Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాత బట్టలతో కొత్తగా | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 16,2022

పాత బట్టలతో కొత్తగా

- వేస్ట్‌ టు బెస్ట్‌
             ప్రతి ఇంట్లో పాత బట్టలు ఎన్నో ఉంటాయి. గతంలో పెద్ద పిల్లలకు కుట్టించిన బట్టలు పొట్టివైతే తర్వాత పిల్లలకు తొడిగే వాళ్ళు. ఇంట్లో నలుగురైదుగురు ఉండేవాళ్ళు కాబట్టి అలా జరిగేది. ఇప్పుడు అలా ఉండటం లేదు. పాత బట్టలు వేసుకునే వాళ్ళు లేరు. అందుకని ప్రతి ఇంట్లో వాడేసిన లేదా బిగుతైన బట్టలు చాలా కొత్తగా ఉండగానే పక్కన పెట్టేస్తున్నారు. కాస్త ఆలోచిస్తే అలాంటి వాటిని మనం కొత్తగా వాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...
పాత నైటీలతో బిగ్‌ షాపర్‌
             మనం ఇప్పుడు పాత నైటీతో బిగ్‌ షాపర్‌ కుట్టేదాం. చాలా మందికి బజారు కెళ్ళేటపుడు బిగ్‌ షాపర్లు బాగా ఉపయోగపడతాయి. అలాంటి బిగ్‌ షాపర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో బియ్యం సంచులు ఉంటాయి కదా! ఈ బియ్యం సంచిని కత్తిరించుకొని ఉంచాలి. బిగ్‌ షాపర్‌ సైజులో కత్తిరించాలి. ఇలా రెండు ముక్కలు కత్తిరించుకోవాలి. అలాగే అదే సైజులో నైటీని రెండు ముక్కలుగా కత్తిరించాలి. అంటే లోపలి వైపుకు బియ్యం సంచి వస్తుంది. పై వైపుకు నైటీ క్లాత్‌ వస్తుంది. బయటి నుంచి చూసే వారికి చక్కటి డిజైనుతో అందంగా కనిపిస్తుంది. లోపలి వైపు కూడా కావాలంటే క్లాత్‌ వేసుకోవచ్చు.
             ముందుగా ఒక క్లాత్‌ ముక్క ఒక బియ్యం సంచి ముక్క కలిపి కుట్టుకోవాలి. వీటిని మూడు వైపులా కుట్టేయాలి. నాలుగో వైపున కర్రలు పెట్టటానికి వీలుగా మడిచి కుట్టాలి. ఆ సైజులో కర్రలను తీసుకొని ఆ రంధ్రంలో నుంచి దూర్చాలి. ఈ సంచి అడుగు భాగం కుట్టేటప్పుడు ఒక బెత్తెడంత క్లాత్‌ను అతికించాలి. అంటే ఎక్కువ సామాన్లు పట్టటానికి అన్నమాట. ఇలా తయారైన సంచి కూరగాయలు, సరుకులు వంటివి తెచ్చుకోవడానికి బాగుంటుంది.
డోర్‌ మాట్స్‌
             కాటన్‌ చీరలు, కాటన్‌ లెగ్గిన్స్‌, పెట్టి కోట్స్‌, నైటీలు వంటి వాటితో 'డోర్‌ మాట్‌' తయారు చేయవచ్చు. మొదటగా మనం ఎంచుకున్న వస్త్రాన్ని తీసుకొని సన్నని పీలికలుగా కత్తిరించుకోవాలి. ఈ పీలికలను ఒక దాని కొకటి అతుక్కునేలా చేయాలి. దానికోసం మూడు పీలికలను తీసుకొని జడలాగా మూడు పాయలతో అల్లుకోవాలి. ఈ మూడు పీలికలు మూడు రంగులతో తీసుకుంటే అల్లిక బాగుంటుంది. మొత్తం పీలికలన్నీ అల్లుకుంటూ వెళ్ళాలి. మొత్తం పెద్ద తాడులాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని గుండ్రంగా చుడుతూ సూదితో కుట్టుకోవాలి. మనం చుట్టుకున్నవి ఊడిపోకుండా కుట్లు టాకా వేసుకుంటూ రావాలి. ఇది ఇలా చుట్టుకుంటూ మనకు ఎంత సైజు కావాలో అంత సైజు వచ్చేదాకా చుట్టాలి. గుండ్రంగా కానీ, దీర్ఘ చతురస్త్రంలో కానీ మనకు ఇష్టం వచ్చిన ఆకారంలో డోర్‌ మాట్‌ను తయారు చేసుకోవచ్చు.
పాత చీరలతో కటన్స్‌
