Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వాటాల తగాదా | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Oct 16,2022

వాటాల తగాదా

           జంబుకారణ్యంలో నివసించే లేళ్ళకు, దుప్పులకు మధ్య పచ్చగడ్డి తినేకాడ పెద్ద తగాదా వచ్చింది. ''అరణ్యంలోని పచ్చగడ్డంతా మీరే తింటున్నారు. మా వాటా ఆహారం కూడా మాకు దక్కడం లేదు. మీకు, మాకు ఆహార విభజన జరగాల్సిందే. మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు'' అని పెద్ద అందోళన లేవదీశాయి దుప్పులు. ''లేదు లేదు. మేము మీకంటే చిన్న జంతువులం. మా కాళ్ళు పొడవుగా, కండ్లు లావుగా ఉంటాయే కానీ, పొట్ట మాత్రం చిన్నదే. కావాలంటే, మీ పొట్టల్ని, మా పొట్టల్ని కొలిచి చూద్దాం. ఎవరివి పెద్ద పొట్టలో..? ఎవరు ఎక్కువ పచ్చి గడ్డి తింటున్నారో...? మేమంటే కూసింత దయ, జాలి లేదు మీకు . మేము పచ్చిక మేస్తుంటే, హఠాత్తుగా వచ్చి కొమ్ములతో కుమ్మి, మమ్ము దూరంగా తరిమేస్తున్నారు. అలా కుమ్మినప్పుడు మా లేళ్ళు చాలా చని పోయాయి కూడా. అసలు మీ వల్లనే మాకు అన్యాయం జరుగుతోంది'' అన్నాయి లేళ్ళు. ఎవరి పంతం వారిదే. పరస్పర ద్వేషం పెరిగిపోయి, నిత్యం పోట్లాడుకో సాగాయి. ఆ పోట్లాటలో ఇరు పక్షాల జంతువులు మరణించసాగాయి. చచ్చిన జంతువులను మాంసాహార జంతువులు చక్కాగా భోంచేయసాగాయి.
            రెండు శాఖాహార జంతువుల మధ్య గొడవ చిలికి చిలికి యుద్ధానికి దారి తీసింది. ఒకరంటే ఒకరు నిప్పులు కక్క సాగారు. ఇద్దరి మధ్యనున్న పచ్చ గడ్డి భగ్గుమని మండ సాగింది. అడవిలోని జంతువులన్నీ రెండుగా చీలిపోయాయి. అడవిలో ఎక్కడ చూసినా జంతువుల మధ్య ఇదే చర్చ. కొన్ని, 'లేళ్ళది న్యాయమంటే - మరికొన్ని దుప్పుల వైపే న్యాయం ఉంది' అని వాదించ సాగాయి.
ఒకనాడు దుప్పి నాయకుడు తమ వారిని వెంట పెట్టుకుని, సింహ రాజు కొలువుకు వెళ్ళాడు. వినయంగా నమస్కరించి ''మాకు రావలసిన ఆహారం వాటా, ఆ లేళ్లే తెగ తినేస్తున్నాయి. న్యాయంగా మాకు దక్కవలసిన ఆహారం దక్కడం లేదు. దీనివల్ల మేము ఆకలితో, చాలా అవస్థ పడుతున్నాము. మాకు తగిన న్యాయం చేయండి మహా రాజా !'' అని వేడుకుంది. పక్కనున్న జంతువులు కూడా యధా శక్తి ప్రార్థించాయి రాజును
''అసలు అడవికి అందం మీరే. మీలాంటి కొమ్ములు మరో జంతువుకు లేనే లేవు.'' అంది మంత్రిగా ఉన్న నక్క ప్రశంసిస్తూ.
''మీ అరుపు ఎంత మధురంగా ఉంటుందో ...'' పొగిడింది సైన్యాధిపతి తోడేలు.
''మీరు ఎప్పుడూ, ఎవరి జోలికి వెళ్ళిన వాళ్ళుకాదు. ఇప్పుడొచ్చి ఫిర్యాదు చేస్తున్నారంటే, మీకు అన్యాయం జరుగుతుందన్న మాటే'' అన్నాయి రాజుకు సలహాలు ఇచ్చే పెద్ద పులి, ఎలుగు బంటీనూ.
అంతా విన్న సింహము ''విచారించి న్యాయం చేస్తాము. మీరు వెళ్ళండ'' అంది హుందాగా.
దుప్పులన్నీ పలుమార్లు నమస్కారాలు చేశాయి. కొమ్ములు విసురుకుంటూ, లేళ్ళ మీద గెలిచినంత సంబరంగా గంతులు వేస్తూ ఊరేగింపుగా సాగాయి. తమ నాయకుణ్ణి భుజాలమీద మోస్తూ, జే ..జే లు కొట్టుకుంటూ ఇంటి దారి పట్టాయి.
