Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నీ దగ్గర గాజులు కొనని రోజున | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Oct 09,2022

నీ దగ్గర గాజులు కొనని రోజున

శిరీష అద్దం ముందు నిలవడి తయారైకుంట ఉంది. బయట నుంచి తన ఫ్రెండ్‌ సరిత గాజులు తీస్కోని వచ్చి శిరీషకు ఇస్తే ''ఏందే ఇంత లేటు?'' గాజులు చేతులకు వేసుకుంట అన్నది.
''నీవే తయారైతావే నేను కావొద్దా?'' అనేలోపే శిరీష రెండు చేతులు పైకి లేపి ''ఎట్లున్నయి?'' అని అడిగింది.
''మీవోడు ఇచ్చినంక ఇంకెట్లుంటయి! బాగున్నయ్‌'' అంటూ శిరీషకు బోనం కుండ తయారు చేయడంలో సహాయం చేసింది సరిత.
'అబ్బా...ఇంకా వస్తలేద'ని బజారులో రోడ్డు మీద నిలవడి శిరీష కోసం ఎదురు చూస్తుండు విజయ్‌. అట్ల బజారులో నిలవడాలంటే నామోషిగా అనిపిస్తుంది. కాని తప్పదు. చీర కట్టుకుంటే శిరీష భలే అందంగా ఉంటుందని విజయ్‌ ఫీలింగ్‌. చీరలో కనిపిస్తే చాలు కళ్ళార్పకుండా చూస్తడు. అలా చూసిన ప్రతిసారి 'మా అమ్మతో కిల ఉప్పుతో దిష్టి తీపించుకోవాలి' అని సరదాగా అంటుంది శిరీష. అట్లిట్ల విజయ్‌ ఎదురు చూపులకు తెర పడింది. శిరీష బోనంకుండ నెత్తిన పెట్టుకొని గల్లిలోంచి బజారులోకి కాలు పెట్టింది. విజయ్‌ కంట్లో పడంగానే స్లో మోషన్‌ షాట్‌లో చూసినట్టు చూసిండు. చూడటమే కాదు 'భలే ఉంది నా బంగారం' అనుకోని మెలికలు తిరిగిపోయిండు. అది శిరీష గమినించి విజయ్‌ని అప్పుడప్పుడు ఓరకంట చూస్తూనే బొడ్రాయి చుట్టూ కూడా తిరిగేసింది. చుట్టూ ఎంతోమంది ఉన్నా కాని విజయ్‌కి శిరీష ఒక్కతే ఉన్నట్టు అనిపిస్తూ కనిపిస్తుంది. ఊరు దాటిపోతున్నా విజయ్‌ మెలికలు తిరగడం ఆపలేడు. ఊరు బయటున్న పోశమ్మకు బోనం సమర్పించి వచ్చిండ్రు అంత.
                                *************
విజయ్‌ శిరీష కోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉన్నడు వాళ్ళు ఎప్పుడూ కలిసేచోట. శిరీష వెనక నుంచి వచ్చి విజయ్‌ భుజంపైన చేయి వేసి పక్కనే కూర్చున్నది. విజయ్‌ చూసి ''ఏంది ఇంత లేటు?'' అన్నడు. ''నాది సరే గాని నిన్న నీవు కొత్తగా ఆడపిల్ల చీర కట్టుకొని సిగ్గుపడినట్లు మెలికలు తిరుగుతుంటివి'' ఏంది సంగతి అన్నట్టు కను బొమ్మలు ఎగిరించింది. ''ఆ చీరల నిన్ను చూస్తే పానం ఆగుతలేదు గాని బోనం ఎత్తుకున్నవని అందులోనూ అది బజారు'' అంటూ ఆగిపోయిండు. ''లేకపోతే ఏం చేస్తుంటివి?'' అని అట్లే చూసింది ఏం చెప్తడో అన్నట్టు. శిరీష భుజంపైన