Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సోలార్‌ సోదరీమణులు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 20,2022

సోలార్‌ సోదరీమణులు

             చదివింది ఎనిమిదో తరగతి మాత్రమే. అత్యంత చిన్న వయసులోనే వివాహం జరిగింది. అయితే రాజస్థాన్‌లో పునరుత్పాదక ఇంధన విప్లవాన్ని ప్రారంభించింది. దుర్గా ఎనర్జీకి సీఈఓగా పని చేస్తుంది. సౌరశక్తిని ఉపయోగించి మహిళలకు సాధికారత కల్పిస్తుంది. ఆమే రుక్మణి దేవి కటారా. ఇదంతా ఆమెకు ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం...
             ఒకప్పుడు రుక్మిణి దేవి జీవితం రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌ జిల్లా మండవ గ్రామంలోని ఘున్‌ఘట్‌కే పరిమితమై ఉండేది. కుటుంబ పరిస్థితుల వల్ల 13 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకోవల్సి వచ్చింది. ఆమెలోని ఆత్మ విశ్వాసం జీవితం పట్ల ఓ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మాత్రమే కాదు ఆమె చుట్టూ ఉన్నవారిని కూడా మార్చింది. రుక్మణి ఇప్పుడు గిరిజన మహిళల యాజమాన్యంలోని సోలార్‌ తయారీ కంపెనీ దుర్గా ఎనర్జీకి అధిపతిగా ఉన్నారు.
సరైన వెలుతురు లేక
             ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన ఒక మహిళ పేదరికం మరియు కష్టాలను అధిగమించి భారతదేశంలో పునరుత్పాదక గ్రామీణ ఇంధన విప్లవాన్ని రేకెత్తిస్తున్న కంపెనీకి ఎలా అధిపతిగా ఎదిగింది. నేషనల్‌ జియోగ్రాఫిక్స్‌ వన్‌ ఫర్‌ చేంజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ''మాకు కొన్ని పశువులు ఉన్నాయి. కానీ సంపాదన లేదు. తినడానికి తిండి లేదు. నా భర్త నిరుద్యోగి. గ్రామంలో అందరి పరిస్థితి ఇదే. ప్రధాన కేంద్రాల్లో మాత్రమే విద్యుత్తు అందుబాటులో ఉండేది. మేము కిరోసిన్‌ దీపాలను ఉపయోగించే వాళ్ళం. రాత్రిపూట సరైన వెలుతురు లేక గ్రామస్తులు తరచూ తేళ్లు, పాముల కాటుకు గురయ్యేవారు. చదువుకోవడానికి వెలుతురు లేకపోవడంతో పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవారు'' అని గుర్తు చేసుకున్నారు.
స్వయం సహాయక గ్రూపులతో...
             రాజస్థాన్‌ స్టేట్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌కు చెందిన రాజీవిక రుక్మణి పరిచయమైన తర్వాత మార్పు వైపు ఆమె మొదటి అడుగు వేశారు. ఆమె తన గ్రామంలో స్వయం సహాయక బృందాన్ని ప్రారంభించమని రుక్మిణిని ప్రోత్సహించింది. ''రాజీవిక అందించిన నిధుల ద్వారా, స్వయం సహాయక గ్రూపులోని సభ్యులు చిన్న చిన్న వెంచర్లను సొంతంగా ఏర్పాటు చేయగలిగారు. కొందరు ఆవులు, గేదెలను కొనుక్కున్నారు. నేను గ్రామంలో కిరాణా దుకాణాన్ని ప్రారంభించాను'' అని రుక్మిణి వివరించారు.
చాలా అవసరమైన కాంతిని తీసుకొస్తూ
             2016లో ఐఐటీ బాంబే ప్రారంభించిన దుంగార్‌పూర్‌ ఇనిషియేటివ్‌ ఆ ప్రాంతంలోని మహిళల జీవితాలను నిజంగా ఓ మలుపు తిప్పింది. ప్రొఫెసర్‌ చేతన్‌ సింగ్‌ సోలంకి నేతృత్వంలో సోలార్‌ సహేలి దాని SoUL ప్రాజెక్ట్‌లో భాగంగా రాజీవిక అక్కడి జిల్లా పరిపాలనతో కలిసి ఈ ప్రాంతంలోని సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల నుండి నాలుగు క్లస్టర్‌లను నిర్వహించింది. రుక్మణి వంటి మహిళలు సోలార్‌ ప్యానెల్స్‌ను అసెంబ్లింగ్‌ చేయడంలో, వాటితో కలిసి పనిచేయడంలో శిక్షణ పొందారు.
