Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మరణం లేని గమనం ! | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Jan 01,2023

మరణం లేని గమనం !

ఆరోజు మేఘాలు దట్టంగా కమ్మి జోరుగా వర్షం కురుస్తుంది. రాఘవరావు వేడివేడిగా కాఫీ చేసి దేవ్‌ రూమ్‌కి తీసుకువెళ్ళాడు. ''దేవ్‌.., లే నాన్నా తెల్లారింది'' అని తట్టి లేపాడు. దేవ్‌ పక్కన ఉన్న టేబుల్‌కి ఆనుకొని ఉన్న వాకింగ్‌ స్టిక్‌ని తడుముకుంటూ తీసుకొని చుట్టూ తడుముతూ లేచే ప్రయత్నం చేశాడు.
''గుడ్‌ మార్నింగ్‌ తాతయ్య'' అని విష్‌ చేశాడు.
''రాత్రి బాగా నిద్ర పట్టిందా?'' అని అడిగాడు రాఘవరావు.
''చాలా గాఢంగా నిద్ర పట్టేసింది తాతయ్య'' అందుకే త్వరగా లేవలేక పోయాను అని అన్నాడు దేవ్‌!
''త్వరగా లే ! లేచి రెడీ అవు. ఈ రోజు నీకు కాలేజీకి ఫస్ట్‌ డే కదా! లేట్‌ అవుతుంది పైగా బయట బాగా వర్షం పడుతుంది'' అన్నాడు రాఘవరావు.
''క్యాబ్‌ బుక్‌ చేస్తాను. ఈ వర్షం తగ్గేట్టు లేదు'' అని ఫోను తీసి క్యాబ్‌ బుక్‌ చేస్తున్నాడు. ఇంతలో దేవ్‌ ''వద్దులే తాతయ్య పక్కింటి రమేష్‌! అదే దారిలో వెళ్తాడు కదా! డ్రాప్‌ చేయమని అడుగుతాను'' అని అన్నాడు.
''సరే నేను వెళ్లి అడుగుతాను. ఈలోపు నువ్వు ఫ్రెష్‌ అప్‌ అయి రెడీ అవ్వు'' అని కాఫీ కప్పు చేతికిచ్చాడు.
రాఘవరావు పక్కింట్లో ఉంటున్న ప్రకాష్‌ రావు ఇంటికి వెళ్ళాడు. ప్రకాష్‌ రావు బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. దేవ్‌ నాన్న ప్రకాష్‌ రావ్‌ మంచి స్నేహితులు. దేవ్‌ తల్లిదండ్రులు కార్‌ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ రోజు ఆ కారు యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన దేవ్‌కి కంటి చూపు కూడా పోయింది. ఆ రోజు నుంచి అన్నీ తానే చూసుకుంటున్నాడు వాళ్ళ తాతయ్య రాఘవరావు.
ప్రకాష్‌ కొడుకే రమేష్‌! బీటెక్‌ చదువుతున్నాడు. దేవ్‌, రమేష్‌ కూడా స్నేహితులే.
బాబు రమేష్‌! ''ఈ రోజు మా వాడ్ని కాస్త కాలేజ్‌ దగ్గర దింపేయి నాయనా''. అని అడిగాడు రాఘవరావు.
''అయ్యో దానికేం తాతయ్య! తప్పకుండా దింపేస్తాను. వర్షం పడుతుందని నేను ఈ రోజు కార్లోనే వెళ్తున్నాను'' అని చెప్పాడు రమేష్‌.
''ఎలా అయితేనేం! కళ్లు లేకపోయినా కష్టపడి తన ఎడ్యుకేషన్‌ పూర్తి చేస్తున్నాడు. చాలా తెలివైనవాడు. కాని భగవంతుడే చిన్నచూపు చూశాడు. ఆ రోజు అలా జరగకుండా ఉండి ఉంటే ఈ రోజు మా రమేష్‌తో పాటు వాడు కూడా బీటెక్‌ చదువుకునే వాడు. ఒక చిన్న యాక్సిడెంట్‌ జీవితాలను తిరగ రాసింది'' అని నిట్టూర్చాడు ప్రకాశ్‌!
ఏం చేస్తాం! కళ్ళ ముందే కొడుకుని, కోడలిని పోగొట్టుకున్నాను. ఎవరూ లేని నా మనవడికి మిగిలిన చిరు దీపంగా మిగిలి పోయాను. నా కళ్ళు వాడికి పెట్టించాలని ఎన్నో సార్లు ప్రయత్నించాను. నాకే గాని శుక్లాలు లేకపోయి ఉంటే నా కళ్ళు వాడికి ఇచ్చేవాడిని. ముసలి వాడిని ఏ మూలో శేష జీవితం గడిపేవాడిని. ఇంత చిన్న వయస్సు నుంచి వీడి కష్టం చూసి తట్టుకోలేక పోతున్నాను. నేను ఉన్నన్నాళ్లు ఏ భయం లేదు ఎలాగోలా వాడిని చూసుకుంటాను. నాకు ఏదైనా జరిగితే వాడి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నా గుండె బెంగతో కొట్టుమిట్టాడుతోంది'' అని బాధపడ్డాడు రాఘవరావు.
