Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సరాగాల శ్రీమతి | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • May 01,2022

సరాగాల శ్రీమతి

     నవీన - ప్రణీత్ ల వివాహం జరిగి ఆరు నెలలయ్యింది . ఇద్దరూ అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నారు. నవీన కుటుంబం తెలుగు వారే .. కానీ గత ముప్పయి సంవత్సరాలుగా అమెరికా లోనే స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరగటం వలన నవీనాకు తెలుగు సరిగా రాదు. అక్కడి ఆంగ్ల భాషకే పూర్తిగా అలవాటు పడింది. తెలుగు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ మాట్లాడటం అసలే రాదు. మ్యాట్రీమోని ద్వారా ప్రణీత్ - నవీన ల పెళ్లి కుదిరింది. ప్రణీత్ తల్లి తండ్రులు ఆన్ లైన్ లోనే అమ్మాయిని చూసారు. ఓకే అన్నారు. ప్రణీత్ అమెరికా లోనే ఉండటం వల్ల స్వయంగా కలుసుకొని పెళ్లి నిశ్చయం చేసుకున్నారు.
            అమెరికాలో సెటిల్ అయిన సంబంధం అని మొదట అనుమానపడినా .. ప్రణీత్ ఇష్టపడ్డాడని అతని తల్లితండ్రులు ఒప్పుకున్నారు.
అమెరికా లోనే పెళ్లి చేయాలనుకున్నారు. సమయానికి వీసా దొరకక పోవటం వలన,మళ్ళీ సంవత్సరం వరకు ముహార్తాలు లేకపోవటం వలన, ప్రణీత్  ఆఫీస్ పని ఒత్తిడి  తో ఇండియాకి రాలేకపోవటం వలన.. ప్రణీత్ అమ్మా నాన్నలు లేకుండానే హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది . డిసెంబర్ నెలాఖరులో లీవ్ దొరకడంతో ఇప్పుడు ఇండియా కి ప్రయాణం పెట్టుకున్నారు.
        ప్రయాణం  నిర్ణయించుకున్నప్పటినుండి
మొదలుపెట్టాడు ప్రణీత్ . రోజూ నవీన తో "నువ్వు తెలుగు నేర్చుకొని బాగా మాట్లాడాలి. అమ్మ వాళ్ళ దగ్గర మంచిపేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే నిన్ను స్వయంగా కలుసుకోవటం ఇదే మొదటిసారి కదా" అని చెప్పిందే మళ్ళీ చెప్పటం చూసి నవీన కు కాస్త విసుగు అనిపించినా " పోనీలే పాపం " అనుకొని  "సరే  ప్రణూ.. అక్కడ అందరికీ నా ప్రవర్తనతో , నా తెలుగు భాషతో ఎంత సర్ ప్రయిజ్ ఇస్తానో మీరే చూడండి" అంది నవీన .

