Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రేన్వన్ల చెట్టుకాడ ! | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

రేన్వన్ల చెట్టుకాడ !

ఆ రోజు సెలవురోజు కావడంతో నవీన్‌, అన్వేష్‌ ఇద్దరూ పవను వాళ్ళింటికి పోయి పవన్ని తోల్కొని రేన్వన్ల చెట్టుకాడికి పోయిన్రు. నవీన్‌, అన్వేష్‌, పవన్‌ వీళ్ళు ఒకటే స్కూల్లో ఏడో క్లాసు చదివే పిల్లలు. జిగిరి దోస్తులు. ఆ రేన్వన్ల చెట్టు స్కూల్‌కి వొయ్యే తొవ్వలనే ఉంటది. ఆ రేన్వన్ల చెట్టుకి కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో పండ్లు అయితయి. ఆ చెట్టు కూడా చానా పెద్దగుంటది. అందుకే పిల్లలు సెలవు రోజుల్లో చానామంది చెట్టుకాడనే ఉంటరు. రేన్వన్ల చెట్టుకాడికి వోతూ వోతూ నవీన్‌ తొవ్వపొంటి పోయేటప్పుడే కొన్ని రాళ్ళు జేబుల యేసుకుంటా వోతున్నడు రేన్వన్లు కొట్టనికే వొస్తయని. రేన్వన్ల చెట్టుకాడికి పొంగనే రాళ్ళతో చెట్టుమీనున్న రేన్వన్లని నవీన్‌ కొడుతున్నడు.
నవీన్‌ గురిజూసి కొడుతుంటే అన్వేష్‌ ''అరే ఆడ లేవు రా ఇడ కుచ్చలు కుచ్చలు ఉన్నరు రేన్వన్లు సూడు'' అని ఇంకో పక్క చూపిస్తుండు.
పవను ''అరే బక్కోడా ఆ రాళ్ళు ఇటిరు నీకు కొట్టనికేనే వొస్తలే నేను కొడా'' అని నవీన్‌ చేతిల ఉన్న రాళ్ళు పవన్‌ గుంజుకున్నడు. ఒక రాయి చేతులకు తీస్కొని చానా సేపు గురి చూసి కొట్టిండు. కానీ అది కనీసం చెట్టు కొమ్మకి కూడా తాకకుండా పోయింది. అంతే నవీన్‌, అన్వేష్‌ ఇద్దరూ ఒకటేసారి గట్టిగా నవ్విన్రు.
నవీన్‌ ''ఏం రా దొబ్బోడా నీకసలే కొట్టనికే వొస్తలే కదా రా'' అని పవను చేతిలోని రాళ్ళని తీసుకొని గురిజూసి కొడుతున్నాడు.
నవీన్‌ కొట్టుడు ఆపంగనే అన్వేష్‌, పవన్‌ ఇద్దరూ కిందవడ్డ రేన్వన్లు ఏరుకుంటున్నారు. నవీన్‌ మాత్రం కచ్చి కాయలను పైన అంగి జేబుల యేసుకుంటున్నడు. రేన్వన్లు కచ్చిగా ఉంటే వాళ్ళమ్మకి మస్తు ఇష్టం. అందుకని ఎప్పుడు రేన్వన్లకి వొచ్చిన వాళ్ళమ్మకని ఇంకో కవర్ల కచ్ఛికాయాలు యేసుకొని అంగి జేబుల పెట్టుకుంటడు. ఆ ముగ్గురి ప్యాంటు జేబులు పైన అంగి జేబులు గూడ నింపుకున్నరు.
తొవ్వపొంటి పోయేటప్పుడు ''అరే నాకు దోరవండ్లు ఎక్వ దొరికినరు రా'' అని పవనంటే ''నాకన్నీ ఎర్రవండ్లే దొరికినరు రా'' అని అన్వేష్‌ అంటాడు. నవీన్‌ ''నాకు గూడ మంచివండ్లే దొరికినరు'' అని మాట్లాడుకుంటా చేతుల కొన్ని వండ్లు పట్టుకొని తినుకుంట ఇత్తులు తొవ్వపొంటి ఉముస్తూ పోతున్నరు.