''ఊరుకోండి అంకుల్‌. మేము లేమా దేవ్‌కి. మీకు ఏమీ జరగదు. ఖచ్చితంగా సెంచరీ కొడతారు'' అని ధైర్యం చెప్పాడు ప్రకాష్‌. అలా వారిరువురూ మాట్లాడు కుంటుండగా దేవ్‌ రానే వచ్చాడు. రమేష్‌ దేవ్‌ని జాగ్రత్తగా కార్లో కూర్చో బెట్టి బ్లైండ్‌ స్కూల్‌కి తీసుకొని వెళ్ళాడు.
బ్లైండ్‌ పీపుల్‌కి సెల్ఫ్‌ మోటివేషన్‌ క్లాసెస్‌ చెప్పడానికి కొత్త టీచర్‌ని నియమించారు. ఆమె పేరు జెస్సి. అందరూ టీచర్‌ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అంతలోనే ఒక తీయని స్వరం సైలెన్స్‌ ప్లీజ్‌ అంటూ వినబడింది. ఎంతో చక్కని స్వరం. అది వినగానే అందరూ సైలెంట్‌ అయిపోయారు. ఆమె మాటలు తెలియని ఉత్తేజాన్ని అందరిలో నింపుతున్నాయి. ఎంతో చక్కగా మాట్లాడుతుంది. ఆత్మ విశ్వాసాన్ని నింపే ధైర్యాన్ని కలిగిస్తుంది. రోజు ఆమె మాటలు వింటున్న దేవ్‌కు ఆమెపై ఇష్టం పెరిగింది. తనతో స్నేహం చేయాలని తనని చూడాలని ఉబలాటం కలిగింది. కానీ తనని చూడడం దేవ్‌కి అసాధ్యం అని తలచుకుని బాధ పడేవాడు.
ఎప్పటిలాగే జెస్సి క్లాస్‌ తీసుకోవడానికి వచ్చింది. ఆరోజు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ మీద తను స్పీచ్‌ ఇస్తుంది. ఎనీ.. డౌట్స్‌ ప్లీజ్‌ అని అడిగింది జెస్సి. తనతో పరిచయం పెంచుకోడానికి ఇదే సమయం అని భావించిన దేవ్‌! 'ఎక్స్‌క్యూజ్‌మీ' అంటూ చేయి పైకెత్తుతూ నిలబడ్డాడు.
''ఎస్‌ ప్లీజ్‌' అంటూ అడగమని చెప్పింది జెస్సీ.
''సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ కోసం మీరు చెప్తున్న పాఠాలు చాలా బాగున్నాయి. కళ్ళు ఉన్న వాళ్ళు ఏమైనా చెప్తారు. కళ్ళు లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. అది స్వయంగా అనుభవిస్తున్న మాకు ఈ పాఠాల వలన ఉపయోగం ఏంటి? రోజుకి కొన్ని వేల మంది మన భారత దేశంలో చనిపోతున్నారు. అందులో కొందరి కళ్లైనా మాలాంటి వారికి అందించే ప్రయత్నం చేస్తే ఈ బ్లైండ్‌ స్కూల్‌లో ఈరోజు ఇంతమంది ఉండేవాళ్లం కాదు. సరైన అవగాహన, సాయం చేసే గుణం లేకపోవటం వల్లే ఎంతో మంది ఇంకా చూపులేని గుడ్డి వారిగా మిగిలిపోయారు. బాధ్యత రహితంగా ప్రవర్తించి బండి నడపడం వల్ల కొందరు కుటుంబాలను కోల్పోతే మరి కొందరు అవయవాలను కోల్పోతున్నారు. మాకు సెల్ఫ్‌ కాన్ఫడెన్స్‌ క్లాస్‌ చెప్పే బదులు జనాలలో అవేర్నెస్‌ ప్రోగ్రామ్స్‌ని చేయండి మేడం. కొందరి జీవితాలైనా నిలబడతాయి'' అని అన్నాడు.
దేవ్‌లో సామాజిక బాధ్యతని గుర్తించిన జెస్సీ ఇంప్రెస్‌ అయింది.
అలా అలా రోజూ ఏదో ఒకటి అడుగుతూ మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త దేవ్‌ మనసులో ప్రేమగా మారింది. జెస్సీకి కూడా దేవ్‌ మీద అభిమానం పెరిగింది. అలా కొన్నాళ్ళు గడిచాక ధైర్యం చేసి జెస్సీతో తన ప్రేమ సంగతి చెప్పాడు. కానీ అందుకు నిరాకరించింది జెస్సి.
''మీ తాతగారు లేకపోతే నీ పని నువ్వే చేసుకో లేవు. పెండ్లి చేసుకుని ఏం చేస్తావ్‌'' అని అవమానిం చినట్లు మాట్లాడి వెళ్ళి పోయింది.
ఆ మాటలు విన్న దేవ్‌! తట్టుకోలేక పోయాడు. తనకున్న లోపానికి దేవుడు మీద చెప్పలేనంత కోపం వచ్చింది దేవ్‌కి! ఊహ తెలిసే లోపే తల్లిదండ్రులు దూరం చేశావు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని పొందడానికి అడ్డుగా ఈ లోపం ఇచ్చావ్‌ అని దేవుని తిట్టుకున్నాడు. ఆ రోజు నుంచి దేవ్‌ ముభావంగా ఉండేవాడు. ఇన్నాళ్లు కళ్లు లేకపోయినా ఆ లోపం తనకెప్పుడూ తెలియనివ్వలేదు వాళ్ల తాతయ్య రాఘవరావు. మొదటిసారి తను ప్రేమించిన అమ్మాయి తన లోపాన్ని ఎత్తి చూపటంతో తట్టుకోలేకపోయాడు.
