Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సహాయకారి | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • May 08,2022

సహాయకారి

    దసరా సందడి. ఊరంతా బతుకమ్మ హడావిడి. మహిళలంతా పూలసానువులయ్యారు. పూల వెతుకులాటలో పురుషులు పూలబాటలయ్యారు. చాన్నాళ్ళ తరువాత కలుసుకున్నవారు మాటల మూటలయ్యారు. మొత్తానికి ఊరు ఊరంతా రోజువారీకి భిన్నంగా, వేడుకగా మారింది. ఊరికి దూరంగా, అల్లరికి ఎడంగా, గుట్టబోరు పైన, మర్రిచెట్టు కింద, ముగ్గురు మిత్రులు కూర్చున్నరు. అక్కడి నుండి చూస్తే ఊరంతా పరుచుకున్న పచ్చదనం కంటికి చలువనిస్తున్నది. ఆ ముగ్గురిలో ఒకరు అదే ఊర్లో వ్యవసాయం చేస్తుండగా, మరొకరు పక్కనే ఉన్న పట్నంలో ఆఫీసు గుమస్తాగా పని చేస్తున్నాడు. మూడోవాడు ఉన్నతాధికారిగా వెలుగొందు తున్నాడు. ముగ్గురు కూడా చిన్న నాటి క్లాస్‌మేట్స్‌. కాలక్రమంలో పెరిగి పెద్దగయి వివిధ రకాల జీవితం గడుపుతున్నారు. వారి ముందు ఘుమఘుమలాడే మాంసం కూర, బుసబుస పొంగే తాటికల్లు ఊరిస్తున్నవి. ప్రశాంతమైన వాతావరణంలో వారి మనసులు పురివిప్పినవి. గొంతు దిగిన కల్లు పాత వాసనల్ని తట్టి లేపింది. పంటికింది మాంసం ముక్క మాటల ఊటను ఎగజిమ్మింది.
''నర్సన్నా నువ్వొక్కనివే ఊర్లె ఉండిపోతివి'' అన్నాడు అధికారి.
''అదేం మాట తమ్మి, ఊర్ల ఉండక, ఏడికి బోవాలె నేను. ఉన్న రెండకరాలు పొతం జేసుకుంటె బట్టకు, పొట్టకు ఎల్తుంది. ఫించన్లని, బియ్యమని, పనికి ఆహార పథకమని, రకరకాల పేర్ల కింద సర్కారు సొమ్ము దొరుకుతుంది. దాంతోటి ఉన్న ఒక్క పోరిని చదివిస్తున్న. ఎన్కట ఇంత గూడ లేకుండె. మా అయ్యవ్వ కూలికి పోతెనె పొయ్యల పిల్లి లేత్తుండె. గసొంటి కాలంల సదువుడు ఏమైతది. ఎప్పుడైతే సదువు బంద్‌ పెట్టిన్నో, అప్పట్నుంచి ఎద్దుముడ్డి పొడుచుకుంట బతుకుతున్న. నా అయిషత్‌కు తగ్గట్టు ఒక్క కాన్పుకే, పిల్లలు కాకుండా ఆపరేషన్‌ చేయించిన. మేం మొత్తం అరడజను అన్నదమ్ములం. ఆ గోసేందో నాకు బాగ తెలుసు. అందుకే జాగ్రత్త పడ్డ. మీ లెక్క నేను సదువుకుంటె, నాక్కూడ ఏదో ఒక కొలువు దొరుకుతుండె. మంచిగనే బతుకుతుంటి. ఉండటానికి తాతల నాటి కొంప ఉంది. ఉన్న ఒక్క బిడ్డను చక్కగ మంచిగ చదివిస్తే, పెండ్లి చేసుకోవటానికి మొగపోరగానోల్లే వత్తరు. నాలుగు ఇత్తులేత్తే నా పని అయిపోతది. ఇగ నాకు ఏ ఆశలు లేవు'' అన్నడు నర్సన్న.