రాజును తమ ప్రత్యర్ధులు కలిసినారని తెలియగానే, మరుసటి రోజే, తన వారిని వెంటబెట్టుకొని, లేళ్ళ నాయకుడు బయలు దేరాడు.
''ప్రభువా! శరణు! శరణు!!. ఆ దుప్పులనే క్రూర మగాల నుండి మీరే మమ్ము రక్షించాలి. సరిగా మేత మేయలేకున్నాం. నీళ్ళు తాగలేకున్నాం. నిద్ర కూడా పట్టడం లేదంటే నమ్మండి. ఎప్పుడు దాడి చేస్తాయోనని భయపడి చస్తున్నాము. వాటి పచ్చ గడ్డంతా మేమే తింటున్నామని, అడవి మొత్తం దుష్ప్రచారం చేస్తున్నాయి, ఇద్దరి కడుపులు కొలవండి ఎవరివి పెద్ద డొక్కలో? వేగంగా పరిగెత్తు తామనే కానీ, పచ్చి గడ్డి తినడంలో చాలా నెమ్మది. ఎప్పుడే జంతువు వచ్చి, మా మీద పడి చంపేస్తుందో అని, భయంతో రెండు మూడు పోచలే తింటుంటాము. మేము ఎవరి జోలికి పోయే వారము కాదు. ధర్మంగా జీవించే మమ్ము కావాలని, రద్దీ పాలు చేస్తున్నాయి ఆ దుప్పులు. న్యాయా న్యాయాలు విచారించి తమరే మాకు న్యాయం చేయాలి.... మహా ప్రభువులు'' అని ప్రార్థించాయి.
''చ్చో... చ్చో... చ్చో... చిన్న జంతువులకి ఎంత కష్టమొచ్చింది'' సానుభూతి తెలిపింది నక్క.
''అసలు మీరుంటేనే కదా అడవికి అందం. మీ వంటి మీది అందమైన మచ్చలు, విశాలమైన కండ్లు, వేగంగా పరిగెత్తే మీ కాళ్ళు ... అబ్బో.. మీ రూపంకు మరో జంతువు సాటి రాదు'' అంది తోడేలు పొగిడేస్తూ.
''మీ బోటి చిన్న జంతువులను ఆదుకోవడం, బలమైన మగాల బారి నుండి, బలహీనమైన జంతువులను కాపాడటమే కదా మన మహారాజు ధర్మం. మీకు తప్పక న్యాయం జరుగుతుంది.'' అన్నాయి పులి, ఎలుగు బంటి ఒక్క మాటగా.
''మీరు నిర్భయంగా ఉండండి. త్వరలోనే చట్టం చేసి , ఎవరి వాటా వారికి ఏర్పాటు చేస్తా. వెళ్ళి రండి'' అని ధైర్యం చెప్పి పంపించింది సింహం.
సంతోషంతో ఉక్కిరిబిక్కిరై అమాంతం పాదాల మీద పడి మొక్కాయి. ఆనందంతో చిందులు తొక్కుకుంటూ. దుంకులు పెట్టుకుంటూ ఇంటి దారి పట్టాయి లేళ్ళు. తమ నాయకుణ్ణి ఆకాశంలోకి ఎగరేసి ఆనందాన్ని ప్రకటించుకున్నాయి లేళ్ళన్నీనూ.
''చాలా బాధాకరం. ఒకే గర్భంలో పుట్టినట్లుగా ఉండే జింకలు, దుప్పులు నిత్యం పోట్లాడుకొని మరణిస్తున్నాయి. ఇది మన అడవికి, రాజైన నాకూ చాలా తల వంపులు. వెంటనే వీటి సమస్యను తేల్చి పడేద్దాము. మంత్రి వర్గాన్ని సమావేశ పరచండి.'' అంది సింహం.
''ఏంది తేల్చేది. వాటి మధ్య అనైక్యత ఎప్పుడూ ఉండాలి. మనం పరిష్కరిస్తున్నాట్లూ నటించాలి. సమస్య కాస్తా తీరి పోతే, చిన్న జంతువులన్నీ ఒక్కటవుతాయి. అప్పుడు మీ సింహాసనానికే ముప్పు వస్తుంది... ఆలోచించండి'' అంది నక్క.
''నిజం మహా రాజా. అవి నిత్యం పోట్లాడు కోవడం వల్లనే కదా మనకు మాంసం దొరికేది.. మీ రాచరికం నిలబడేది. ఎవరూ మీ దగ్గరికి రాక, ఏ సమస్య లేక మీకు ఉనికి ఏముంటుంది?'' అంది తోడేలు.