నవీన్‌ వాళ్ళింటికి పొంగనే ''వోయమ్మ!, వోయమ్మ!'' అని వాళ్ళమ్మ దగ్గరకి వోయి ''నీకిష్టమని కచ్చి రేన్వన్లు దెచ్చిన్నే ఇగో'' అని అంగి జేబులో ఉన్న మొత్తం రేన్వన్లు ముంగల వోసిండు.
నవీన్‌కి వాళ్ళమ్మ రాజమణి అంటే చానా ఇష్టం. రాజమణి ''గిన్నిగనం దెచ్చినవ్‌ ఏమిరా'' అని అడుగుతే నవీన్‌ ''నీకిష్టం గదనే'' అని పల్లికిలిస్తాడు.
దానికి రాజమణి సంబురవడి రెండు చేతులను నవీన్‌ నెత్తి చుట్టూ తిప్పి తన నెత్తిక్కి ఒత్తుకుని విరిస్తూ ''నా బిడ్డ బంగారం'' అన్నది.
దానికి నవీన్‌ ఎగిరి దుంకిండు. దుంకి దుంకి ఆగి ''మరి నాకు వెరీ గుడ్డని ముద్దియ్యవాయే'' అనడుగుతాడు.
''ఇట్ల రా బిడ్డా'' అని రాజమణి నవీన్ను దగ్గరకి తీసుకొని ''నా బిడ్డ అందరికంటే వెరీ గుడ్డూ'' అంటూ చెంపమీన ముద్దు వెడ్తది.
నవీన్‌ చానా సంతోష వడ్తాడు. ''మిగతావండ్లు రేపు స్కూల్‌కి తీస్కపోయి తింటన'' అని నవీన్‌ తన రెండు ప్యాంటు జేబుల ఉన్న రేన్వన్లని బ్యాగుల పోసుకుంటాడు.
ఆ తర్వాత రోజు స్కూల్‌కి నవీన్‌, పవన్‌, అన్వేష్‌ ముగ్గురు కలిసి పోతుంటారు. తొవ్వల రహీం వీళ్ళ దోస్తు ఇంకొడు కలుస్తాడు.
రహీం ''ఏం రా నిన్న రేన్వన్ల చెట్టుకాడికి పోయినరంట నాకు చెప్పలేరు'' అని అన్నాడు. రహీంని తోల్కవొతే వాడే వీళ్ళకి దొరకకుండా అన్ని వండ్లు ఏరుకుంటడు అని కావాలనే తోల్కవోరు.
అన్వేష్‌ ''మేము మీ ఇంటికాడికి వోచ్చినం రా నువ్వే లేకుండే ఏడికో పోయినవంటా'' అని అబద్ధం చెప్పి కవరింగ్‌ చేయానికే ట్రై చేస్తాడు.
దానికి నవీన్‌, పవన్‌ కూడా ''అవు రా లేకుంటివి'' అని అంటారు.
రహీం ''అవునా నేనేడికి వోయినరా నిన్న'' అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో స్కూల్‌ వొస్తది. స్కూల్లో పొద్దున ఇంటర్వల్‌కి నవీన్‌ బ్యాగులకెళ్లి రేన్వన్లు తీసి వాళ్ళ దోస్తులకిచ్చుకుంట తను కొన్ని తింటూ ఉంటాడు. యెంకటి అనే ఇంకో దోస్తు వచ్చి ''అరే నాకియ్యుండిరా'' అంటాడు.
వెంటనే పవన్‌ ''నాకిస్తే ఎంగిలి అయితది రా'' అని నవ్వుతాడు. మిగతవాళ్ళు కూడా నవ్వుతారు. పవన్‌ ''అరే యెంకటి నీమీదొక పాటుంది తెల్సా రా'' అంటాడు.
యెంకటి ఉత్సాహంతో ''ఏంది రా అది''
అందరూ ఏందో అని వింటూ ఉంటారు.
''యెంకంటెంకటి.. కోమటెంకటి..
