Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేరుకే 'మనబడి'..! | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

పేరుకే 'మనబడి'..!

- ఉమ్మడి జిల్లాలో నత్తనడకన నిర్మాణాలు
- వసతుల కల్పన కూడా నామమాత్రం
- ఖమ్మంలో 426కు పూర్తయినవి 62
- భద్రాద్రిలో 328కి 50 స్కూల్స్‌ పూర్తి
- నిధుల లేమితో ఎస్‌ఎంసీల వెనుకడుగు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో పాఠశాల విద్యలో మరింత ప్రగతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'మన ఊరు- మన బడి/ మన బస్తి- మనబడి' కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా అధిక విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను మొదటి దశ కింద ఎంపిక చేసింది. 2021-22 సంవత్సరానికి ఎంపికైన స్కూల్స్‌లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ప్రణాళిక రూపొందించింది. మొత్తం 12 ప్రాధాన్యత అంశాలను గుర్తించింది. ఖమ్మం జిల్లాలోని 426 పాఠశాలలను మొదటి విడత ఎంపిక చేసింది. వీటికి రూ.135 కోట్లు కేటాయించింది. దీనిలో విద్యాశాఖ ద్వారా రూ.60 కోట్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రూ.33 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.42 కోట్ల ఖర్చుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పూనుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 పాఠశాలలను మొదటి విడత ఎంపిక చేశారు. వీటికి రూ.60 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 50 పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో 66 స్కూల్స్‌ అంటే కేవలం 14% పాఠశాలల్లోనే వందశాతం పనులు పూర్తవడం గమనార్హం. వాస్తవానికి గత జూన్‌లో స్కూల్స్‌ ప్రారంభించే నాటికే పనులు పూర్తికావాల్సి ఉన్నా...నేటికీ వందశాతం పూర్తవలేదు. ఇప్పటికే రెండో దశ పనులు ప్రారంభించాలి కానీ తొలి దశ పనులే పెండింగ్‌లో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
అ 12 ప్రాధాన్యత అంశాలు...
'మన ఊరు- మనబడి/ మన బస్తి- మనబడి' కార్యక్రమంలో 12 ప్రాధాన్యత అంశాలను తీసుకున్నారు. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నిచర్‌, పెయింటింగ్‌, పెద్ద తరహా చిన్నతరహా మరమ్మతులు, ఆకుపచ్చ రాతబోర్డులు, ప్రహరీగోడ, వంటగది, ఉన్నత తరగతులకు భోజనశాల, శిథిల భవనాల స్థానంలో నూతన గదులు, డిజిటల్‌ సౌకర్యాల వంటివి ప్రాధాన్యత అంశాలుగా గుర్తించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1215 పాఠశాలలకు గాను 426 స్కూల్స్‌ను తొలి దశలో పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో 423 స్కూల్స్‌లో పనులు ప్రారంభమైనవి, 359 పాఠశాలల్లో పనులు కొనసాగుతుండగా కేవలం 62 మాత్రమే పూర్తయినవి. మొదటి దశ పనుల కోసం రూ.61.84 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ.13.73 కోట్లు మాత్రమే విడుదలవడం గమనార్హం.
అ భద్రాద్రి కొత్తగూడెంలో...
భద్రాద్రి కొత్తగూడెంలోనూ మన ఊరు- మనబడి కార్యక్రమం నత్తనడకనే కొనసాగుతోంది. ఇక్కడ తొలి దశలో 368 పాఠశాలలను ఎంపిక చేయగా దీని కోసం రూ.60 కోట్లు కేటాయించారు. వీటిలో పనులు పూర్తయిన 25 పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వందశాతం పనులు పూర్తయిన మరో 25 స్కూల్స్‌ను ఈనెల 5న ప్రారంభించచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 80శాతం పనులు పూర్తయినవి వంద, 60 శాతం పూర్తయినవి 200 వరకు ఉన్నాయి. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాల లన్నింటిలోనూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద టాయిలెట్స్‌ నిర్మాణం చేపట్టారు. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
