Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజా పోరాటాల యోధుడు సుందరయ్య | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 20,2022

ప్రజా పోరాటాల యోధుడు సుందరయ్య

- తన నిజాయితీతో రాజకీయాలకు వన్నె తెచ్చిన మహానేత
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
                 ప్రజా పోరాటాల యోధుడు, తన నిజాయితీతో రాజకీయాలకు వన్నె తెచ్చిన మహానేతపుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. గురువారం స్ధానిక మంచికంటి భవన్‌లో దక్షిణ భారత ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 37 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు యంఎన్‌.రెడ్డి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లడుతూ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సుందరయ్య జీవితమంతా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి, మార్క్సిస్టు సిద్ధాంత పరిరక్షణకు పాటుపడ్డారని, చిన్న వయసులోనే సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్న ఆయన బాల్యంలోనే కారాగార శిక్ష అనుభవించారన్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేశారని తెలిపారు. దేశంలోనే తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఆంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో రహస్యంగా పర్యటిస్తూ నాయకులను, కార్యకర్తలను ఎంతోమందిని తయారుచేసి తీర్చిదిద్దారు. తన వాటాకి వచ్చిన యావదాస్తిని పార్టీకి ఉద్యమానికి ధారబోసి అత్యంత నిరాడంబరంగా, నియమబద్ధంగా, నిర్మాణాత్మకంగా జీవించారు. ప్రజలతో నిత్యం మమేకం కావడం, పోరాటాలు నడిపించడం, సిద్ధాంత అధ్యయనం, సమాజ పరిశీలన, ఉద్యమ నిర్మాణం ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన తిరుగులేని యోధుడు అన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. భూమిలేని నిరుపేదలకు ఆ పోరాటం రూ.10లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టారని తెలిపారు. 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పర్చారన్నారు. కమ్యూనిస్టు పార్టీ తొలి కేంద్ర కమిటీలో సభ్యుడైన సుందరయ్య ఆఖరి వరకు సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్నాడన్నారు. రెండేండ్ల పాటు రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారన్నారు. దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసం పోరాటమే సుందరయ్యకి ఇచ్చె ఘనమైన నివాళీ అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్‌, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి కూరపాటి సమ్మయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, సందకూరు లక్ష్మి, నందిపాటి రమేష్‌, యం.డిజలాల్‌, వై.వెంకటేశ్వరరావు, నవీన్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.
మహోన్నత వ్యక్తి సుందరయ్య : మచ్చా, ఏజే.రమేష్‌
భద్రాచలం : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్య్ర సమర యోధులు, తెలంగాణ సాయుధ పోరాట రథసారధి అమ రజీవి కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య నేటి తరానికి ఆదర్శం అని, సుందరయ్య స్ఫూర్తితో ప్రజా బాహుళ్య పార్టీ నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏ.జె.రమేష్‌లు పిలుపు నిచ్చారు. పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య 37వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహౌన్నత వ్యక్తి కామ్రేడ్‌ సుందరయ్య అని, ఆయన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పనిచేసేవారని అన్నారు. నిరంతర అధ్యయనశీలి, కార్యోన్మోకుడు కామ్రేడ్‌ సుందరయ్య అని అన్నారు. కామ్రేడ్‌ సుందరయ్య కూలి దోపిడీకి వ్యతిరేకంగా తమ కుటుంబం నుండే వ్యవసాయ కార్మిక పోరాటం ప్రారంభించారని వారు అన్నారు. దేశంలో వ్యవసాయ కార్మికుల కోసం 1932లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని సుందరయ్య స్థాపించారని అని అన్నారు. బాంచన్‌ మీ కాళ్లు మొక్కుతా దొరా... అనే వారితో దొర ఏందిరో..వాని పీకుడేందిరో.. అంటూ బందూకులను చేత పట్టించిన విప్లవ ధీరుడు కామ్రేడ్‌ సుందరయ్య అని అన్నారు. సరళీ కరణ ఆర్థిక విధానాలు వేగం పుంజుకున్న నేటి తరుణంలో కార్పొరేటీకరణ, మతోన్మాదం దాడి పేద ప్రజలపై తీవ్రంగా పడుతోందని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడి తీవ్రతరం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి.నరసారెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం స్వామి, ఎం.రేణుక, సున్నం గంగా, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్‌ బాబు, పి.సంతోష్‌ కుమార్‌, ఎన్‌.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, బి.కుసుమ, యు.జ్యోతి, యన్‌.నాగరాజు, మాజీ ఎంపీటీసీ చేగొండి శ్రీనివాస్‌, జి.లక్ష్మీకాంత్‌, కోరాడ శ్రీనివాస్‌, భూపేంద్ర, సిహెచ్‌ మాధవ్‌, ఏ.రత్నం తదితరులు పాల్గొన్నారు.
చర్ల : ఆదర్శప్రాయుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వతంత్ర సమరయోధుడు, నవయుగ గాంధీగా కీర్తించబడ్డ పుచ్చలపల్లి సుందరయ్య ఉభయ ఆంధ్ర ప్రదేశ్‌ కమ్యూనిస్టు నాయకుడని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కె.బ్రహ్మచారి అన్నారు. గురువారం సిబిఎస్‌ రామయ్య భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ఘనంగా నిర్వహించారు. తొలుత మన కమిటీ సభ్యులు మచ్చ రామారావు అధ్యక్షతన సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుబ్బంపేట సర్పంచ్‌ సుజాత, 13వ వార్డు సభ్యులు దొడ్డి హరి నాగ వర్మ, మండల కమిటీ సభ్యులు వినోద్‌, పొడుపు గంటి సమ్మక్క, శ్యామల వెంకటేశ్వర్లు, బందెల చంటి, వరలక్ష్మి, సిరోని, లక్ష్మీ, సునీత, కమల, కుర్నపల్లి మాజీ ఎంపీటీసీ రామారావు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యతో పాటు... పాఠశాలల స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి
సీఎం వాగ్దానాలు అమలు చేయాలి
నియోజక వర్గ సమస్యలపై పాలకమండలి సమావేశంలో ప్రకటించాలి
చిన్నారులను బాల కార్మికులుగా వాడుకుంటే కఠిన శిక్షలు
గుట్టు చప్పుడుగా అమ్మకానికి దుక్కిటెద్దు?
పందుల బెడదను నివారించాలి
కనీవినీ ఎరుగని అభివృద్ధి తెలంగాణలోనే...!
సర్పంచూ... మాకు పట్టాలు ఇప్పించు
పారిశుధ్యం నిర్వాహణ ప్రశ్నార్ధకం
పోలాస్‌ జ్యూస్‌ పాయింట్‌ పై చర్యలు తీసుకోవాలి
తండాల్లో సీత్లా సందడి
అక్రమ నిర్మాణాలు చేపట్టిన చెరువును పరిశీలించిన ఐబీడీఈ
బడుల ముఖచిత్రం... మార్చిన కేసీఆర్‌
చికాగో నగరంలో చిందిన నెత్తుటి జాడలో...
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఆక్రమించుకున్న గ్రామస్తులు
కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి

తాజా వార్తలు

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.