పాలు విండు రా! పాశమొండు రా!
నేంతింటా రా ! నిన్ను తంత రా !'' అని పాడి యెంకటిని తన్ని ఉరుకుతాడు. పక్కనున్న దోస్తులందరు నవ్వుతారు.
యెంకటి పవన్‌ ని కొట్టనీకే ''అరేరు దొబ్బోడా ఆగు రా'' అని యెంట వడ్తడు కానీ పవన్‌ దొరకడు. ఆ రోజు నుంచి అందరూ యెంకటిని అట్లనే సతాయిస్తారు. నీకోటి చెప్పాలని పిలిచి ఆ పాట వాడి తన్ని ఉరుకుతరు.
కొన్ని రోజుల తర్వాత స్కూల్లో రేపు మదర్స్‌ డే సెలెబ్రేషన్స్‌ చేస్తున్నాం. మీ అమ్మకి ఇష్టమైన గిఫ్ట్‌ ఇచ్చి ఏం గిఫ్ట్‌ ఇచ్చింరో మీ అమ్మ ఎట్లా ఫీల్‌ అయ్యిందో స్కూల్‌కి వొచ్చినంక నాకు చెప్పాలని ఒక సార్‌ చెప్తాడు. అందరూ పిల్లలు ''అట్లనే సార్‌'' అంటారు. నవీన్‌ మాయమ్మకి ఇష్టమైనవి కచ్చి రేన్వన్లు కదా అవి తీస్కపోయి మాయమ్మకి గిఫ్ట్‌ కింద ఇస్తా రేపు అనుకుంటా ఇంటికి పోతడు. నాతిరి పడుకునే ముందు ఎట్లయినా మాయమ్మ రేపు లెవ్వకముందే రేన్వన్లు దెచ్చి ముంగల వోసి హ్యాపీ మదర్స్‌ డే అని జెప్పాలని అనుకుంటడు.
పొద్దునే ఇంట్ల ఎవ్వరూ లెవ్వకముందే, ఎవ్వరికి చెప్పకుండా రేన్వన్ల చెట్టు కాడికి జేబుల కవరు పెట్టుకొని పోతడు. ఇంకా ఊర్ల గూడ ఎవ్వరూ లెవ్వరు. రేన్వన్ల చెట్టుకాడికి పోయిన నవీన్‌ మసక మసక చీకటిగా ఉంది అని ముందు కిందవడ్డ కొన్ని కచ్చికాయలు ఏరుకుంటాడు. రేన్వన్ల చెట్టుని కొడదాం అని రాయి తీస్తాడు కిందకెళ్ళి అంతే ఆ కవరు పండ్లు అడనే పడేసి ఇంటికి ఉరుకుతవోతడు. వాళ్ళమ్మ లేచేసరికి ఇంట్ల మూలకి కూసోని వణుకుతూ ఉంటడు.
రాజమణి నవీన్‌ని జూసి ఎందుకు అట్ల బయవడుతున్నడో అని దగ్గరకి వోయి ''ఏమయ్యింది బిడ్డా గట్లున్నవ్‌'' అని నవీన్‌ని కదిలిస్తుంది.
ఇంతవరకు షాక్‌లో ఉన్న నవీన్‌ మాములుగయ్యి వాళ్ళమ్మని పట్టుకొని ''అమ్మా ... అమ్మా..'' అని ఎక్కి ఎక్కి ఏడుస్తాడు. రాజమణికి ఇంకా భయం వేస్తుంది ఏం అర్థం కాదు ఎందుకు నవీన్‌ అట్ల ఏడుస్తున్నడో అని ''ఏం అయ్యింది బిడ్డ ఏడ్వకు ఏడ్వకు ఏం అన్నా పీడకల వొచ్చిందా'' అని వీపు నిమురుతుంది. రాజమణి నవీన్‌ కన్లు తుడిచి నీళ్ళు తాపి ''ఏం అయ్యింది బిడ్డా'' అని నిమ్మలంగా అడుగుతుంది.
నవీన్‌ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ''ఆడ... ఆడ....''
