Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాన్నా పులి | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Jan 15,2023

నాన్నా పులి

సత్యం శివం సుందరం ఒక తల్లి సంతానం కాదు. ఒకే కుటుంబంలో వేరు వేరు తల్లులకు పుట్టిన వారు కాదు. అన్నదమ్ముల పిల్లలూ కాదు. వాళ్ళ బ్లడ్‌గ్రూప్‌లు కూడా ఒకటి కాదు.
సత్యం శివం సుందరం వేరు వేరు కులాలకు కుటుంబాలకు చెందిన వారైనా వారి మధ్య ఉన్న అనుబంధం మాత్రం చాలా గట్టిది. అన్నదమ్ముల అనుబంధాన్ని మించినది.
సత్యం శివం సుందరం చిన్న నాటి స్నేహితులు. వాళ్ళ స్నేహం ప్రాథమిక పాఠశాలలో మొగ్గ తొడిగింది. అది లతలాగా స్కూల్‌ నుంచి కాలేజీ దాకా పాకింది. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణాలిచ్చేంత ప్రాణం.
ఏ బంధాలైనా అనుబంధాలైనా ఏదో ఒక రోజు బలహీన పడటం సర్వసాధారణం. అయితే వీళ్ళ బంధం గాలిపటపు దారంలా మూడు దిక్కులకూ విసిరేసింది. మూడు రకాల జీవితాల్ని నిర్దేశించింది.
కాలప్రవాహంలో ముగ్గురి జీవిత నావలూ గాలివాటంతో మూడు చోట్లకు కొట్టుకుపోయినా వాళ్ళ మధ్య అనుబంధం 'సెల్‌ఫోన్‌' బంధంతో కొనసాగింది. 'వాట్సప్‌' వాళ్ళ మధ్య సంబంధాన్ని నారు నీరు పోసి పోషించసాగింది.
సత్యం శివం సుందరంలు సెల్‌ఫక్షన్‌లలో గుడ్‌ మార్నింగ్‌తో రోజును కొలవడం మొదలుపెట్టే వారు. గుడ్‌నైట్‌ వరకూ పోస్టింగులు సెల్‌లలో వెలుగులు విరజిమ్మేవి. బర్త్‌డేలప్పుడూ పండుగలకూ చిచ్చుబుడ్లు కాంతులు విరజిమ్మేవి. గ్రీటింగ్సు పారిజాతాలు సువాసనలు వెదజల్లేవి.
సత్యం శివం సుందరాలు వేరువేరుగా వేరు వేరు చోట్లల్లో ఉన్నా వేరు వేరు రకాలుగా జీవితాన్ని అనుభవిస్తున్నా అందరం హాయిగా, సుఖంగా ఉన్నామనే అనుకునేవాళ్ళు. ప్రతి రోజూ పరస్పరం పోస్టింగులు చూసుకుంటే క్షేమంగా ఉన్నామనే భావించేవాళ్ళు.
నీలాకాశంలో నల్లమబ్బులు ఎప్పుడు ముసురుకుంటాయో ఎవరికి తెల్సు. నల్లమబ్బులు ఒకదానితో ఒకటి సంఘర్షించి ఉరుములూ మెరుపులతో చినుకులుగా రాలిపడ్డం అసాధారణమేమీ కాదు కదా!
ఒకనాడు శివం సుందరమ్‌ల సెల్‌ఫోన్‌లలో సత్యం కనపళ్ళేదు. బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు ఇద్దరూ. మర్నాడు ఆ మర్నాడు ఇంకొకనాడు కూడా సత్యం జాడలేదు. శివం సుందరం కంగారు పడ్డారు ఫోన్లు చేశారు. ఫోన్‌లోనూ సత్యం వినపళ్ళేదు.
సత్యం జాడ తెలీక శివం సుందరమ్‌ తల్లడిల్లిపోయారు. అంతా బానే వుందా లేక ఏమీ బాగులేదా అని ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకున్నారు. 'మూఢ'గా ఉన్నారు.
ఐదవ రోజున శివం ఫోన్‌లో సత్యం కనబడ్డాడు. అదే రోజున సుందరం ఫోన్‌లో మెరిశాడు. అది చూసి శివం సుందరం ఆనందంతో 'మూడు దెబ్బల' నృత్యం చెయ్యాలి కానీ క్యూరింగ్‌ సరిగ్గా చేయని సిమెంటు స్లాబ్‌లా కుప్పకూలిపోయేరు.
సత్యం పోస్టింగ్‌లో అక్షరాలు పొడిపొడిగా ఉన్నా తడితడిగా తగిలాయి వాళ్ళిద్దరికీ. 'నాకు జీవితమ్మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకోబోతున్నాను. సారీ ఫ్రెండ్స్‌ రేపటి సూర్యోదయాన్ని మీరిద్దరే చూస్తారు.'
శివం సుందరం అదిరిపోయారు. వాళ్ళ పల్సు రేటు జూబ్లీహిల్స్‌ ప్లాట్ల రేటుకు రెట్టింపయింది. వాళ్ళ హార్ట్‌బీట్‌ దేశంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగాన్ని మించిపోయింది. ఒకరు గాలిలో ఈదుతూ మరొకరు నేల మీద పాకుతూ సత్యం ఉన్న చోటికి వచ్చేశారు మర్నాటి సూర్యోదయానికి ముందే.
