Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెళ్తివి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 10,2022

బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెళ్తివి

కోవిడ్‌, డెల్టాలు పోయి ఒమిక్రాన్‌గా రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తూ పోతున్నాది. మన దగ్గర మూడవ దశ ప్రారంభమైనట్టే అని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య వేంగా పెరుగుతున్నది. ఈ ఒమిక్రాన్‌కు స్పీడు ఎక్కువ. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని కట్టడి చేయకుండా, వాళ్ళ వల్ల రాష్ట్రంలో ఎంతో మందికి ఒమిక్రాన్‌ సోకుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. ఇప్పటి వరకు జనం ఎక్కువగా గుమ్మిగూడే జనజాతర్లు బాగా జరిగాయి. వాటి ఫలితంగా కూడా వైరస్‌ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నది. అడ్డుకోవల్సిన సమయంలో నిర్లక్ష్యంగా ఒదిలేసి, వైరస్‌ తీవ్రమయ్యాక చేతులెత్తేస్తే సంభవించే మరణాలకు ఎవరిది బాధ్యత? ఇంత వరకు రెండు డోసుల వ్యాక్సిన్లు వెయ్యటం పూర్తి కాలేదు. వ్యాక్సిన్లకు కావల్సిన డోసులు ఇంకా తయారు కాలేదు. ఆక్సిజన్‌ సిలెండర్లు, పిపిఈ కిట్లు, మాస్క్‌లు, ఆసుపత్రి బెడ్లు వంటివి రెడీ పెట్టుకోకుండా వైరస్‌ను కట్టడి చేయడం చాలా కష్టం. పదహారేండ్లు దాటిన వారికి ఈ మధ్యనే వాక్సిన్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది ఎప్పటికి పూర్తవుతుందో? రెండేండ్లు దాటిన పిల్లలకు ఇంకా వ్యాక్సిన్లు మొదలుపెట్టలేదు. ఈలోపు సంక్రాంతి సెలవులు ప్రకటించి పిల్లలకు కొంత వరకు మేలు చేశారు. ఈ వైరస్‌ భయం పోయే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే క్షేమంగా ఉండండి.
పాలపీకలతో...
   పాల పీకలు, పింక్‌, గ్రీన్‌, ఎల్లో వంటి ఆకర్షణీయమైన రంగులలో ఉంటాయి. ఈ ప్లాస్టిక్‌ పాలపీకలను సేకరించి పెట్టుకున్నాను. వీటితో ఎన్నో రకాల బొమ్మలు తయారు చేస్తున్నాను. అలాగే ఈరోజు మేకను తయారు చేశాను. పిల్లలను ఆకర్షించేందుకే పాలపీకలు నిండు రంగులలో ఉంటాయి. చక్కని పాలపీకలను మేకగా మలిచాను. మేక కూడా పాలిచ్చే జంతువు. మేక పాలను కూడా మనుషులు తాగడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం పాలపీకలతో మేక తయారైంది. శరీర భాగమంతా ఎండు కాయలతో నింపాను. చింత గింజలతో కండ్లు, నోరు పెట్టాను. ప్లాస్టిక్‌ వలన పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్లాస్టిక్‌ స్వతహాగా విషపూరితం కాదు కానీ ప్లాస్టిక్‌ సంచులకు తళతళలాడే రంగును కల్పించడానికి వాడే రంగులు, పారిశ్రామిక ఎజోడైలలో కొన్ని క్యాన్సర్‌ను కలగజేసే హానికర పదార్థాలు ఉన్నాయి. ప్లాస్టిక్‌ సంచులలో ఆహార పదార్థాలు కట్టి ఎక్కువసేపు నిలవ ఉంచినపుడు అవి హానికరంగా మారతాయి. పిగ్మెంట్లలో ఉండే కాడ్మియం వంటి ధాతువులు కూడా ఆహారంలో చేరి హానికరంగా మారుస్తాయి. ప్లాస్టిక్‌ పదార్థాలు డ్రైనేజీ కాలువలకు అడ్డుపడి నీరు సరిగా ప్రవహించక వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. భూగర్భజల యాక్విఫర్లు నింపకుండా ప్లాస్టిక్‌లు అడ్డుకుంటాయి. అందుకే ప్లాస్టిక్‌ను పార వేయకుండా బొమ్మల్ని చేసుకొని కాలుష్యాన్ని తగ్గిద్దాం.