సూర్యుడు నడినెత్తి మీదికి వస్తున్నడు. ముగ్గురూ మర్రి ఊడలకు ఒరిగి కాలు జాపారు. పండుతాడు కల్లు తనపని తాను జేస్తున్నది. త్రేన్పులు శబ్దిస్తున్నవి. సగం మాంసం మిగిలే ఉన్నది. కావల్సినంత కల్లు ఉన్నది. మర్రి చల్లటి నీడనిస్తుంది. నర్సయ్య ఉన్న స్థితిలోనే ఉన్నడు. మిగతా ఇద్దరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి వెళ్ళే దారిలో ఉన్నరు. కొండగాలి హోరు గీతాల్ని వినిపిస్తున్నది. అన్నిటికి నర్సయ్య ఉన్నాడనే సోయి వారిరువురికి కొడంత ధైర్యాన్నిచ్చింది. చెట్టుపై వాలిన పక్షుల కిలకిలలు, వాటి రెక్కల రెపరెపలు నిద్రాభంగం జేస్తున్నయి. తళుక్కున మెరిసి చటుక్కున మాయమైన చెవులపిల్లి, అందంగా అటుఇటు తిరుగుతున్న ఉడతలు, వారి కంటికి కునుకును దూరం చేస్తున్నాయి. కల్లు నిషా మెదడు పొరల్లోకి దూరింది. కల్లు కూడ సగం ఖాళీ అయింది. ముప్పావు మాంసం కడుపుల్లో చేరింది.
''తమ్మీ, గుమస్తాగిరి ఎట్లుంది'' తడబడుతూ అడిగిండు అధికారి.
''అన్నా! చిన్నప్పుడు నాది కూడా నర్సన్న కుటుంబ పరిస్థితే. మా అయ్య నన్ను గవర్నమెంట్‌ హస్టల్‌లో వేసి వదిలించుకున్నడు. హాస్టల్‌ తిండి పెట్టింది. బడి చదువు చెప్పింది. నేను పెద్ద తెలివిగలోన్ని కాదు. నేలబారు మార్కులతో పాసయిన. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు లేరు. ఉన్న ఒక్కన్ని సాదే తెరువు లేదు. సెలవుల్లో ఇంటికొస్తే కూలికి పోయేది. అట్ల పైసలు సంపాదించుకొని ఖర్చులు ఎల్లదీసుకున్న. ప్రభుత్వ హాస్టల్‌ పుణ్యమా అని పై చదువులు చదివిన వయసు పెరిగినా కొద్ది శరీరంలో మార్పులు రావడం సహజం. నాకు గడ్డం, మీసం వచ్చినయి. గడ్డం తీసుకునే బ్లేడుకొనే డబ్బులు లేక రూమ్మేటును బ్లేడు అడిగితే 'కొనుక్కోవాలె, లేకుంటే గడ్డం పెంచుకోవాలె' అన్నాడు. వారానికి ఒకసారి గడ్డం గీసుకునే బదులు నాలుగు వారాలకోసారి గడ్డం గీసుకోవాలనుకున్న. అట్లా నెలకొక బ్లేడ్‌కు పరిమితమయిన. అది నా పేదరికానికి పరాకాష్ట. నర్సన్నా! మన తరం మనుషుల జీవితాలు చాలా వరకు ఒకే తీరుగ ఉన్నవి. కారణాలేమైనా మనతరంలో చదువుకున్నోడు బాగుపడ్డడు. నా లాగ మధ్య తరగతికి ఎదిగిండు. కాస్త ఉన్నోడు చదువు సహాయంతో ఎగువ తరగతికి ఎగబాకిండు. చదువుకోని నీలాంటి వాడు చావకుండా బతుకుతున్నడు. చదువు లేకున్నా బతకవచ్చు. చదువు వల్ల మరింత మెరుగుగా బతకవచ్చు. పోలియో రహిత దేశాన్ని సాధించినట్లే, నిరక్షరాస్య రహిత సమాజాన్ని సాధించాలి అన్నడు ముద్ద ముద్దగా.