ఏ భయంకరమైన దృశ్యాన్ని చూడాల్సి వస్తుందోనని ఏ ఘోరానికి సాక్షులుగా నిలబడాల్సి వస్తుందోనని అనుకుంటూ.
కానీ ఎలెక్షన్‌ ఫలితాలు రాజకీయ నాయకుల అంచనాలు తలకిందులు చేసినట్లు, వాళ్ళ అంచనాలు బొక్కబోర్లా పడ్డయి. కాలుమీద కాలు వేసుకుని కుర్చీలో కూచుని టీవీ చూస్తూ కనబడ్డాడు సత్యం. శివం అది చూసి నిర్ఘాంతపోయాడు. సుందరం మూర్ఛను బలవంతంగా ఆపుకున్నాడు. ఏమయిందిరా నీకు అని యుగళంగా అరిచారు.
చాలా రోజులైందిరా మీ ఇద్దర్నీ చూసి అందుకే ఆ పోస్టింగ్‌. నేనూహించినట్టే పరుగులు పెట్టారు కదా. ఎంతైనా మన బంధం గట్టిదిరా అన్నాడు తాపీగా సత్యం.
అంతేనా ఇంట్లో నీ 'బెటర్‌ ఆఫ్‌' కనిపించడం లేదు. వస్తువులేమీ 'కాస్ట్‌లీ' గా అనిపించడం లేదు. ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పు అన్నారిద్దరూ.
సత్యం నవ్వాడు అయాం ఆల్‌రైట్‌ అన్నాడు. శివం సుందరం వెనక్కి వెళ్ళిపోతూ వీడికేవో సమస్యలున్నయి కానీ మనకు చెప్పడం లేదు అనుకుంటూ వెళ్ళిపోయారు. తమను రప్పించటానికి ఎంత పని చేశాడ్రా వీడు అని కూడా అనుకున్నారు.
మరో నెల గడిచింది. శివం క్యాలెండర్లో ఆ నెల కాగితం చించాడు. సుందరం శివంను అనుసరించాడు. మళ్ళీ నాలుగు రోజులు సత్యం ఫోన్‌లో కనబడ్లేదు. ఆ తర్వాత వినపడ్లేదు. శివం సుందరం విమానం రైలూ టిక్కెట్లు కొన్నారు. మొదటిసారి లాగానే రెండో సారీ సారీ చెప్పాడు సత్యం. వాళ్ళను చూడాలనిపించిందన్నాడు. సమస్యేదో చెప్పవు. ఆత్మహత్య చేసుకుంటానని హడలెత్తిస్తున్నావు అని కోప్పడ్డారు శివం సుందరం. మూడవసారీ ఇది రిపీటు అయింది. తమాషాగా వుందా. పనులన్నీ మానుకుని రావాలా చిన్న నాటి స్నేహం అనుబంధం అని వస్తున్నాం. నీ ప్రాక్టికల్‌ జోక్‌కి ఛస్తున్నాం అని విసుక్కున్నారు శివం సుందరర.
ఊరికే శివం సుందరంలను పిలవడం తన సమస్య చెప్పకపోవడం సత్యానికే నచ్చలేదు. తను నిజంగా ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఉంది. ఈ సారి వాళ్ళు వస్తే నిజం చెప్పి వాళ్ళ సాయంతో ప్రాణగండం తప్పించుకోవచ్చు అనుకున్నాడు సత్యం.
నాకు జీవితమ్మీద విరక్తి కలిగింది. ఇక నేను బతకను. గుడ్‌బై శివం గుడ్‌బై సుందరం అని సెల్లులో ఘొల్లుమన్నాడు సత్యం మరోసారి.
సత్యం అసత్యం పోస్టింగ్‌ నమ్మలేదు శివం. వీడి పోస్టింగ్‌ అబద్ధం అనవసరంగా కంగారు పడవద్దు అనుకున్నాడు సుందరం. శివం విమానం ఎక్కలేదు. సుందరం రైలు టిక్కెట్టు కొనలేదు.
ఈ సారి సత్యం మర్నాటి సూర్యుణ్ణి చూడలేదు.

-చింతపట్ల సుదర్శన్‌, 9299809212

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆఅ
సమయం మించిపోలేదు
రెండు కాళ్ళ కుక్కలు
నడిసొచ్చిన తొవ్వ
''అడవికి మేల్కొలుపు కొక్కొరోకో''
గిది నల్ల పోచమ్మ అడ్డ
తెలివైన ఎలుక
యువ నాయ‌క‌త్వం
భలే ఎంపిక!
జ్ఞాపకం
ఏది ముఖ్యం..
కా... కీచకులు
కన్నీటి వెన్నెల
రేన్వన్ల చెట్టుకాడ !
రైతులకు సాయం
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు
సివంగి
పచ్చలహారం
చేపల కూర
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు
అందరూ మూర్ఖులే!
ఎప్పటిలాగే....
మరణం లేని గమనం !
కోతి.. మేక...
పెళ్లి తంతు
వెరీ గుడ్డు
కాంతారా..
అసలైన మిత్రుడు..!
మాయ కుండ

తాజా వార్తలు

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.