చేయివేసి దగ్గరకు జరుపుకుని ''ఏం చేస్తనో తెల్వదా నీకు'' అని చెవిలో చెప్పిండు. ''జర్రాగు! నువ్వేం చేస్తవో నాకు తెల్వదు గాని ప్రతి బోనాల పండుగకు నా చేతులకు నీవిచ్చిన గాజులే ఉండాలె యాదికి పెట్టుకో'' అని చెప్పే సరికి శిరీష తలపై చేయిపెట్టి ''నీ మీదొట్టు నీ చేతులకు లేనివి గాజులే కావు సాలా?'' అని విజయ్‌ చెప్పేసరికి ''ఇందుకే నచ్చినవ్‌ రా మొగడా!'' అని చెంప గిల్లి విజయ్‌ చేతుకు ముద్దు పెట్టి ''అవును నిన్నటి ఫోటోలు చూపియ్‌'' అని అడిగితే ''ఫోటోలెక్కడివి? నేను తియ్యలేదు'' అని విజయ్‌ చెప్తే ''అబ్బ! నీవు తీయలేదంటే నేను నమ్మాల్నా?'' అంటే ''చూపియ్యక పోతే'' అని విజయ్‌ అంటే ''చూపియ్‌...చూపియ్‌'' అని బతిమాలినట్లు అడిగింది. ఫోన్‌ తీసి చూపించిండు. ఫోటోలు చూడగానే ''ఫోటోలు బాగ తీస్తవ్‌. ఒక్కటి గుర్తుపెట్టుకో... నేను ఎప్పుడు మంచిగా తయారైనా నీ ఫోన్‌లో ఆ ఫోటోలు ఉండాలె'' అని శిరీష చెప్తే విజయ్‌ సరే అన్నట్టు తలూపిండు. ''సరే పోదాం పా. మల్ల బస్‌ పోతది'' అని అక్కడి నుంచి లేచిపోయిండ్రు.
                                *************
రాత్రిపూట విజయ్‌ వాళ్ళ ఇంటిపైన నిలవడి ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. శిరీష ఫోన్‌ చేసి ''ఓయ్‌! ఆకాశంలో చుక్కల్ని చూస్తున్నావా? ఇంకేమైనా ఆలోచిస్తున్నవా?'' అని అడిగితే ''చుక్కల్నే చూస్తున్న'' అని సమాధానంగా చెప్పిండు విజయ్‌.
''ఇంతకు తిన్నావా?''
''తిన్న. నువ్వు?''
''తిన్న తిన్న. అమ్మొస్తుంది పొద్దున ఐదున్నరకు నీళ్ళకు పోదం జల్ది లేవు'' విజయ్‌ ''సరే'' అనేలోపే ఫోన్‌ కట్‌ చేసింది శిరీష. శిరీష పరిస్థితి తలుచుకుంటే చిన్నగా నవ్వొచ్చింది విజయ్‌కి. లేట్‌ అవుతోందని పైననే వేసుకున్న పరుపుల్లో పడుకున్నడు.
రాత్రి చెప్పినట్టే ఐదున్నరకే లేచి మిస్డ్‌ కాల్‌ ఇచ్చింది శిరీష. ఒక్క రింగుకే లేచి ఇంట్లోకి పోయి బిందె తీస్కోని రోడ్డు మీదకి పోతే అప్పటికే శిరీష బిందె తీస్కోని వచ్చి నిలవడింది. తనని చూడగానే ''అవును మీ అమ్మనాన్న లేరా?'' అని అడిగితే అడుగులేస్తూ ''మా నాయినకు చాయి తీస్కోని మా అమ్మ ఇప్పుడే పొలం కాడికి పోయింది. అందుకే రాత్రి నీకు చెప్పింది'' చెప్పింది.
''కాలేజికి ఎన్ని గంట్లకు పోదం''
''ఈ రోజు నేను రాకపోవచ్చు. కూలోల్లు వస్తే బుడ్డ సేను పీకుదమన్నరు''
''అయితే నేను కూడా పోను''
''నేను ఇంటికాడ ఉండను కదా!''
''ఒకవేళ కూలోల్లు రాకపోతే ఉంటావుగా!''
''అబ్బో'' అన్నది శిరీష. ఇంతలో వాళ్ళు నీళ్ళు పట్టుకోవాల్సిన బోరు వచ్చింది. విజయ్‌ తన బిందెను నింపి పక్కకు పెట్టి శిరీష బిందె నింపుతుంటే శిరీష విజయ్‌ బిందెను ఎత్తుకున్నది. విజయ్‌ శిరీష బిందెను ఎత్తుకొని ఇంటి వైపు నడిచిండ్రు. విజయ్‌ వాళ్ళ ఇంటి దగ్గర బిందెలు మార్చుకొని ఒకరినొకరు చూస్కొని ఇండ్లల్లకు పోయిండ్రు.
మధ్యాహ్నం విజయ్‌ ఇంట్లో కూర్చొని నోట్సు రాసుకుంటూ ఉన్నడు. అప్పుడే శిరీష ఫోన్‌ చేసి ''మీ అమ్మ ఉందా?'' అని అడిగితే ''లేదు. జల్ది రా'' అని చెప్తే ''అదీది చెయ్యొద్దు. ముందే చెప్తున్నా'' అన్నది శిరీష. ''ముందు నువ్వైతే రావే'' అని ఫోన్‌ కట్‌ చేసిండు విజరు. శిరీష వచ్చి విజయ్‌ వాళ్ళ మూతళ్ళ ఇంట్లో నిలవడింది. విజయ్‌ చూసి చిన్నగా నవ్వి కుర్చీలో కూర్చున్నోడు లేచి మంచం మీద కూర్చున్నడు. శిరీష తన ముందు నిలవడింది. రెండు చేతులు పట్టుకున్నడు. శిరీష విజయ్‌ని అనుమానంగా చూసింది. విజయ్‌ శిరీషను తన పైకి గుంజినట్లు అన్నడు. శిరీషకు కోపం వచ్చి ''ముందే చెప్పిన కదా'' అని చెంప మీద కొట్టింది. అట్ల కొట్టేసరికి విజయ్‌కి కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు పోయిండు. శిరీష ఆపే ప్రయత్నం చేసినా ఆగలేడు. శిరీష వాళ్ళ ఇంటికి పోయింది. పోయింది కాని పొలం కాడికి పోకుండ విజయ్‌ కోసమే ఎదురు చూసింది. అయినా లాభం లేదు. చాలాసేపు ఎదురు చూసి చూసి 'ఎక్కడపోయిండబ్బా' అని మనసులోనే అనుకున్నది. చూడంగ చూడంగ విజయ్‌ వాళ్ళ అమ్మ కనిపిస్తే భయపడుతూనే దగ్గరకు పోయి ''అవ్వ విజయ్‌ మామ ఉన్నడా'' అని అడిగితే ''పొద్దట్నుంచి తినలేదు. ఇంట్ల లేడు. యాడికిపోయిండో ఏమోనమ్మ'' అని చెప్తే 'దొంగసచ్చినోడు పొద్దట్నుంచి తినలేడా?' మనసులో అనుకోని ఇంటికి పోయి టిఫిన్లో అన్నం పెట్టుకొని పోతే పొలం కాడికే పోతడని విజయ్‌ వాళ్ళ పొలం దగ్గరకు పోయి చూస్తే అక్కడా కనిపించలేడు. 'ఇంకెక్కడికి పోయిండబ్బా' అనుకోని పక్కనే ఉన్న మర్రిచెట్టు కిందకు పోయి చూస్తే ఫోన్లో గేమ్‌ ఆడుతూ ఉన్నడు. చూడగానే శిరీషకు కోపం వచ్చింది. ముందు నిలవడి ''ఓరు! పొద్దట్నుంచి తినకుండ ఈడెం చెయ్యనీకె వచ్చినవ్‌?'' తల లేపి చూసి మల్ల గేమ్‌ ఆడుకుంట ఏం పట్టనట్టు కూర్చున్నడు. ''అలిగింది ఆపి ముందు తిను'' అని టిఫిన్‌ ముందు పెట్టింది. విజయ్‌ అసలు పట్టించుకోలేడు. ఇట్లైతే కాదని తనే చేయి కడుక్కొని తినిపిస్తుంటే నోరు తెరవకుండ బిగ్గర పెట్టిండు. శిరీషకు మల్లా కోపం వచ్చింది. ఎడమచేతితో మల్లోటి ఇచ్చింది. దెబ్బకు టైంకు తినకపోతే వాళ్ళమ్మ కొట్టింది గుర్తుకు వచ్చింది విజయ్‌కి. ఏమీ మాట్లాకుండా నోరు తెరిచిండు. టిఫిన్‌ మొత్తం ఖాళీ అయ్యింది. తిన్న తర్వాత ఇద్దరు మల్ల మురిపెంగా ముచ్చట్లు, సరసాలు షురూ చేసిండ్రు.
