Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అప్రకటిత విద్యుత్‌ కోత | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

అప్రకటిత విద్యుత్‌ కోత

- అవస్థల పడుతున్న అన్నదాతలు
- రాత్రి సమయంలో విద్యుత్‌ మోటార్ల వద్ద రైతన్న పడి కాపులు
నవతెలంగాణ - బోనకల్‌
            అప్రకటిత విద్యుత్‌ కోత వలన అన్నదాతలు పడరాని అవస్థలు పడుతున్నారు. వ్యవసాయానికి ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రాత్రి సమయంలో సైతం అన్నదాతలు విద్యుత్‌ మోటార్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మండల వ్యాప్తంగా యాసంగిలో మొక్కజొన్న 14,500 ఎకరాలలో వరి 350 ఎకరాలలో వేరుశనగ 46 ఎకరాలలో మినుము 30 ఎకరాలలో శనగ 10 ఎకరాలలో పెసర 25 ఎకరాలలో అన్నదాతలు వివిధ రకాల పంటలను సాగు చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 14,961 ఎకరాలలో అన్నదాతలు పంటలను సాగు చేశారు. సాగర్‌ కాలవల ఆధారంగా, 24 గంటల విద్యుత్‌ సరఫరా ఆధారంగా యాసంగిలో అన్నదాతలు ఈ పంటలను సాగు చేశారు. కానీ బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌కు వారబంది అమలు చేస్తున్నారు. ఈ వారబందీ కూడా నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించిన విధంగా కాకుండా ఇష్టానుసారంగా వారబంధిని అమలు చేస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్నదాతలు సాగర్‌ నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మండల వ్యాప్తంగా 2,600 విద్యుత్‌ వ్యవసాయ మోటార్లు ఉన్నాయి. ఈ విద్యుత్‌ వ్యవసాయ మోటార్ల కింద ప్రధానంగా గోవిందాపురం ఎల్‌, లక్ష్మీపురం, తూటికుంట్ల, పెద్ద బీరవల్లి, రాపల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట, మోటమర్రి, చిన్న బీరవల్లి, గోవిందాపురం ఏ, ఆళ్ళపాడు, పెద్ద బీరవల్లి తదితర గ్రామాలలో అధిక శాతం వ్యవసాయ విద్యుత్‌ మోటార్ల కిందనే అన్నదాతలు పంటలు సాగు చేస్తున్నారు. కానీ బోనకల్‌ మండలంలో వ్యవసాయ విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎందుకు పోతుందో ఎందుకు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉందని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌కు వారబందీని సక్రమంగా అమల చేయకపోవడం, మరొకవైపు అప్రకటిత విద్యుత్తు కోత వలన అన్నదాతలు పంటలను కాపాడుకునేందుకు పడరా అని పాట్లు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఎకరానికి మొక్కజొన్నకు ఇప్పటికే అన్నదాతలు 25 వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. కానీ సాగునీటి సమస్యతో పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి సమయాలలో ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక అన్నదాతలు తీవ్ర ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక అన్నదాతల రాత్రి సమయంలో విద్యుత్తు మోటార్ల వద్దే పడి కాపులు కాస్తున్నారు. విద్యుత్తు రాగానే మోటార్లు వేసుకుంటూ రాత్రి సమయంలోనే పంటల కోసం కష్టాలు పడుతున్నారు. కనీసం ఇచ్చే విద్యుత్‌ ను ఏ సమయంలో ఇస్తారో కూడా విద్యుత్‌ శాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్పడం లేదని దీనివల్ల కూడా తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు తీవ్ర ఆగ్రహం, అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సమయాలలో విద్యుత్తు కోసం విద్యుత్‌ అధికారులకు ఫోన్‌ చేస్తే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తమకే తెలియటం లేదని సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం అన్నదాతల జపం చేస్తూనే మరోవైపు ఆ అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నదాతలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్‌ శాఖ అధికారులు వ్యవసాయానికి ఏ సమయంలో విద్యుత్తు సరఫరా చేస్తారో స్పష్టంగా చెప్పాలని అన్నదాతలు కోరుతున్నారు.
రాత్రి సమయంలో మోటారు వద్దే ఉంటున్న : కారంగుల కోటేశ్వరరావు, రైతు, గోవిందాపురం ఎల్‌
            కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రాత్రి సమయంలో తాను మోటారు వద్దే పడి కాపులు కాస్తున్నాను. ఒక్కొక్కసారి రాత్రి సమయంలో కూడా విద్యుత్తు రావటం లేదు. దీంతో ఎప్పుడు వస్తుందో తెలియక విద్యుత్‌ మోటార్‌ వద్ద నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్న. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఎవరికి చెప్పిన ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇప్పటికైనా అధికారులు విద్యుత్‌ ఏ సమయంలో ఇస్తారో స్పష్టంగా రైతులకు తెలపాలని కోరారు. ఇదే పరిస్థితి కొంతకాలం కొనసాగితే సాగు చేసిన పంటలు మొత్తం ఎండిపోక తప్పదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ఏవీఎస్‌కు నివాళి
కుట్ర పూరితంగానే రాహుల్‌పై వేటు
జానంపేట పంచాయతీలో ఆత్మీయ సమ్మేళనం
అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కుక్క కాటు బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి
ఏప్రిల్‌ 5న ఛలో ఢిల్లీ
హమాలీల సంక్షేమాన్ని.. గాలికొదిలిన పాలకులు
నరసయ్యకు నెల్లూరులో ఘన సత్కారం
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత మృతి
ఘనంగా మాజీ ఎంపీ ధర్మ బిక్షం వర్ధంతి
హ్యాట్రిక్‌ కొట్టాలి
14 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో...ప్రచార యాత్ర ప్రారంభం
జర్నలిస్టులకు ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం
రక్తదానం మరొకరికి ప్రాణదానం : ఎమ్మెల్యే సండ్ర
సామియో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావడం గర్వకారణం
మతోన్మాద బిజెపిని చిత్తుగా ఓడించాలి
ఎర్రజెండా ఎగరేద్దాం..
వడ్డెర్ల సంక్షేమానికి కృషి చేస్తా : మెచ్చా
ప్రపంచ క్షయ దినోత్సవ ర్యాలీ
ఇల్లందు ఏరియాలో పర్యటించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు
ప్రయివేట్‌ రెస్ట్‌ హౌస్‌లపైన అధికారుల జులూమ్‌
గాలి దుమారంతో నష్టపోయిన మామిడి తోటలు పరిశీలన
వేసవిలో మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలి
ఉత్తమ సేవలకు...జాతీయస్థాయి అవార్డులు
ప్రతాపనేని లక్ష్మయ్యకు తమ్మినేని నివాళి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
ఎకరానికి రూ.10 వేలు...కౌలు రైతులకు పరిహారం
శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు
రేణుక చౌదరి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

తాజా వార్తలు

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.