మహిళలను భాగం చేయడమే
             అంత్రి, బిలాడి, ఝోంత్రి, పునాలి నుండి నాలుగు క్లస్టర్ల అధ్యక్షులు సోలార్‌ ప్యానెల్స్‌, ల్యాంప్‌ల తయారీని ప్రారంభించేందుకు ఐఐటీ బాంబేతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సంస్థ పేరు దుంగార్‌పూర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (దుర్గా ఎనర్జీ). ''ఎస్‌హెచ్‌జీల నుండి మహిళలను కంపెనీలో భాగం చేయడమే దీని లక్ష్యం. వీరిని సోలార్‌ సహేలీలు అంటారు.
అతి తక్కువ కాలంలోనే
             ''నా పనిని ఇందులో ఒక ఉద్యోగిగా ప్రారంభించాను. ప్యానెల్‌లను ఎలా ఇన్‌స్టాల్‌ చేయాలో నేర్చుకున్నాను. ఆ పలకలను ఏర్పాటు చేసేందుకు ఇంటింటికి వెళ్లాను. వాటిని ఎత్తులో అమర్చడానికి పొడవైన నిచ్చెనలను ఎక్కుతాను. ఈ ప్రక్రియలో అడుగడుగునా శిక్షణ పొందాను'' అని రుక్మణి చెప్పారు. అతి తక్కువ కాలంలోనే ఆమె అందులో సూపర్‌వైజర్‌గా నియమించబడింది. ఒక సంవత్సరంలోనే దుర్గా ఎనర్జీకి సీఈఓగా అయ్యారు. ''మొదట్లో గ్రామస్తులకు సౌరశక్తి గురించి చాలా ప్రశ్నలు ఉండేవి. విద్యుత్‌ను ఇలా ఎలా ఉత్పత్తి చేస్తారని వారు ఆశ్చర్యపోయారు. మేము దానిని ఒక నెల పాటు ఉపయోగించమని వారిని కోరాము. ఇది ఎంతో ఉపయోగకరమని వారికి అర్థమయింది.
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు
             ఇప్పటి వరకు 40,000 సోలార్‌ స్టడీ ల్యాంప్‌లను పంపిణీ చేశారు. ఐదు లక్షల సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. లక్ష టార్చ్‌లు, 50,000 లాంతర్లు తయారు చేశామని ఆమె చెప్పారు. ఇవే కాకుండా ఇంకా ఇతర మార్పులు కూడా కనిపిస్తాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇదెంతో సహకరించింది. ఒక్కో సోలార్‌ సహేలీ నెలకు దాదాపు రూ. 8,000-16,000 సంపాదిస్తుంది. రుక్మణి చెప్పిన ప్రకారం వారు ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉన్నారు. గతంలో వలె ఇప్పుడు మాట్లాడటానికి భయపడరు. పురుషులను మాట్లాడటానికి అనుమతించారు.
వన్‌ ఫర్‌ చేంజ్‌లో భాగంగా
             సంస్థ అభివృద్ధిపై రుక్మిణి దృష్టి కేంద్రీకరించారు. మహిళా బృందాలను 55 నుండి వెయ్యికి పైగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని, చివరికి దేశాన్ని కూడా తాకాలనే విశ్వాసంతో ఉన్నారు. రుక్మణి ఇప్పుడు నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మిషన్‌ క్యాంపెయిన్‌ వన్‌ ఫర్‌ చేంజ్‌లో భాగం. ఇది ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి అసాధారణమైన చర్యల్లో భాగంగా తీసుకున్న మార్పు నిర్మాతల సాధారణ కథనాలను గుర్తించే షార్ట్‌ ఫిల్మ్‌ల శ్రేణిని ప్రదర్శిస్తుంది. వన్‌ ఫర్‌ చేంజ్‌లో భాగమైనందుకు గౌరవంగా ఉందని, సోలార్‌ సహేలిస్‌ కథ ఇప్పుడు మొత్తం ప్రపంచానికి చేరుతుందని ఆశిస్తున్నానని ఆమె చెప్పింది.
             ''కోశిష్‌ కర్నే వాలోన్‌ కి కభీ హర్‌ నహిన్‌ హోతీ (నిరంతరం ప్రయత్నించేవారికి ఎప్పుడూ విఫలం అనేది ఉండదు)'' అని ