Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంక్రాంతి స్పెషల్స్‌ | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 13,2022

సంక్రాంతి స్పెషల్స్‌

సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరి ఇండ్లల్లో సందడిగా ఉంటుంది. తెలుగు లోగిళ్ళు రంగురంగుల ముగ్గులతో మురిసిపోతుంటాయి. పిండివంటలతో ఘుమఘుమలాడతాయి. కొత్త పంట ఇంటికి రావడమే దీనికి కారణం. ఇక అందరి ఇళ్లల్లో పిండి వంటలు గుమగుమలాడి పోతాయి. సంక్రాంతి వంటకాల్లో కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయి. వీటితో ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి వంటకాల్లో కొన్నింటిని ఈ రోజు నేర్చుకుందాం...
వరిపిండి చెక్కలు
కావలసిన పదార్ధాలు: బియ్యంపిండి - ఒక గ్లాసు, ఉప్పు - 1 / 2 చెంచా, శెనగ పప్పు - రెండు చెంచాలు, నువ్వులు - చెంచా, జీలకర్ర - చెంచా, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - 8 లేదా 10 రెమ్మలు, అల్లం - అంగుళం ముక్క, బటర్‌ - రెండు చెంచాలు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేయు విధానం: పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర కచ్చగా దంచుకోవాలి. నీళ్లు సుమారు అర గ్లాసు తీసుకుని దళసరి గిన్నెలో వేడిచేసి అందులో బటర్‌ (లేదా) నూనె, ఉప్పు వేసి మరిగే నీటిలో శెనగసపప్పు, నువ్వులు వేసి దంచి ఉంచుకున్న పచ్చి మసాలా కారం వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి వరిపిండి కొద్దిగా వేస్తు నీళ్ళలో ఉండలు లేకుండా కలుపుకుని మూతపెట్టి ప్రక్కన ఉంచుకోవాలి. స్టవ్‌ మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఈ వరిపిండి ముద్దను నూనె చేతితో బాగా కలుపుకుని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్‌ కవరు మీద పలుచని పూరీల్లా వత్తుకుని నూనెలో వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చేలా కరకర లాడేలా వేయించుకుని టీష్యూ పేపరు పైకి తీసుకోవాలి. ఈ చెక్కలను పూరీ మిషన్‌తో కూడా వత్తుకోవచ్చు. రెండు వారాలపైగా నిలువ వుండే ఈ చెక్కలు చాలా రుచిగా ఉంటాయి.
అరిసెలు
కావలసిన పదార్థాలు: బియ్యం: ఒక కేజీ, బెల్లం తరుము: అర కేజీ, నువ్వులు - 100 గ్రాములు, నీరు: తగినంత, యాలకులు: 2 - 4 (మెత్తగా పొడిచేసుకోవాలి)
నెయ్యి - అర కప్పు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేయు విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడవేసి పిండి పట్టించుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టౌ మీద పెద్ద మందపాటి గిన్నె పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి వేసి కలపాలి. ఇలా పిండి పాకం తయారు చేసుకొన్న తర్వాత స్టౌపై ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి కాగనివ్వాలి. ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. బంగారు రంగు రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు. ఇవి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి.
సకినాలు
   కావాల్సిన పదార్ధాలు: నూనె - తగినంత, నువ్వులు - టీ స్పూను, వాము - టీస్పూను, కారం - అరటీస్పూను, ఉప్పు - తగినంత, బియ్యం పిండి - కప్పు.
తయారు చేయు విధానం: బియ్యం రెండు గంటలు నీటిలో నానబెట్టి నీళ్ళు వంచి మెత్తని పిండిలా మిక్సి పట్టాలి. బియ్యప్పిండిలో కారం, ఉప్పు, వాము, నువ్వులు వేసి కలిపి నీళ్ళు పోసి జిగురుగా కలపాలి. దీనిని చేతితో ఒక క్లాత్‌ మీద సకినాలుగా గుండ్రంగా వెయ్యాలి. వీటిని కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్‌ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తర్వాత ఆరిన సకినాలు వేసి రెండు పక్కలా దోరగా వేయించి తీసుకోవాలి.
నువ్వుల లడ్డు
కావాల్సిన పదార్ధాలు: టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, పావుకిలో బెల్లం, పావుకిలో నువ్వులు.
   తయారు చేయు విధానం: నువ్వులు శుభ్రం చేసి దోరగా వేయించుకోవాలి. బెల్లం చిన్నముక్కలుగా చెయ్యాలి. నువ్వులు రోట్లో వేసి దంచి మెత్తగా అయ్యిన తర్వాత బెల్లం వేసి దంచితే గట్టిగా ముద్దలా అవ్వుతుంది. దీనిలో నెయ్యి కలిపి ఉండలు చుట్టుకోవాలి. అంతే నువ్వుల లడ్డూ రెడీ...
   (నువ్వులు కమ్మని వాసనతో చాలా రుచిగా ఉంటాయి. నువ్వులలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది భలవర్ధకమైన ఆహారం ప్రతిరోజు ఒక లడ్డు పిల్లలకు ఇస్తే వారిలో ఎముకలు బలపడుతాయి.)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిజమైన స్నేహితులు ఎవరు?
కాంతి కోల్పోతుందా..?
కొన్ని పొరపాట్ల వల్ల...
అమ్మలు ఉద్యోగం చేస్తేనే మంచిది
పాత బట్టలతో కొత్తగా
అడ్వర్టయిజ్‌మెంట్‌ పేపర్లతో
పది నిమిషాలు చేస్తే...
శనగలతో...
కలలు కనేందుకు పెండ్లి అడ్డుకాదు
అల్పాహారం మిస్‌ చేస్తున్నారా..?
వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనూ...
మేము ప్రతి చోటా ఉండాలి
రోజూ అరగంట నడవండి
నైటింగేల్‌ వారసులుగా ఉండాలి
అనాథలకు తల్లి ప్రేమను పంచుతూ...
దళిత మహిళా హక్కుల స్వరాలు
రోజూ ఖర్జూరం తినండి
ఈ పొరపాట్లు చేయొద్దు
ఇట్ల చేద్దాం
వ్యర్థాలతో అలంకరించుకుందాం
చిన్న విరామం పెద్ద ప్రయోజనం
అమ్మ ప్రేమికులకు నా విజ్ఞప్తి
అమ్మా... నీకు సరిలేరెవ్వరు
సాహస యాత్రికురాలు
అమ్మ ఆరోగ్యం జాగ్రత్త
ఇట్ల చేద్దాం
సామాజిక మార్పుకై ఓ ఆర్‌జే
శుభ్రపరచడం సులభం
మండు వేసవిలో మంచుమిఠాయిలు
అనుబంధం పెంచుకోవడం ఎలా..?

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.