''తాగినోడెప్పుడు నిజాలే చెబుతడు తమ్మీ నువన్నదాంట్ల తప్పేంలేదు. ర్యాక పట్టుకో కల్లు వంచుత. తలా నాల్గు బుక్కలు తాగితే, మొత్తం అయిపోతది. ఇంటిమొకం పట్టచ్చు. పగటియాల్ల అయితుంది. ఇంటికాడ ఎదిరి చూత్తరు. పట్టు జల్ది'' తొందర చేసిండు నర్సయ్య.
నాలుగు బుక్కలు తాగిన గుమస్తా, మేను వాల్చిండు. మిగతా కల్లును ఖాళీ చేసిండు అధికారి. నాలుగు బుక్కలు మాత్రమే తాగిన నర్సయ్య, కల్లుకుండను పక్కన పెట్టి, మిగిలిన మాంసాన్ని మొదుగాకుల పెట్టి, స్టీలు గిన్నె కడిగిండు.
''నర్సన్నా! కల్లు మొత్తం మాకే పోసినట్లున్నవు. నువ్వు తాగింది తక్కువే. గట్లెందుకు చేసినవు''
''బాపూ! నాకు వాడకం కల్లు ఉంది. రోజు తాగుతనే ఉంట. రాకరాక వచ్చిండ్రు పట్నంల ఇసొంటి కల్లు కావాలన్నా దొరుకది అందుకే మీకు పోసిన''
''పట్నంల నర్సన్నసొంటి మనిషి కూడా దొరకడు'' అధికారి గొంతు వణికింది.
'గట్లెందుకంటవే. నువ్వు ''కో'' అంటే కోటి మంది పలుకుతరు. మీ నాయిన లెక్క నువ్వు కూడా ఆత్మ గల్ల మనిషివే. లేకుంటే నా దగ్గరకచ్చి, నాతో కలిసి కల్లు తాగుతవా. చిన్నప్పుడు కలిసి చదువుకున్న దోస్తానా మరిచిపోలేదు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం.''
''నర్సన్నా బిడ్డను ఎక్కడ చదివిస్తున్నవు'' ''తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్ల''
''అవి మంచి స్కూల్స్‌, నేను ఎ.పి. రెసిడెన్షియల్‌ స్కూల్లో చదువుకున్న. అందులో చేర్పించి మా బాపు నాకు మంచి మేలు చేసిండు. నీవిప్పుడు నీ బిడ్డకు చేస్తున్నవు''
''అయితే నా బిడ్డ నీ అంత పెద్ద నౌకరి చేస్తదంటవా''
''నర్సన్నా, వెనుకటి రోజులు కావు ఇవి. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావు. చదువులు ఉద్యోగాలకు లంకె తెగింది. చదువుకున్నవాడికి భవిష్యత్తు ఉంటది. అది ఉద్యోగమా, స్వయం ఉపాదా, విదేశాలకు వెళ్ళడమా, ఏదైనా కావచ్చు. మంచిగ బతకడానికి దారులు తెరుచుకుంటవి. ఈ కాలంలో దేనికి స్థిరత్వం లేదు. వ్యవసాయ పనులు చేయటంలో అనేక మార్పులు వచ్చినట్లే, ఉపాధి, ఉద్యోగాల్లో త్వరత్వరగా మార్పులు వస్తున్నయి. చదువుకున్న వారు, మార్పులను గమనిస్తూ, ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగానికి తరలిపోతున్నరు. ప్రాధాన్య రంగాలేవో తెలుసుకుంటున్నరు. అందులో చేరుతున్నరు. ఇదంతా చదువు వల్లనే జరుగుతుంది. ఈ ప్రపంచం మన చిన్నప్పుడున్నట్లు ఉన్నదా? లేదు కదా. అందుకు కారణం కొత్త కొత్త ఆవిష్కరణలు వాటికి ఆధారం చదువు. కనుక నీ బిడ్డను మంచిగ చదివించు నీ కుటుంబంతో పాటు, ఇంకో కుటుంబం కూడా బాగుపడ్తది.''