ఆ తర్వాత నుండి జెస్సీ క్లాసెస్‌ చెప్పటానికి రావటం మానేసింది.
ఒకరోజు రాఘవరావు సంతోషంగా ఇంటికి వచ్చాడు.
''దేవ్‌ నువ్వు చాలా అదృష్టవంతుడివి రా. ఇన్నేళ్లకు భగవంతుడు మనల్ని తిన్నగా చూశాడు''. అని సంబరపడి పోతున్నాడు.
''ఏంటి తాతయ్య అంత సంతోషం'' అని అడిగాడు దేవ్‌. మనం కళ్లు కోసం అప్లై చేసుకున్నాము కదా! అది అప్రూవ్‌ అయిందంట. నీకు ఎవరో కళ్లు దానం చేశారంట. వాళ్ళ కళ్ళు నీకు పెడతామని కాల్‌ చేసి చెప్పారు'' అని చెప్పాడు రాఘవరావు.
కానీ దేవ్‌ మొహంలో ఆనందం లేదు. 'ఇప్పుడు కళ్ళుండి నాకు ఏంటి లాభం తాతయ్య!' అని నిరాసగా మాట్లాడాడు దేవ్‌. ఆపరేషన్‌కి ఒప్పుకోలేదు.
కానీ రాఘవరావు నయానో భయానో ఒప్పించి ఆపరేషన్‌ తీసుకువెళ్ళాడు.అనుకున్న విధంగానే దేవ్‌ కి ఆపరేషన్‌ జరిగింది. దేవ్‌ కంటి చూపు వచ్చింది. వారం తర్వాత డాక్టర్‌ దేవ్‌కి ఒక లెటర్‌ ఇచ్చాడు.
ఆ లెటర్‌లో ఇలా రాసి ఉంది.
హారు దేవ్‌!
ఇప్పటికి నువ్వు ఈ లెటర్‌ నీ సొంత కళ్ళతో చదువుతూ ఉంటావని ఆశ పడుతు న్నాను. నేనెవరో అని ఆలోచిస్తున్నావా? ఆ రోజు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పిన ప్పుడు నీ ప్రేమను నిరాకరించడానికి కారణం నీపై ఇష్టం లేకపోవడం కాదు. నిన్ను అవమానించి మాట్లాడినందుకు నన్ను క్షమించు దేవ్‌.
కళ్ళు లేకపోవడం నిజంగా నరకమే కానీ అన్నీ అవయవాలు సరిగా పనిచేస్తున్నా జీవించ లేక పోవడం ఇంకా నరకం.
అవును నిజమే! నువ్వంటే నాకు చాలా అభిమానం. కానీ నీతో బతికే అదృష్టం నాకు భగవంతుడు రాయలేదు. నాకు క్యాన్సర్‌. ఇక ఎన్నాళ్లు బతుకుతానో చెప్పలేమని డాక్టర్‌ తేల్చి చెప్పేశాడు. ఉన్న నాలుగు రోజులైనా నాకు చేతనైన సాయం చేసి నలుగురితో సంతోషంగా గడపాలని అనుకున్నాను. అందుకే ఇలా బ్లైండ్‌ స్కూల్‌కి సెల్ఫ్‌ మోటివేషన్‌ క్లాసెస్‌ చెప్ప టానికి వచ్చాను. నీ పరిచయం జీవితం మీద ఆశను పెంచింది. కానీ నీతో జీవితాంతం ఉండే అదృష్టం నాకు లేదు. అందుకే ఆ రోజు నువ్వు నీ ప్రేమని చెప్పినప్పుడు అలా నిష్ఠూరంగా మాట్లాడాను. నీకు కళ్ళు మాత్రమే లేవు. కానీ నేను ఈ భూమి మీదే ఉండను. అనవసరంగా నీలో లేనిపోని ఆశలు రేపి దూరమైతే నువ్వు తట్టుకోలేవు అని అలా మాట్లాడాను. నేను చనిపోయిన నా కళ్ళు బతికే ఉంటాయి. నీ రూపంలో నలుగురికి సాయం చేస్తాయి. అందుకే నేను చనిపోతే నా కళ్ళను నీకు డొనేట్‌ చేయాలని నిశ్చయిం చుకున్నాను. నలుగురి మంచి కోసం ఆలోచించే నువ్వు ఏదైనా చేయగలను అనే నమ్మకంతో హాస్పిటల్‌ వారితో మాట్లాడి నేను చనిపోయిన అనంతరం కళ్ళు నీకు అమరేలా మాట్లాడి పెట్టాను. మనిషికే చావు ఉంటుంది కానీ కళ్ళకు చావు ఉండదు కదా! నేను లేకపోయినా నా కళ్ళతో నిన్ను ముందుకు నడిపిస్తాను. నీ ఆశ యాన్ని నువ్వు నెరవేరుస్తావని ఆశ తో జెస్సీ అని కింద సంతకం ఉంది. అది చదివిన తరవాత దేవ్‌ కళ్ళల్లో నుంచి కన్నీరు ధరాల ప్రవహించింది. జెస్సీ లేకపోయినా తన ప్రేమకు గుర్తుగా తన కళ్ళను చూసు కుంటూ... బాగా చదువుకున్నాడు. తాను అనుకున్న స్థాయి సంపాదించి జెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జెస్సీ 'ఐ పౌండేషన్‌' నిర్మించాడు.
'మరణం మనిషికే గాని అవయవాలకు కాదు!
మరణం లేని గమనం ఈ అవయవలాది
అవి మరొకరికి జీవితాన్ని ఇవ్వాలి' అనే జెస్సి కోరికను నెరవేర్చాడు.