                               *************
శిరీష కాలేజికి పోదమని తయారై టిఫిన్‌ పెట్టుకొని వంట రూంలోంచి హాల్లోకి వస్తుంటే వాళ్ళమ్మ బయట నుంచి వచ్చి చూసి ''ఇయ్యాల కాలేజికేమొద్దమ్మా'' అని చెప్తే 'ఎందుకు?' అన్నట్టు చూసి ''ఎప్పుడూ నీవే పొమ్మని చెప్పేదానివి. ఈరోజు ఎందుకమ్మా?'' అని అక్కడే నిలవడింది. ''గా ధరంపురమోల్లు చూడనింకె వస్తరని మీ బుచ్చత్త గిప్పుడే చెప్పిపాయె'' అని చెప్పేసరికి చేతిలున్న టిఫిన్‌ ఎప్పుడు కిందపడిపోయిందో. అన్నం కూర ఇళ్ళంతా చిట్లింది. 'ఇప్పుడైనా విజయ్‌ గురించి చెప్పాలి' అని మనసులో అనుకున్నది. ''అమ్మ నేనా పెండ్లి చేసుకోను'' అన్నది. అప్పటిదాక ప్రశాంతంగా శిరీష తల్లికి ఎక్కడలేని కోపం వచ్చింది. ''ఏం గా కులం తక్కువోన్ని చేస్కుంటవా?'' గట్టిగా అనేసరికి ఉలిక్కి పడింది శిరీష. ''నీ బాగోతమంతా తెలుసే. నీవు యాడ యాడ బువ్వ తినవెట్టింది. కలిసి నీళ్ళు మోసింది. ఇంట్లకు వోయి ముచ్చట్లు వెట్టింది. దీన్ని ఇంట్ల వెట్టుకుంటే కులంల ఇలువ వోతదని బుచ్చావకు నేనే చెప్పిన సంబంధం తెమ్మని'' అని ఒక్కొక్క మాట తల్లి అంటుంటే శిరీషకు ప్రాణం పోయినట్లు అనిపించింది. కంట్లోంచి నీళ్ళు జారుతున్నయి. మెల్లగా కన్నీళ్లను తూడ్చుకొని ''విజయ్‌ని చేసుకోకపోతే నేను చచ్చిపోతా'' అన్నది. ''తెలుసే నీ వొగలు. నీవెందుకు సస్తవ్‌? నేనే సస్త కులం తక్కువోన్ని చేసుకొని ఊరిల మొఖం మీద ఉమ్మిచ్చుకో'' అని బుడ్డ చేను కోసం తెచ్చినప్పుడు మిగిలిన పురుగుల మందు డబ్బని లోపలి ఇంట్లోకి పోయి తెచ్చుకున్నది తల్లి. అది చూసి లేచిపోయి పట్టుకొని ''నీవు చెప్పినట్టే ఇంటమ్మా'' అని ఆపింది శిరీష. ఆ మాట అనేసరికి మందు డబ్బ కిందపెట్టి గోడకు వొరిగి కూర్చున్నది తల్లి. శిరీష కూడా మరో గోడకు ఏడ్చుకుంట వొరిగింది. శిరీష ఏడ్పు చూడలేక ''ఇన్ని దినాలు ఆ పిలగానితో ఆడుకున్నవో పాడుకున్నవో నీకే తెల్సు. కాని పెండ్లి చేసుకుంటే కులం పోతది బిడ్డా... మన కులపోళ్ళు మనల ఎల్లగొడుతరు. ఆ పిలగాడు మంచోడే నేను కాదనను. కాని కులం తక్కువోడు బిడ్డా. నీ కాళ్ళు మొక్కమన్నా మొక్కుత. ఆ పిలగాన్ని మర్సిపోయి చూసిన సంబంధం చేసుకో'' అని తల్లి చెప్తుంటే శిరీషకు ఊపిరి ఆగినట్టు అనిపించింది. ''నేను మరిసిన విజయ్‌ మరువడు'' అని ఎక్కిళ్ళు పడుతున్నా ఏడుపు