంత పని అయింది. 'ఏంటి చనిపోయాడా, 'నిజం చెప్పు' అని గట్టిగా అడిగాను.
    'నిజం అండి' మా బావ చనిపోయాడు అని మళ్లీ చెప్పగానే నా కళ్లు తిరిగాయి. తర్వాత కొన్ని సెకెన్ల పాటు నాకేమీ తోచలేదు. కావేరిని పట్టుకుని గట్టిగా ఏడ్చాను. ఏంత పని జరిగింది. నా కోసమే కదా తేజ్‌ వచ్చింది. ఆ రోజు మెట్రోలో కలిసినప్పుడు మాట్లాడి ఉంటే, ఇంత మంచి మనిషిని కోల్పోయేదాన్ని కాదు. నాకోసం అందర్ని ఒప్పించి వచ్చాడు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయాను అని తలను గోడకు గట్టిగా కొట్టుకున్నాను. కావేరి ఆపింది.
    'కరోనాకు మంచివాడా, చెడ్డ వాడా అని ఉండవు కదా. ఈ విషయం చెప్పకపోతే మీరు మా బావ నిజంగానే మోసగాడు అనుకుంటారు కాబట్టి చెప్పాను. మా బావ చాలా మంచివాడు. జాగ్రత్తగా ఉండండి' అని మాస్క్‌ పెట్టుకోని వెళ్లిపోయింది.
    ఆమె వెళ్లిన తర్వాత వర్షంలో కూర్చుని గట్టిగా ఏడ్చాను. జీవితంలో చేసిన చిన్న తప్పుకి, నాకు ఇంత పెద్ద శిక్ష పడుతుంది అనుకోలేదు. తేజ్‌ని ఎలా మర్చిపోవడం..
   తేజ్‌ ప్రాణాలతో ఉండి ఉంటే, కనీసం వేరే ఎవరితోనైనా హ్యాపీగా ఉంటాడనుకునేదాన్ని. అసలు ఈ లోకంలోనే లేడన్న విషయాన్ని నేను జీర్ణించు కోలేకపో తున్నాను. తేజ్‌లేని నాకు.. బతకడమే బరువనిపిం చింది. ఇంట్లో నుంచి బయటకు రావాలనిపించలేదు. స్కూల్‌ కూడా మానేశాను. మూడు నెలలకు పైగా చీకట్లోనే.. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లింకిపోయాయి. ఓ రోజు చీకట్లో, తేజ్‌ నా పక్కనే ఉన్నాడేమో అనిపించింది. కాసేపటికి కనపడలేదు. లైట్‌ వేసి ఇంట్లో చూట్టూ వెతికా. ఎక్కడా కనిపించలేదు. ఆ మరుసటి రోజు సాయంత్రం పార్కులో తేజ్‌, నేను ఎప్పుడూ కూర్చొనే ప్లేస్‌లోనే కూర్చున్నా. తేజ్‌ మళ్లీ కనిపించాడు. దగ్గరగా వచ్చి, నా పక్కనే కూర్చు న్నాడు. ఏవో కబుర్లు చెప్పాడు. ముచ్చట్లో మునిగిపోగానే.. కాసేపటికి నన్ను వదిలేసి మాయమయ్యాడు. మళ్లీ కన్నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత ఈ తడ్చిన కళ్ళతో తేజ్‌ కోసం ఎదురు చూడటం ఎన్నోసారో నాకు తెలియదు.
- రాపోలు రమేష్‌, 9030872697

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ట్యూషన్‌
మలుపు
మా అక్కయ్య
బ్లాక్‌ లేక్‌
మాటల మూటలు
నిర్లక్ష్యం ఖరీదు
స్టాట్యూటరీ వార్నింగ్‌
ఎవడైతేనేం
పరీక్ష
అర్థం - పరమార్థం
బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సహాయకారి
సరాగాల శ్రీమతి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...
కానుగచెట్టు ఇల్లు..
ఎండి పోయిన చేపలు
ఎవరు ముందు?
పునరాగమనం
పాకీజ
బంధం
ఎవరికి తెలుసు?
గోస
ప్రేమ వాంగ్మూలం
'వజ్రాల భరిణె'
నెగటివ్‌
ఆ ఇద్దర్ని కలవబోతుంది

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.