రాజమణి ''ఏడ రా''
''రేన్వన్ల చెట్టుకాడ.... రేన్వన్ల చెట్టుకాడ...''
''ఏం అయ్యింది రా రేన్వన్ల చెట్టుకాడ !''
''రమక్క, సురేషన్న యేలాడుతున్నరే'' అనగానే రాజమణికి చేతులు వణుకుతారు చెమటలు పట్టేస్తారు ''ఏం అంటున్నవ్‌ రా నిజమేనా''
''అవు అమ్మా గింతకుముందే జూసినా'' అని కచ్చితంగా చెప్తాడు.
''నువ్వెంటికి వోయినవ్‌ రా రేన్వన్ల చెట్టుకాడికి''
''రేన్వన్ల కోసమని వోయిన్నే. చెట్టు పైన సూస్తే అక్క వాళ్ళున్నరే యేలాడుకుంటా'' అని అనగానే
వెంటనే రాజమణి తన భర్త పురుషోత్తంని నిద్రలేపి ''చిన్నోడు ఇట్లంటున్నడు జూసి రాపో'' అని అంటుంది.
రమ నవీన్‌కి ట్యూషన్‌ చెప్పే అక్క. వీళ్ళ ఇంటికి రెండు ఇన్ల తరువాత వాళ్ళ ఇల్లు ఉంటది. రాజమణి భర్త ఇంకో ఇద్దరిని తీసుకొని రేన్వన్ల చెట్టుకాడికి పోతడు. అక్కడ వాళ్లిద్దరూ (రమ, సురేష్‌) ఉరేసుకుని కనవడ్తరు. వాళ్ళ శవాలని చెట్టు మీంచి దించి వాళ్లింట్లోలకు చెప్తారు. వాళ్ళింట్లోళ్ళు వచ్చి ఏడ్చి ఏడ్చి వారి శవాలకు తీస్కపోయి అంత్యక్రియలు జరుపుతారు.
ఈ సంఘటన నవీన్‌ని చాలా భయపెడుతోంది. నవీన్‌ రెండు నెలలు ఇంట్లకెళ్ళి బయటకు కూడా పోడు. ఎవ్వరితో సక్కగా మాట్లాడను కూడా మాట్లాడడు. వాళ్ళమ్మ దగ్గరనే ఉంటడు. వాళ్ళమ్మ ఒడిలోనే పంటడు. అన్వేష్‌, పవను వచ్చినా సక్కగా మాట్లాడడు. ఇంట్లకెళ్ళి ఆడుకొనికే కూడా బయటకి పోడు. డాక్టర్‌ కి చూపిస్తే తనకి లోపల ఉన్న భయం పోవాలి అట్ల అయితేనే మాములు అయితడు అని చెప్తాడు. ఆ రెండు నెలల తర్వాత మాములయ్యి మళ్ళీ స్కూల్‌కి పోతాడు. కానీ ఎవ్వరితో సక్కగా మాట్లాడాడు. అట్లనే తొవ్వల ఉండే రేన్వన్ల చెట్టుకాడికి పోంగనే ఏమి మాట్లాడకుండా సైలెంటుగా నెత్తి కిందకి దించుకొని పోతాడు.
ఒకరోజు నాతిరి రాజమణి నవీన్‌కి అన్నం తినిపించినక బయట మంచం యేసుకొని నవీన్‌ని పడుకోబెట్టుకొని జో కొడుతుంది. నవీన్‌ ''అమ్మా.. అమ్మా..'' అంటూ పిలుస్తాడు.
రాజమణి ''జెప్పు బిడ్డా'' అని నెత్తి నిమురుతూ అడుగుతుంది.
నవీన్‌ అడగాల్న వద్దా అన్నట్టు అడుగుతాడు.
''అవునే అమ్మా రమక్క వాళ్ళు ఎందుకట్లా సచ్చిపోయింరే?''
కొడుకుకి ఏమి చెప్పాల్నో అర్థం కాదు. నవీన్‌ మళ్ళీ ''రమక్క నాకు చాక్లెట్లు గూడ ఇస్తుండే గదనే. మంచక్క'' అని అనగానే జరిగింది చెప్తే బిడ్డకు భయం పోతదేమో అని ''వాళ్లిద్దరూ పేమించుకున్నరు బిడ్డా'' అని అంటది.