ఆపలేదు. ''తెలుసు. ఏమన్నా చెప్పి ఆ పిలగాన్ని కూడా బాధవెట్టకుండా నచ్చజెప్పు. కాని ఇంక మునుపటిలెక్క కలువకు'' అని చెప్పి ఆమె పని చూస్కున్నది. శిరీష ఏడుస్తూ అట్లే కూర్చున్నది. బయట వర్షం మొదలైంది. ఇంతింత గట్టిగా కొడుతున్నది. శిరీష మూడు రోజులైనా బయటకు రాలేదు. విజయ్‌ తన కోసం ఊరంతా వెతుకుతున్నడు. ఫోన్‌ చేతులోంచి పక్కన పెడుతలేడు ఎప్పుడు చేస్తదా అని. ఇద్దరు తినకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ, రాత్రిళ్ళు నిద్రపోకుండా ఉంటున్నరు. ఇంట్లోనే కట్టేసినట్టు అయ్యింది శిరీష పరిస్థితి. ఇద్దరు ఎక్కడెక్కడ కలిసేవారో అక్కడంతా తిరుగుతున్నడు విజయ్‌. ఇద్దరి మొఖాల్లో కళ చెదిరింది. వాళ్ళు కలవక ఐదు రోజులు అయ్యింది. గత నాలుగు రోజుల నుంచి తల్లి శిరీషను వదిలి కనీసం పొలం కాడికి కూడా పోలేదు. శిరీష ఇంట్లోంచి బయటకు వెళ్ళలేకపోయేసరికి ఫికర్‌ లేదని ఐదవ రోజు పొలం కాడికి పోయింది కాని ఎప్పుడొస్తదోనని టెన్షన్‌. ఇంట్ల శిరీష ఒక్కతే ఉంది. టీవీ దగ్గర ఫోన్‌ పెట్టి మర్చిపోయింది తల్లి. శిరీష చూసి చేతికి తీస్కున్నది. విజయ్‌కి ఫోన్‌ చేసింది. విజయ్‌ పొలం దగ్గర వర్షంలో చెత్రి పట్టుకొని ఉన్నడు. ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉంది. ఫోన్‌ వస్తున్న సంగతి కూడా తెలుస్తలేదు. నాలుగు సార్లు చేసింది శిరీష. వాళ్ళమ్మ వస్తదేమోనని ఒకపక్క టెన్షన్‌గా ఉంది. విజయ్‌ జేబులో చేయి పెట్టి ఫోన్‌ తీసి చూస్తే నాలుగు మిస్డ్‌ కాల్స్‌ ఉన్నయి. 'అయ్యో శిరీష ఫోన్‌ చేసిందా?' అని సంతోషంతో కంట్లో నీళ్ళు తిరిగినయ్‌. తిరిగి శిరీషకు ఫోన్‌ చేసిండు. ఎత్తి ఏడుస్తూనే ''అరె తిక్కోడా ఎన్నిసార్లు ఫోన్‌ చెయ్యాలె? జల్ది ఎత్తనీకె రాదా?'' అన్నది. శిరీష గొంతు వినగానే నవ్వుతుంటే కంట్లోంచి నీళ్ళు జారినయ్‌. ''ఈ ఐదు రోజులు నన్ను చూడకుండా ఎట్లున్నవే? నాకైతే పానం పోతుంది'' ఆ మాట వినగానే శిరీష కంట్లోంచి సర్రున నీళ్ళు దుంకినయ్‌. ఏడుస్తూనే ''ఇక మనం కలువం'' అని జరిగిందంతా చెప్పింది. విజయ్‌కి షాక్‌ కొట్టినట్టు అయ్యింది. చేతిలో ఉన్న చెత్రి గాలికి ఎగిరిపోయింది. అంతా విని వర్షంలో అక్కడే కూలబడిపోయిండు. శిరీష కూడా ఇంట్లో కూలబడి పోయింది. చేతిలో ఉన్న ఫోన్‌ పక్కకు పడిపోయింది. బాధలోనే పదిగేను రోజులు గడిచిపోయింది.