''న్యాయం చేస్తున్నట్లు కనపడాలి. కానీ న్యాయం జరగ కూడదు. ఏదో ఒక సమస్యతో సమస్యను సమస్యలాగే ఉంచాలి. మనకు మంచి చేస్తున్నామనే పేరు రావాలి. ఇదే రాజనీతజ్ఞత'' అన్నాయి పులి, ఎలుగుబంటి కలిసి.
''అయితే ఏం చేద్దామంటారో మీరే చెప్పండి'' అంది సింహం.
''ఏమీ లేదు. ఒక కమీషన్ను వేద్దాము. నివేదిక ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో మనమే నిర్ణయించుదాం. అలా మనం చెప్పినట్లు చేసే గుంట నక్క ఉండనే ఉంది.'' అని సలహా ఇచ్చాయి.
ఒక నాడు ఇరువురు నాయకులను పిలిచి, ''మీ సమస్య పరిస్కారం కోసం ఓ కమీషన్ను వేస్తున్నాం. నివేదిక ఇవ్వగానే, దాని ప్రకారం మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు ఓపిక పట్టారు, ఓ నాలుగేండ్లు ఆగండి'' అని చెప్పింది సింహం.
''అంత కాలం మేము ఆగలేము. రెండు ఏండ్లల్లో తేల్చాల్సిందే'' ప్రతిఘటించాయి రెండూనూ.
''సరే. రెండు ఏండ్లల్లో నివేదిక ఇవ్వమని ఆదేశిస్తున్నాను'' అంది సింహం గుంటనక్కను.
జింకలు, దుప్పులు రాజుకు జేజేలు పలుకుతూ, వెళ్ళి పోయాయి. .
గుంట నక్క, రాజ పరివారంతో రహస్యంగా మాట్లాడి నిష్క్రమించింది.
అడవంతా తిరిగిన గుంటనక్క, అనేక జంతువులను కలిసి, అవి ఇచ్చిన దరఖాస్తులను తీసుకొని, రెండు ఏండ్లకు మరో తొమ్మిది నెల్ల సమయం తీసుకొని, రాజుకు నివేదిక తయారు చేసి ఇచ్చింది. నివేదిక మహారాజు పరిశీలనలోనే ఉంది. కొన్ని లీకులు అనధికారికంగా వచ్చాయి. అవి ఇద్దరినీ గాయ పరిచాయి. ఎవరికీ సమ్మతంగా లేవు. మళ్ళీ అందోళనలు జరిగాయి. మహారాజుకు అనుకూలురైన ఉభయ జంతువుల్లోని కొన్ని ''ఒక్కరు చేసిన విచారణ, సక్రమంగా ఉండదు. మేము అంగీకరించం. ముగ్గురు సభ్యులతో కమీషన్‌ వేయాల్సిందే'' అని గొడవ చేశాయి. వాటి మాట మన్నించి సింహం - పులి, తోడేలు, ఎలుగు బంటితో మరో కమీషన్ను ఏర్పాటు చేసింది. అది దీర్ఘ కాలంగా సాగుతోంది. లేళ్ళు, దుప్పులు పోట్లాడుకొని చస్తూనే ఉన్నాయి. ఊరేగింపులు, తమ తమ జాతి సమీకరణలు జరుగుతూనే ఉన్నాయి. సమస్య అలాగే ఉంది.
దీనినంతా చూసి, బాధపడిన కుందేలు పరిష్కారం కోసం, ఒకనాడు లేళ్ళ గుంపు నాయకుని వద్దకు వెళ్లింది.
''మనం చిన్న జంతువులం. మన మీద పెత్తనం చేస్తూ క్రూర జంతువులు బతుకుతున్నాయి. మనల్ని తిని బతికే పాలకులు మనకు న్యాయం చేస్తారనుకోవడం పొరబాటు. మొత్తం అడవిలో ఉన్న పచ్చికలో మీరిద్దరు కలిసి తినేది పది శాతం కూడా ఉండదు. అడవి దున్నలు, గేదెలు, ఎనుబోతులు వంటి పెద్ద జంతువులు ఎక్కువ తింటున్నాయి. వాటిలో లేని విబేధాలు, నాలుగు పోసలు తిని బతికే మీకెందుకు? సంధి కుదురుస్తాను. సౌఖ్యంగా ఉండండి. మనం కలిసుంటే, రాజు పదవి కూడా మనకే దక్కుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి..'' అంది కుందేలు వివరిస్తూ .