నవీన్‌ ''పేమంటే ఏందే?''
''పేమంటే ఒకరినొకరు ఇష్టవడుడు బిడ్డా''
''అయితే సావాల్న?''
''వాళ్ళు పెళ్ళి చేసుకుంటమంటే ఇంట్లొళ్ళు వొప్పుకోలే''
''ఎందుకే అట్లా ?''
''వాళ్ళది వేరే వేరే కులం బిడ్డా. అట్ల పెళ్ళి చేసుకునుడు తప్పంట''
''ఎవరు చెప్పింరే తప్పని?''
''ఏమో బిడ్డా''
''ఎవరు చెప్పింరో తెల్వకుండా తప్పని ఎట్లా తెలిసిందే''
''.....''
''అయితే అన్వేష్‌ గాడిది, పవన్‌ గాడిది గూడ వేరే వేరే కులమే గదనే మరి మేము కలిసి ఆడుకుంటే నువ్వు ఏం అనవు ?'' అని తల్లిని సూటిగా ప్రశ్నించాడు.
రాజమణికి ఏం చెప్పాలో అర్థం కాదు.
''......''
''రహీం గాడు మనిట్లకి గూడ వస్తడు గదనే''
నవీన్‌ ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది.
''నువ్వు గూడ పక్కింటి ఆంటీతోని మాట్లాడుతావ్‌ కదా''
''.........''
''మొన్న రహీం వాళ్ళు బిర్యానీ ఇస్తే మనం తిన్నాం కదా''
''......''
''నాయినా గూడ వేరే కులపోల్లతోని తిరుగుతడు గదనే''
రాజమణి ఏదో ఒకటి చెప్పాలి అని ''కలిసి ఉంటే ఏమి కాదు బిడ్డా'' అని అంటది.
నవీన్‌ ''అట్లయితే కలిసి ఆడుకుంటే ఒకరింట్లకు ఒకరొస్తే ఒకరికొకరు సాయం జేసుకుంటే ఏం కాదా అమ్మా?''
''.......''
''ఒకరినొకరు ఇష్టపడితేనే తప్పా?''
''.....''
''పెళ్ళి చేసుకుంటేనే తప్పా ?''
అంత చిన్న పోరనికి ఎంత పెద్ద ప్రశ్నలు తలెత్తినరు. ఎవ్వరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురైనరు.
ఈసారి ఏమైనా చెప్దాం అన్నా రాజమణి దగ్గర గూడ సమాధానం లేదు మౌనమే సమాధానం అయ్యింది.
''......''
నవీన్‌ ''చెప్పే చెప్పే'' అని అడుగుతూ నిద్రలోకి జారుకుంటాడు. ఆ పోరనికి సమాధానం వాళ్ళమ్మ దగ్గరనే కాదు ఎవ్వరి దగ్గర ఉండకపోవచ్చు!.

- సాయి కిరణ్‌ నేత
  9533146760

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆఅ
సమయం మించిపోలేదు
రెండు కాళ్ళ కుక్కలు
నడిసొచ్చిన తొవ్వ
''అడవికి మేల్కొలుపు కొక్కొరోకో''
గిది నల్ల పోచమ్మ అడ్డ
తెలివైన ఎలుక
యువ నాయ‌క‌త్వం
భలే ఎంపిక!
జ్ఞాపకం
ఏది ముఖ్యం..
కా... కీచకులు
కన్నీటి వెన్నెల
రైతులకు సాయం
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు
సివంగి
పచ్చలహారం
చేపల కూర
నాన్నా పులి
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు
అందరూ మూర్ఖులే!
ఎప్పటిలాగే....
మరణం లేని గమనం !
కోతి.. మేక...
పెళ్లి తంతు
వెరీ గుడ్డు
కాంతారా..
అసలైన మిత్రుడు..!
మాయ కుండ

తాజా వార్తలు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.