Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మంది విద్యార్థుల ఎంపిక
నవతెలంగాణ- ఖానాపురం హవేలీ
స్థానిక ఎస్‌బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు బిఎన్ ఇన్ఫోటెక్ హైదరాబాద్ వారు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో పది మంది విద్యార్థులు ఎంపికైనట్టు ఎస్‌బీఐటీ కళాశాల ప్రెసిడెంట్ గుండాల కృష్ణ పేర్కొన్నారు. ఈ ప్రాంగణ నియామకాల కి 101 మంది విద్యార్థులు హాజరుకాగా పది మంది విద్యార్థులు ఎంపికయ్యారని రాత పరీక్ష ,సాంకేతిక రౌండ్ ,ఇంటర్వ్యూ పద్ధతుల్లో ఎంపిక నిర్వహించారన్నారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ 2.2 లక్షలు ఉంటుందని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ సాంబశివరావు పేర్కొన్నారు. విద్యార్థులను ప్రెసిడెంట్ గుండాల కృష్ణ, డైరెక్టర్ సాంబశివరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజకుమార్, వైస్ ప్రిన్సిపల్ గంధం శ్రీనివాస్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు అభినందించారు.