             కొన్ని చీరలు బాగా గట్టిగా ఉంటాయి. కానీ కట్టుకోబుద్ది కాదు చాలా మందికి. అలా అని మూలన కూడా పెట్టబుద్ది కాదు. దాని డిజైన్‌ కూడా బాగుంటే గనుక వీటిని కర్టెన్లుగా తయారు చేసుకోవచ్చు. తలుపు సైజు చూసుకుని కత్తిరించుకోవాలి. పైన, కింద పట్టీల లాగా కుట్టాలి. పైన కుట్టిన పట్టీలో నుంచి కర్టెన్‌ రాడ్‌ను దూర్చవచ్చు. లేదంటే ఆ పట్టీకి పైన నిలువుగా పట్టీలు కుట్టుకోవచ్చు. ఈ నిలువు పట్టీలలో నుంచి కర్టెన్‌ రాడ్‌ను దూర్చి కర్టెన్‌ను వేసుకోవచ్చు. నేను సాదా టమోటో రంగులో ఉన్న చీరను తీసుకొని కర్టెన్‌గా కుట్టిన తర్వాత దానికి పెయింటింగ్‌ వేశాను. కర్టెన్‌ కింది భాగంలో చక్రాలను పెయింట్‌ చేస్తే చాలా అందంగా వచ్చింది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఈ కర్టెన్‌ డిజైన్‌ బాగుంది, ఎక్కడ కొన్నారు..? అని అడిగే వాళ్ళు. ఇలాంటి యూనిక్‌ డిజైన్లతో కర్టెన్లు తయారు చేయవచ్చు.
వాల్‌ హాంగింగ్‌
             ఇప్పుడు పిల్లలకు ఎక్కువ జేబుల పాంట్లు వస్తున్నాయి కదా! పాతబడిన జీన్స్‌ పాంట్ల జేబుల్ని కత్తిరించి పెట్టుకోవాలి. మూడు జేబులను కత్తిరించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా పొడుగ్గా ఉండే కాలు భాగాన్ని కత్తిరించి రెండు పొరలతో కలిపి కుట్టేయాలి. ఈ జీన్సు బట్టకు పైనుంచి కింది వరకు మూడు జేబులను కుట్టాలి. అంటే వాల్‌ హాంగింగ్‌లా పని చేస్తుంది. జేబులపై ఏదైనా అద్దాలు కానీ పూసలు కానీ కుట్టవచ్చు. లేదా ఏదైనా బొమ్మను పెయింట్‌ చేయవచ్చు. అప్పుడు జేబులు స్పెషల్‌గా కనిపిస్తాయి. ఈ వాల్‌ హాంగింగ్‌ పైభాగాన తగిలించుకునేందుకు వీలుగా ఒక కొక్కెం లాగా కుట్టాలి. దీని చుట్టూతా లేసులు కుట్టుకుంటే బాగుంటుంది. ఇది హాల్లో ఎక్కడైనా తగిలించుకుంటే వాటిలో తాళాలు, ఫోన్లు, పెన్నులు వంటివి పెట్టుకోవచ్చు.
హ్యాండ్‌ పర్స్‌
             ఏ కలర్‌ చీరకు ఆ కలర్‌ హ్యాండ్‌ పర్స్‌ను మనమే తయారు చేసుకోవచ్చు. జాకెట్లను ఇంట్లోనే కుట్టుకునే వాళ్ళ మిగిలిన ముక్కలతో కుట్టుకోవచ్చు. జాకెట్లో మిగిలిన ముక్కల్ని దాచిపెట్టి మ్యాచింగ్‌ పర్సును తయారు చేసుకోవచ్చు. లేదా చీరలో చిన్న ముక్కను కట్‌ చేసి దానిని పర్స్‌గా కుట్టుకోవచ్చు. చీరకు మ్యాచింగ్‌ జాకెట్టులా పర్సులా అన్నమాట. దీర్ఘచతురస్రాకారంగా ముక్కల్ని కత్తిరించి పెట్టుకోవాలి. పైభాగాన జిప్‌ కుట్టుకొని పర్సు మీద పూసలు, తళుకులు కుట్టుకోవచ్చు. లేదంటే పర్సు వెనక భాగం ఎక్కువ కత్తిరించుకొని కవర్‌లా వచ్చేలా కుట్టుకోవాలి. అంటే పోస్ట్‌ కవర్‌లా అన్నమాట. చివర్లో బటన్‌ను కుట్టుకుంటే బాగుంటుంది. ఇలా పడేసే బట్టలతో ఎన్నో తయారు చేసుకోవచ్చు.

- డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె గౌరవంగా బతికేలా
మనమూ కాలర్‌ ఎగరేద్దాం
అదుపులో పెట్టుకోవాలంటే..?
వర్షాలకు బట్టలు జాగ్రత్త
గాజులతో కొత్త కాంతులు
వీటిని దృష్టిలో పెట్టుకోండి
ఇట్ల చేద్దాం
సేవకే ఆమె అంకితం
ఆర్థోడాంటిస్ట్‌గా సంతృప్తి లేకనే
మెదడు పనితీరుకు పోషకాలు
తమదైన ముద్రవేస్తున్నారు
జొన్నలతో భలే రుచులు
వాటి గురించీ ఆలోచించండి
సారీ చెప్తున్నారా..?
ఇట్ల చేద్దాం
ప్రజాస్వామ్యం చెరసాలలో వుంది
లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు

తాజా వార్తలు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.