Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్త రుచుల్లో ఇడ్లీ... | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 19,2022

కొత్త రుచుల్లో ఇడ్లీ...

          అల్పాహారానికి ఇడ్లీని మించినది లేదు. అయితే చాలా మంది దానికోసం ముందురోజే పప్పు నానబెట్టడం, రుబ్బడం వంటి పనులన్నీ గుర్తుకొచ్చి బద్ధకిస్తారు. ఆ శ్రమంతా లేకుండానే ఇన్‌స్టెంట్‌ మిక్స్‌లు కొనకుండానే అప్పటికప్పుడు ఇంట్లోనే తేలిగ్గా ఇడ్లీ చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం.
రవ్వ ఇడ్లీ
కావల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ - రెండున్నర కప్పులు, మజ్జిగ - నాలుగు కప్పులు, నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, మినపప్పు - టీ స్పూను, సెనగపప్పు - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి) కరివేపాకు - రెండు రెబ్బలు, ఫ్రూట సాల్ట్‌ - టేబుల్‌ స్పూను.
తయారు చేసే విధానం: ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి. చిన్న పాన్‌లో మిగిలిన నూనె పోసి కాగాక మినపప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే క్యారెట్‌ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్‌ సాల్ట్‌ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండి మిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.
రైస్‌ ఇడ్లీ
కావల్సిన పదార్థాలు: బియ్యపురవ్వ - ఒకటిన్నర కప్పులు, పలుచని అటుకులు - కప్పు, పుల్లని పెరుగు లేదా మజ్జిగ - కప్పు, బేకింగ్‌ సోడా - చిటికెడు, మంచినీళ్లు - తగినన్ని, ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేసే విధానం: అటుకుల్ని పెరుగులో వేసి నాలుగు నిమిషాలు నానబెట్టి గరిటెతో మెత్తగా చేయాలి. అందులోనే బియ్యపురవ్వ వేసి కొద్దిగా సోడా, ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచాలి. అటుకులు, బియ్యపు రవ్వ, నీటి శాతాన్ని పీల్చేసుకోవడంతో గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కలిపి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. దించేముందు ఇడ్లీలు ఉడికాయో లేదా ఓసారి వేలితో నొక్కి చూస్తే తెలిసిపోతుంది. మృదువుగా స్పాంజిలా ఉండే ఈ ఇన్‌స్టంట్‌ ఇడ్లీ రుచిగా కూడా ఉంటుంది.
ఓట్స్‌ ఇడ్లీ
కావల్సిన పదార్థాలు: ఓట్స్‌ - రెండు కప్పులు, పుల్లని పెరుగు - రెండు కప్పులు, ఆవాలు - టీస్పూను, మినపప్పు - టేబుల్‌ స్పూను, సెనగపప్పు - అరటేబుల్‌ స్పూను, నూనె - అరటీ స్పూను, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి), క్యారెట్‌ తురుము - రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తురుము - టేబుల్‌ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, ఫ్రూట్‌ సాల్ట్‌ - చిటికెడు.
తయారు చేసే విధానం: బాణలిలో ఓట్స్‌ వేసి కాస్త రంగు మారేవరకు వేయించి తీయాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. చిన్న పాన్‌లో పోసి కాగాక ఆవాలు, మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము, పుసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్‌ పొడిలో కలపాలి. అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. తర్వాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి.
స్టఫ్‌డ్‌ ఇడ్లీ
కావల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ - రెండు కప్పులు, పుల్లని పెరుగు - కప్పు, ఉప్పు - అరటీ స్పూను, వంటసోడా - అరటీస్పూను. ఆలూ - రెండు, బఠాణీలు - కప్పు, ఉప్పు - అర టీస్పూను, పసుపు - చిటికెడు, దనియాల పొడి - అర టీస్పూను, నూనె - రెండు టీ స్పూన్లు, ఎండుమిర్చి - రెండు, ఆవాలు - టీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు.
తయారు చేసే విధానం: పెరుగులో బొంబాయి రవ్వ, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చిక్కని మిశ్రమంలా కలిపి మూతపెట్టి గంటసేపు నాననివ్వాలి. ఆలూ ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోసి మెత్తగా చిదమాలి. బఠాణీలను కూడా ఉడికించి మెత్తగా మెదపాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత మెదిపిన బఠాణీలూ చిదిమిన ఆలూ, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, దనియాల పొడి వేసి కాగాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత మెదిపిన బఠాణీలూ చిదిమిన ఆలూ, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, దనియాల పొడి వేసి ఓ నిమిషం వేయించాలి. తర్వాత వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఇడ్లీ ప్లేటులకు నెయ్యిరాసి ముందుగా కాస్త రవ్వ మిశ్రమాన్ని వేయాలి. దానిపైన ఆలూ మిశ్రమాని వేయాలి. ఇప్పుడు దీనిమీద మళ్లీ రవ్వ మిశ్రమాన్ని వేసి మూతపెట్టి విజిల్‌ వచ్చాక ఆఫ్‌ చేయాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీల్ని తీయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు
కరివేపాకు కలిపి...
ఇట్ల చేద్దాం
క్యారెట్‌ తినండి
క్లీనింగ్‌ ఎలా చేస్తున్నారు..?
ఆదమరిచి నిద్రపోవాలంటే..?
సమాజాన్ని సవాలుగా తీసుకుంది
ఇట్ల చేద్దాం
మీ ఇష్టాలను దూరం చేసుకోవద్దు
సంగీతానికి ముగ్ధులవుతారు
ఒత్తిడి తగ్గించుకోవాలంటే..?
బెండతో ప్రయోజనాలు
పాత న్యూస్‌ పేపర్లతో కొత్తగా
డెలివరీ తర్వాత...
ప్రతిభావంతులుగా
'నాన్న' సరిలేరు నీకెవ్వరూ
అభిరుచులే ఆదాయ వనరుగా...

తాజా వార్తలు

03:22 PM

మద్యం తాగి వాహనం నడపకుండా ప్రతేక పరికరం..!

03:06 PM

విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ఇద్దరు మృతి

03:05 PM

అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణిల ఇంటర్ రిజల్ట్స్..

02:56 PM

ఇంటర్నెట్‌ లేకున్నా జీమెయిల్ వాడొచ్చు..

02:50 PM

పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు: మోహన్ బాబు

02:42 PM

జపాన్ నుంచి యూఏఈ బయల్దేరిన మోడీ

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.