కిస్‌మిస్‌లతో...
   'అందని ద్రాక్ష పుల్లన' అని చెప్పే ద్రాక్షగుత్తుల్ని ఎండబెట్టితే వచ్చే ఎండు ద్రాక్షలే కిస్‌మిస్‌లు. ఈ ఎండు ద్రాక్షలను స్వీట్ల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. పండుగల సమయంలో చేసుకునే పాయసం, పరమాన్నం, చక్కెర పొంగలిలో జీడిపప్పు, కిస్‌మిస్‌లు లేనిదే స్వీటు తయారుకాదు. నేను తినుబండారాలతోనూ బొమ్మలు చేస్తున్నాను. వీటికి నేను 'ఫుడ్‌ ఆర్ట్‌' అని పేరు పెట్టాను. ఈరోజు తీపితీపి కిస్‌మిస్‌లతో మేకను తయారు చేశాను. బాల్యంలో ప్రతి ఒక్కరూ బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెళ్తివి అని ఆడుగుతూ సమాధానం చెప్పే పాటను పాడి ఉన్నాము. పాటలో బుజ్జిమేక రాణిగారి పూల తోట చూడటానికి పోయాను అంటుంది. మేక అంటేనే ఆకులు మేసేది అని అంటారు. పూలతోట చూశాక ఊరుకుంటుందా ఆ తోటనంతా మేసి వచ్చింది మేక. మరి అక్కడి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కొట్టడానికి వస్తే పారిపోయి వచ్చానని గడుగ్గాయిగా సమాధానం చెబుతుది. ఈ కిస్‌మిస్‌లతో తయారైన మేక పొట్టనిండా గడ్డితో నింపాను. మేక ఆకులు, గరిక పోచలు తింటుంది కదాని దాని పొట్టలో గరిక పోచల్ని పెట్టాను. మరి మేక ఎలా ఉన్నది. మేకల్ని పెంచుకుని తద్వారా జీవితాన్ని గడిపే వారు ఎంతోమంది ఉంటారు. మేకల పాలు వాడటానికి, మేక మాంసం తినడానికి వీటిని ఎక్కువగా పెంచుతారు. పశువుల పాలతో పాటు మేకపాలు కూడా ఆరోగ్యానికి బలవర్ధకమైనది. 100 గ్రా. మేకపాలలో 3.8శాతం కొవ్వు, 4.1శాతం లాక్టోజ్‌ ఉంటాయి. మొత్తం 70 కాలరీల శక్తిని కలిగి ఉంటుంది.
చింతగింజలతో...
   చింత గింజలతో మేక తలకాయను తయారు చేశాను. చక్కగా తయారయింది. మేక తలకాయ లోపల బియ్యంతో నింపాను. బియ్యానికి నిండు బులుగు రంగు వేసి పక్కన పెట్టుకున్నాను. నాలుగైదు రంగులు బియ్యానికి వేసి ఉంచాను. ఒక్కోడబ్బాలో ఒక్కో రంగు గల బియ్యం పోసి బొమ్మల తయారీ కోసం దాచాను. సరే ఇప్పుడు బులుగు, నలుపు రంగుల మేళవింపుతో మేక తయారయింది. మేకలు కూడా ఆవుల్లాగా నెమరు వేయు జంతువుల జాతికి చెందినవి. ఇవి కూడా 'బోవిడే' కుటుంబానికి, 'కాప్రినే' ఉపకుటుంబానికి చిందిన జంతువులు. మేకల శాస్త్రీయ నామం ''కాప్రా ఈ గాగ్రస్‌''. మేకల్ని మానవుడు అతి పురాతన కాలం నుండి పెంచుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వేల సంవత్సరాల నుండి మేకల్ని ఊలు, పాలు, తోలు, మాంసం కోసం పెంచుకుంటున్నారు. మేకలలో సుమారుగా 300 రకాల సంకర జాతులు ఉన్నాయి. గొర్రరరెలు, జింకలు, మేకలు అన్నీ ఒకే జాతికి చెందిన జంతువులు.
ఆకులతో...