          అనుకున్న ప్రకారం బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడినుండి వరంగల్ కు ట్రైన్ లో బయలుదేరారు. కార్లో వెల్దామంటే ట్రైన్లో అయితే ఇక్కడి కల్చర్ ( సంప్రదాయం ) అంతా పరిచయమైనట్టుంటుందని నవీన అనటంతో సరే అన్నాడు ప్రణీత్ .
          కాసేపటికి ప్రణీత్ అలా వెళ్లి వచ్చేసరికి నవీన ఎదుటి సీట్లోని అతనితో గొడవపడుతోంది. ఏమిటా అని చుస్తే "ఆ కిటికీ నాది .. ఆ కిటికీ నాది " అంటోంది నవీన . " అరె .. ఈ కిటికీ దగ్గరి సీట్ నాదమ్మా " అంటున్నాడు ఎదుటి వ్యక్తి. ప్రణీత్ రాగానే " చూడు ప్రణూ నా కిటికీ నాకిమ్మంటే ఇవ్వటం లేదు అతని చేతిలోనే పట్టుకున్నాడు"  అనటంతో అప్పుడర్థమైంది అందరికీ అది కిటికీ కాదు టికెట్ అని. అది అనుకోకుండా బ్యాగ్ లోనుండి కిందపడటంతో అతను తీసి ఇద్దామనుకునే లోపలే ఇలా జరగటంతో ఆమె తెలుగు కు అందరూ అవాక్కయ్యారు .ఇక అక్కడి  నుండి మొదలయ్యాయి తెలుగు కష్టాలు. టికెట్ ఇవ్వగానే "మద్యాదానములండి "  అనగానే వాళ్ళు షాక్ అయ్యేలోగా  " సారీ సార్ .. మా ఆవిడ ఉద్దేశ్యంలో ధన్యవాదములండి " అని నచ్చచెప్పాడు.
          ట్రైన్ దిగగానే " నవీ ఏమిటిది " అనగానే "  ప్రణూ ...నువ్వేగా నన్ను ఇండియా చేరగానే ఇంగ్లీషులో మాట్లాడవద్దు అన్నావు కదా " అని ఇంగ్లిష్ లోనే చెప్పింది నవీన . 'ఓకే ఓకే' అన్నాడు ప్రణీత్.
          ఇంటికి వెళ్ళగానే అందరూ సంతోషంగా ఎదురొచ్చారు. కొత్త దంపతులకు హారతిచ్చి " బాగున్నావా కోడలా " అంటూ నవ్వుతూ పలకరించింది అత్తగారు.  "హా..అత్తా మీ మనసు కారం ( మీకు నమస్కారంకు బదులుగా ) " అంది నవీన . నోరెళ్లబెట్టారు ఇంట్లోవారు. ఆ తప్పు పూర్తిగా బయటపడేలోపు నవీన తో కలిసి చటుక్కున వాళ్ళ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
                   తెల్లవారి దగ్గరి వాళ్ళంతా వీరిని కలవటానికి వచ్చారు. భయపడుతూనే నవీన ను పిలిచాడు ప్రణీత్ . " అందములకు నందన వనములండీ " ( అందరికీ వందనాలండీ " కి బదులుగా ) నవ్వుతూ అంది నవీన . అంతే .. అక్కడినుండి తప్పించటానికి " నవీనా  కాస్త కాఫీ చేయమ్మా " అన్నారు అత్తగారు. " ఓకే అత్తమ్మా " అంటూ వెళ్లి ' లాప్ టాప్ ' తీసుకొచ్చి ' ఏం కాపీ చేసి పోస్ట్ చేయాలి ' అంది. అది అందరూ వినేలోగానే హడావిడిగా ఏదో పని ఉన్నట్టు నవీనా ను లోపలికి పిలుస్తూ తనూ లోపలికి వెళ్ళాడు ప్రణీత్ .
          వీళ్ళుండేది అపార్టుమెంట్ లో  .. అక్కడ రోజు విడిచి రోజు కూరగాయల వ్యాన్  వస్తుంది . ఆ  రోజు సంక్రాంతి ముందు కావటంతో  వ్యాన్ నిండా కూరగాయలు .. వాటిని అమ్మటానికి ఎప్పటికంటే ముగ్గురు మనుషులు  ఎక్కువే వచ్చారు . ఇక నవీన ఆగుతుందా నేనూ చూస్తానంటూ చెంగుచెంగుమని వచ్చింది . “ఏంటీ ఇవి ఇస్తున్నావు ?మీ తలకాయలివ్వండి” అంది . అందరూ వింతగా చూసారు . కూరగాయలమ్మేవాడయితే సరేసరి ...”ఏందమ్మో ఏం మాట్లాడుతున్నావ్” అంటూ గయ్యిమన్నాడు . ఇంకేముందీ మళ్ళీ ప్రణీత్ పరిగెత్తుకుంటూ వచ్చాడు .. విషయం తెలుసుకున్నాడు . ఆవిడకు  తెలుగు రాదు బాబూ .. లేత కాయలనబోయి అలా అందని సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యింది . చూడు ప్రణూ..  ఎలా కరుస్తున్నాడో ( అరుస్తున్నాడో ) అంటున్న నవీన ఇంకేం మాట్లాడకుండా చూపుడు వేలితో ఆమె పెదాల్ని బంధించాడు .
      ఇంతలో సంక్రాతి పండుగ వచ్చింది . వాకిట్లో గొబ్బెమ్మలను చూసి అవి ఏమిటని అత్తగారిని అడిగింది. "వాటిని గౌరమ్మలుగా భావిస్తూ పసుపు , కుంకుమ , పూలు వేసి దండం పెట్టుకుంటారు " అని చెప్పింది.