అ నిధుల లేమితో ఎస్‌ఎంసీల వెనుకడుగు...
మన ఊరు- మన బడి పనులు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ మాత్రమే చేయాలనే నిబంధన ఉంది. ఇది సమంజసమే అయినప్పటికీ చాలా స్కూల్స్‌లో చైర్మన్లు, సభ్యులు నిరుపేదలకు కావడంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎదురుపెట్టుబడి పెట్టే స్తోమత వారి వద్ద లేదు. ఎస్‌ఎంసీలకు అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చి వారిచేత పనులు చేయిస్తే సకాలంలో పూర్తయ్యేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన ఊరు- మనబడి పనులకు సంబంధించి పంచాయతీలు సైతం తీర్మానం చేశాయి. పనుల నిర్వహణ బాధ్యతలను అప్పగించాయి. కానీ గతంలో పంచాయతీల్లో చేసిన బిల్లులే రాకపోవడంతో నూతనంగా అప్పగించిన పనులు నిర్వహించేందుకు కాంట్రాక్లర్లు సైతం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఈ పనులు నిర్వహిం చాల్సి రావడంతో ఏటేటా ఈ పథకానికి నిధులు తగ్గడం, సకాలంలో రాకపోవడంతో పనులు చేపట్టడం లేదు.
అ పైలెట్‌ ప్రాజెక్టుల పేరుతో హడావుడి...
పనులు నత్తనడకన సాగుతున్నాయనే అపవాదు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టులను చేపట్టింది. మండలానికి 15 పాఠశాలలను ఎంపిక చేసినా అన్నింటిలో పనులు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో పైలెట్‌ ప్రాజెక్టు కింద రెండు, మూడు స్కూల్స్‌ను ఎంపిక చేసి పనులు నిర్వహిస్తున్నారంటేనే పథకం ఎంత నత్తనడకన సాగుతుందో అర్థం చేసుకోవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ఏవీఎస్‌కు నివాళి
కుట్ర పూరితంగానే రాహుల్‌పై వేటు
జానంపేట పంచాయతీలో ఆత్మీయ సమ్మేళనం
అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కుక్క కాటు బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి
ఏప్రిల్‌ 5న ఛలో ఢిల్లీ
హమాలీల సంక్షేమాన్ని.. గాలికొదిలిన పాలకులు
నరసయ్యకు నెల్లూరులో ఘన సత్కారం
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత మృతి
ఘనంగా మాజీ ఎంపీ ధర్మ బిక్షం వర్ధంతి
హ్యాట్రిక్‌ కొట్టాలి
14 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో...ప్రచార యాత్ర ప్రారంభం
జర్నలిస్టులకు ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం
రక్తదానం మరొకరికి ప్రాణదానం : ఎమ్మెల్యే సండ్ర
సామియో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావడం గర్వకారణం
మతోన్మాద బిజెపిని చిత్తుగా ఓడించాలి
ఎర్రజెండా ఎగరేద్దాం..
వడ్డెర్ల సంక్షేమానికి కృషి చేస్తా : మెచ్చా
ప్రపంచ క్షయ దినోత్సవ ర్యాలీ
ఇల్లందు ఏరియాలో పర్యటించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు
ప్రయివేట్‌ రెస్ట్‌ హౌస్‌లపైన అధికారుల జులూమ్‌
గాలి దుమారంతో నష్టపోయిన మామిడి తోటలు పరిశీలన
వేసవిలో మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలి
ఉత్తమ సేవలకు...జాతీయస్థాయి అవార్డులు
ప్రతాపనేని లక్ష్మయ్యకు తమ్మినేని నివాళి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
ఎకరానికి రూ.10 వేలు...కౌలు రైతులకు పరిహారం
శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు
రేణుక చౌదరి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

తాజా వార్తలు

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

09:14 AM

సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య మరో వందేభారత్‌ రైలు..

09:02 AM

రెండు క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..

08:55 AM

సజ్జలను విచారించాలి : నక్కా ఆనందబాబు

08:33 AM

నేడు సుప్రీం కోర్టులో వివేకా కేసు పిటిషన్‌పై విచారణ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.