''గిసోంటి ముచ్చట్లు నాకేం తెలుస్తయి. ఎప్పటికప్పుడు నీ సలహా తీసుకుంట''
''ఇంటికిరా, ఫోన్‌ చెయ్యి. నీ బిడ్డ భవిష్యత్‌ గురించి కూడా ఆలోచిద్దాం.'' అంటు లేచిండు.
ముగ్గురు మిత్రులు ఇంటివైపు కదిలారు. గుట్టబోరు దిగుకుంటూ ఊరి వ్యవసాయం గురించి ముచ్చటించారు. ''చెరువు నిండిందా'' అని ఒకరు. ''మిట్ట'' కు నీళ్ళు ఎక్కుతున్నయా అని మరొకరు అడుగుతుంటే నర్సయ్య ఓపికగా జవాబులు చెప్పిండు. ''మిషన్‌ కాకతీయ నీళ్ళతోటి సాగునీరు, మిషన్‌ భగీరథ నీళ్ళతో తాగునీరు దొరుకుతున్నయి'' అన్నడు. అధికారికి తన చిన్నప్పటి ''కాలువ పనులు'' యాదికి వచ్చినయి. ఊర్లు ''సెమీ అర్బన్స్‌'' కావడం యాదశ్చికం కాదు అనుకున్నడు. గట్టు దిగి అందరు కార్లో కూర్చున్నరు. మట్టిదారిపై కారు మెల్లగా కదిలింది. పక్కనే ఉన్న పచ్చటి పొలాల్నుండీ ''ఏసి'' గాలిని తలదన్నేలా పవనం వీస్తున్నది. మట్టి రోడ్డు పైకి నీళ్ళు వచ్చి తడిగా ఉంది. పక్క పొలం నుండి నీళ్ళు రోడ్డు పైకి వస్తున్నవి. నీళ్ళు రోడ్డు పైకి రాకుండా పొలం గట్టుపైన మట్టి ముద్దలు వేస్తున్న ముదుసలి కనిపించాడు. మిగిలిన నీళ్ళను మళ్ళల్లోకి మళ్లిస్తున్న రైతు కనిపించాడు.
''ఇక్కడ నీళ్ళను వథాగా పోనియటం లేదు. పట్నంలనైతే నల్లనీళ్ళు వట్టిగా పోతుంటయి'' ''పిల్లలు- పెద్దలు అనవసరంగా పారబోస్తుంటరు'' ''నీటి సంరక్షణ సామాజిక బాధ్యత'' ఇలా మాటలు సాగుతున్నయి. మాటలు, ఆలోచనల మధ్య మిత్రుల ఇండ్లు వచ్చినయి. ఎవరింటికి వారు వెళ్ళారు.
- డా|| బి.వి.ఎన్‌. స్వామి, 9247817732

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ట్యూషన్‌
మలుపు
మా అక్కయ్య
బ్లాక్‌ లేక్‌
మాటల మూటలు
నిర్లక్ష్యం ఖరీదు
స్టాట్యూటరీ వార్నింగ్‌
ఎవడైతేనేం
పరీక్ష
అర్థం - పరమార్థం
బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సరాగాల శ్రీమతి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...
కానుగచెట్టు ఇల్లు..
ఎండి పోయిన చేపలు
ఎవరు ముందు?
పునరాగమనం
పాకీజ
బంధం
ఎవరికి తెలుసు?
గోస
'నీ ప్రేమకై'
ప్రేమ వాంగ్మూలం
'వజ్రాల భరిణె'
నెగటివ్‌
ఆ ఇద్దర్ని కలవబోతుంది

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.