   తెల్లవారి సంక్రాతి నోముల పండుగ. దేవుడి దగ్గర నోములన్నీ రెడీగా పెట్టి , నవీనా తో "అమ్మా ! ఇక్కడ గౌరమ్మను పెట్టి మనం నోముకోవాలి .. నువ్వు ఇక్కడ కూర్చో .. నేను పూలు తీసుకొని వస్తాను " అని వెళ్ళింది. తిరిగి వచ్చి అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యి పడబోయిన అత్తమ్మను పట్టుకుంది. దేవుడి దగ్గరి గొబ్బెమ్మను చూపిస్తూ మీకు హెల్ప్ అవుతుందని నేను ముందే తెచ్చి పెట్టాను " అంటున్న నవీన ను చూస్తూ .. పసుపు గౌరమ్మకు బదులుగా పేడ తో చేసి పెట్టిన గొబ్బెమ్మను చూస్తూ .. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అత్తగారికి.
        ఇదంతా చూసిన ప్రణీత్ బెడ్ రూమ్ లోకి వెళ్లి తల పట్టుకున్నాడు. “ఇండియా కు వచ్చేముందు ఎన్ని అనుకున్నాను. అమ్మ వాళ్లకు నచ్చే విధంగా ఉన్న కోడల్ని తీసుకొచ్చానని చెబుతూ ఇండియా లో రిసెప్షన్ ఏర్పాటు చేసి తనను ముత్యాల పల్లకిలో ఊరేగించి తీసుకెళ్లాలన్న తన ఊహల్ని తలకిందులు చేసి నా ఊహల పల్లకిని  విరిచేస్తోంది . అమెరికా లో ఎంత బాగా మాట్లాడేది ఇంగ్లీష్ లో .. ఎంత బాగా కలిసుండేవాళ్ళం. ఇప్పుడు తన తెలుగు భాషతో , ప్రవర్తనతో పరేషాన్ చేస్తున్నది”  అనుకుంటూ అలా  బెడ్ పై వాలిపోయాడు. ఇంతలో " ప్రణూ" ..అంటూ వచ్చిన నవీన ను చూస్తూ ఎన్నడూ లేని చికాకుతో " ఏం పిల్లో ఏమో ..నీ మొహం తగలెయ్య " అంటూ విసుక్కున్నాడు. వెంటనే నవీన పిల్లో ( తలగడ ) తీసి ప్రణీత్ మొఖం మీద వేసింది. ఆశ్ఛర్యంగా చూసాడు ప్రణీత్ . " నువ్వేగా పిల్లో మొఖం మీద తగలెయ్యమన్నావు " అంది మొఖం అమాయకంగా పెడుతూ. " వామ్మో " అంటూ అరిచాడు ప్రణీత్ . భరించలేక అటు తిరిగి పడుకున్నాడు. ముసిముసిగా నవ్వుకుంది నవీన .
       చివరికి సంక్రాతి తరువాత నవీన ను తెలుగు లో మాట్లాడవద్దని నచ్చచెప్పి ఒప్పించి రెసెప్షన్ ఏర్పాటు చేసారు. అక్కడ అందరూ కొత్త కోడలు మాట్లాడాలని పట్టుపట్టటడంతో నవీన లేచి " అందరికీ నమస్కారం " అనగానే కుటుంబ సభ్యులందరి గుండెల్లో జల్లుమంది . కానీ ఆశ్ఛర్యం అచ్చ తెలుగు లో అందరికీ ధన్యవాదాలు .. అభివందనాలు తెలుపుతూ అద్భుతంగా మాట్లాడి చివరగా ఒక తెలుగు పాట కూడా పాడి అందరినీ మైమరిపించింది.
        ఇంటికొచ్చాక .. ఆశర్యపోతున్న అత్తమ్మను చూసి "అత్తమ్మా ! నన్ను క్షమించండి . నేను ఇండియా ప్రోగ్రాం  ఫిక్స్ కాగానే ' ముప్పయి రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా ' పుస్తకం చదివి మొత్తం నేర్చుకున్నాను . మీ అబ్బాయిని అట పట్టించాలని ఇలా చేస్తూ అప్పుడప్పుడు మిమ్మల్నీ ఇందులో ఇరికించక తప్పలేదు " అంటూ ఇదే నా సర్ ప్రయిజ్ అన్నట్టుగా శ్రీవారి వైపు చిలిపిగా చూసింది .
 - మాదారపు వాణీశ్రీ
  హన్మకొండ

9247286668

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మలుపు
మా అక్కయ్య
బ్లాక్‌ లేక్‌
మాటల మూటలు
నిర్లక్ష్యం ఖరీదు
స్టాట్యూటరీ వార్నింగ్‌
ఎవడైతేనేం
పరీక్ష
అర్థం - పరమార్థం
బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సహాయకారి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...
కానుగచెట్టు ఇల్లు..
ఎండి పోయిన చేపలు
ఎవరు ముందు?
పునరాగమనం
పాకీజ
బంధం
ఎవరికి తెలుసు?
గోస
'నీ ప్రేమకై'
ప్రేమ వాంగ్మూలం
'వజ్రాల భరిణె'
నెగటివ్‌
ఆ ఇద్దర్ని కలవబోతుంది
కర్లీ హెయిర్‌

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.