''ప్రశాంతంగా బతికే మమ్ము శారీరకంగా, మానసికంగా గాయ పరిచింది ఆ దుప్పిలు. వాటి మీద ఎంత కాలమైనా పోట్లాడుతాము. బలమైన దున్నలమీద, ఎనుబోతుల మీద మేం పోట్లాడలేము. మేము పోరాటం మొదలు పెట్టాకే - అడవిలో మాకో గుర్తింపు, అస్థిత్వం వచ్చింది. వాటాల పంపిణీ జరగదని తెలుసు. కానీ అందరూ నన్ను గౌరవిస్తున్నారు. మా జాతిని ఐక్యంగా ఉంచి, కావలసిన పనులు చక్కబెట్టుకుంటున్నాను. మీ సలహాకో నమస్కారం. దయచేయండి'' అని పంపించి వేశాడు లేళ్ళ గుంపు నాయకుడు.
బాధతో వెను తిరిగింది కుందేలు. అటు నుంచి ఐక్యత సాధ్య పడుద్దేమోనని దుప్పుల నాయకుడి వద్దకు వెళ్లింది. లేళ్ళ కాడ చెప్పినట్లే సమస్య విడమరచి చెప్పి ''మనం చిన్న జంతువులం. శాకాహారులం. అన్నదమ్ముల వంటి మీ మధ్య విద్వేషాలు పెరిగి, ఇరు వైపులా అనేక జంతువులు చస్తున్నాయి. ఐక్యంగా ఉండి మనకున్న ఓటుతో, రాజ్యాధికారం సాధించాలి. మనల్ని తిని బలిసే జంతువుల మీద పోట్లాడాలే కానీ, మనలో మనం కొట్లాడుకోవద్దు. మనమందరం కలిస్తే మనదే రాజ్యాధికారం'' అని హితవు పలికింది కుందేలు.
దుప్పి నాయకుడు కొన్ని క్షణాల పాటు కుందేలును వెర్రి దానిలా చూసింది. ''ఈ సుద్దులన్నీ నాకు తెలీదని చెపుతున్నావా? వాటాల విభజన సాధ్యం కాదని తెలుసు. పై నాయకులు చేయరని తెలుసు. మేము పోట్లాట మొదలు పెట్టడం వల్లనే మాలో ఐక్యత వచ్చింది. నలుగురు చస్తేనే కదా మాలో పౌరుషం పెరిగి ఒక్కటయ్యేది. గొడవ ఉంటేనే కదా నేను నాయకుడిగా వెలిగేది. కొన్ని లక్షలుగా ఉన్న మా వాళ్ళు నేను చెప్పినట్లు వింటున్నారు. మంటల్లో దూకమన్నా దూకుతారు. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ - మా ఓట్లను టోకునా, చిల్లరనా అమ్ముకొని చారెడు డబ్బులు, మూరెడు భూములు సంపాదించుకుని ఇలా సుఖంగా ఉన్నాను. నీ బోడి సలహా నాకేం అక్కర లేదు. వెళ్ళు'' అంది కోపంగా దుప్పి.
గాయపడ్డ మనసుతో వెను తిరిగింది కుందేలు. ''ఉద్యమాల్లో న్యాయం, సత్యసంధతా - నాయకుల్లో నిజాయతీ, త్యాగబుద్ది లేకుండా పోరాటాలు ఎప్పుడూ విజయం సాధించలేవు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు'' అనుకుంటూ తన ఇంటికి చేరింది.
లేళ్ళు, దుప్పులు ఇంకా పోట్లాడుకొని మరణిస్తూనే ఉన్నాయి. నాయకుల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. సమస్య మాత్రం అల్లాగే ఉంది.

- పుప్పాల కృష్ణమూర్తి, 99123 59345

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రేన్వన్ల చెట్టుకాడ !
రైతులకు సాయం
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు
సివంగి
పచ్చలహారం
చేపల కూర
నాన్నా పులి
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు
అందరూ మూర్ఖులే!
ఎప్పటిలాగే....
మరణం లేని గమనం !
కోతి.. మేక...
పెళ్లి తంతు
వెరీ గుడ్డు
కాంతారా..
అసలైన మిత్రుడు..!
మాయ కుండ
టింగ్‌.. టింగ్‌..
అహంకారం
ఆశ
అసలైన ఎంపిక ?
అవ్వ జెప్పిన సుద్ది
గర్వభంగం
థాంక్యూ
వర్క్‌ ఫ్రం హోం
సమస్య-మూలం
నిజాయితీ
సారీ నాయనమ్మ..!
ఆశ-నిరాశ

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.