                                    *************
సరిత విజయ్‌ని తోల్కొని శిరీష వాళ్ళ ఇంటి వెనకకు వచ్చింది. శిరీష పెళ్లి కూతురు అవతారంలో వచ్చింది. అప్పటి వరకు తల కిందికేసుకొని ఉన్న విజయ్‌ తల లేపి శిరీషను దీనంగా చూసిండు. విజయ్‌ని చూడగానే శిరీష కంట్లో నీళ్ళు జారినయ్‌. తట్టుకోలేక ఉరికిపోయి విజయ్‌ని గట్టిగా పట్టుకున్నది ఏడుస్తూనే. విజయ్‌ కంట్లో కూడా నీళ్ళు. వాళ్ళను చూస్తే సరితకు కూడా వచ్చినయ్‌. శిరీష విజయ్‌ని వదలకుండా పట్టుకున్నది. ''నేను మనిషికి మనుం పోతలేను. కులానికి మనుం పోతున్న. మరిచిపోయిన అనుకోకు మనసులనే దాచుకున్న. నా గురించి ఆలోచించి నీ మనసు పాడుచేసుకోకు. టైంకు తిను. నీవు బాధపడి నన్ను బాధవెట్టకు. అమ్మని మంచిగా చూస్కో. నీకు నా కంటే మంచి అమ్మాయి భార్యగా వస్తది. పెళ్లి చేసుకొని అక్కడే ఉంటానుకోకు. ప్రతి బోనాల పండుగకు నీవిచ్చే గాజుల కోసమైనా వస్తా...'' శిరీష ఆగకుండా చెప్తుంటే విజయ్‌ నోటిలోంచి మాట వస్తలేదు. మెల్లగా విజయ్‌ని వదిలేసింది. చూస్తూనే అట్లే వెనకకు అడుగులేస్తూ ఇంటికి పోయింది. విజయ్‌ అక్కడే చీకట్లో నిలబడి తను పోయేంతవరకు చూస్తూ ఉన్నడు. కాలం గిర్రున సంవత్సరం తిరిగింది. విజయ్‌ ఒంటరి పక్షిలానే తిరుగుతున్నడు.
                                  *************
గాజుల బువ్వమ్మ ఇంటి ముందుకు పోయి నిలవడిండు విజయ్‌. అతన్ని చూడగానే ఇయ్యాల బోనాల పండుగని బువ్వమ్మకు అర్థం అయ్యింది. గాజులు ఇస్తూనే ''ఇంకా మరువవారా ఆ పిల్లను?'' అని అడిగింది.
''నీ దగ్గర గాజులు కొనని రోజున మర్చిపోయిన అనుకో అత్త!'' అని గాజులు తీస్కోని ఇంటికి చేరిండు విజయ్‌.

- కెపి లక్ష్మీనరసింహ, 9010645470

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రేన్వన్ల చెట్టుకాడ !
రైతులకు సాయం
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు
సివంగి
పచ్చలహారం
చేపల కూర
నాన్నా పులి
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు
అందరూ మూర్ఖులే!
ఎప్పటిలాగే....
మరణం లేని గమనం !
కోతి.. మేక...
పెళ్లి తంతు
వెరీ గుడ్డు
కాంతారా..
అసలైన మిత్రుడు..!
మాయ కుండ
టింగ్‌.. టింగ్‌..
అహంకారం
ఆశ
అసలైన ఎంపిక ?
అవ్వ జెప్పిన సుద్ది
గర్వభంగం
థాంక్యూ
వర్క్‌ ఫ్రం హోం
సమస్య-మూలం
నిజాయితీ
సారీ నాయనమ్మ..!
ఆశ-నిరాశ

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.