   మేక అంటే ఆకుల్ని తినే జంతువు. ఈరోజు మేకను ఆకులతోనే తయారుచేస్తున్నాం. వింతగా ఉంది కదూ! మా ఇంటి ప్రహరీ గేటును ఆనుకుని మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన చెట్లు చాలా పెద్దగా పెరిగాయి. ఆ చెట్ల పేరేమిటో తెలియదని చెప్పాను కదా! వాటి ఆకులు దాదాపు గుండ్రంగా అంటే కోలగా, గుండ్రుంగా ఆకారాలకు మధ్యగా ఉంటాయి. ఈ ఆకులు మందంగా బిళ్ళల్లా అమరి ఉంటాయి. అందుకే నా బొమ్మల్లో వాడుతున్నాను. ఈ ఆకుల్తో మేకను తయారు చేశాను. ఇంకా వెలితిగా అనిపించింది. అందుకే పట్టుకుచ్చుల పూలచెట్టు ఆకుల్ని కోసుకొచ్చి మేక శరీరమంతా నింపాను. పట్టు కుచ్చుల చెట్ల ఆకులు ఎరుపురంగులో ఉంటాయి. ఇప్పుడు ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలబోతతో మేక తయారయింది. మన భారత దేశంలో మేకలను సుమారు 9000 బిసిఇ కాలం నుండి పెంపుడు జంతువులుగా వాడుకుంటున్నట్టగా తెలుస్తున్నది.
పల్లీ తొక్కలతో...
  పల్లీ కాయలు కాసిన కాలంలో కాయలు తిన్నాక తొక్కల్ని ఎండబెట్టి భద్రపరుచుకున్నాను. వాటితో అప్పుడప్పుడు ఇలా బొమ్మల్ని చేసుకుంటున్నాను. ఈ రోజు పల్లీ తొక్కలతో మేకను సృష్టించాను. దీని శరీరం మధ్యలో ఎండిపోయిన శంకు కాయల్ని నింపాను. 'శంకువనం'గా తయారైన మా పూల పొదల్లో నుంచి కాయల్ని కోసి ఎండబెట్టి భద్రపరిస్తే బొమ్మలకు పనికి వస్తున్నాయి. ఈ మేకల్ని 'నియోలిథిక్‌'' కాలం నుంచి వ్యవసాయదారులు పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మేకల మందలు కొండ చరియల్లో మేత కోసం సంచరిస్తాయి. మామూలు పాడిగేదెల కన్నా మేకల్ని పెంచడం సులభం. మేక పేగుల నుండి ''కేట్‌గట్‌'' అనే శస్త్ర చికిత్సలకు పనికొచ్చే దారాన్ని తయారు చేస్తారు. మేక కొమ్ముల నుండి కూడా ఎన్నో వస్తువులు చేస్తారు. 'అంగోరా' అనే మేకలు ఊలును ఇస్తాయి.
- డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాడిపోయిన బల్బుల్ని వెలిగిద్దాం
ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కాలులేకపోయినా పరుగుతీసింది
ఆత్మన్యూనతకు గురౌతున్నారా..?
రోజూ కొన్ని నిమిషాలు
ఇట్ల చేద్దాం
పర్దాలో ఉంటే బాక్సింగ్‌ ఎలా ఆడగలను..?
సోలార్‌ సోదరీమణులు
ఇట్ల చేద్దాం
బరువు తగ్గించే ఆహారం
వీటిని కూడా శుభ్రం చేయండి
కొత్త రుచుల్లో ఇడ్లీ...
సువాసనలు వెదజల్లేలా...
ఇట్ల చేద్దాం
విజయవంతంగా...
ఆకర్షణీయంగా కనబడేట్టు
ఇట్ల చేద్దాం
అమ్మ జీవితమే అక్రోబాట్‌
నిజమైన స్నేహితులు ఎవరు?
కాంతి కోల్పోతుందా..?
కొన్ని పొరపాట్ల వల్ల...
అమ్మలు ఉద్యోగం చేస్తేనే మంచిది
పాత బట్టలతో కొత్తగా
అడ్వర్టయిజ్‌మెంట్‌ పేపర్లతో
పది నిమిషాలు చేస్తే...
శనగలతో...
కలలు కనేందుకు పెండ్లి అడ్డుకాదు
అల్పాహారం మిస్‌ చేస్తున్నారా..?
వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనూ...
మేము ప్రతి చోటా ఉండాలి

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.