- జ్యోతి మువ్వల, 9008083344

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆఅ
సమయం మించిపోలేదు
రెండు కాళ్ళ కుక్కలు
నడిసొచ్చిన తొవ్వ
''అడవికి మేల్కొలుపు కొక్కొరోకో''
గిది నల్ల పోచమ్మ అడ్డ
తెలివైన ఎలుక
యువ నాయ‌క‌త్వం
భలే ఎంపిక!
జ్ఞాపకం
ఏది ముఖ్యం..
కా... కీచకులు
కన్నీటి వెన్నెల
రేన్వన్ల చెట్టుకాడ !
రైతులకు సాయం
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు
సివంగి
పచ్చలహారం
చేపల కూర
నాన్నా పులి
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు
అందరూ మూర్ఖులే!
ఎప్పటిలాగే....
కోతి.. మేక...
పెళ్లి తంతు
వెరీ గుడ్డు
కాంతారా..
అసలైన మిత్రుడు..!
మాయ కుండ

తాజా వార్తలు

08:20 PM

ఓటర్ల నమోదు, సవరణల కోసం కొత్త పోర్టల్

08:14 PM

మామిడిపల్లి నూతన వీడీసీ సభ్యులకు సన్మానం..

08:13 PM

బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్..

08:10 PM

ఆటోను ఢీకొన్న డీసీఎం..ముగ్గురు మృతి

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.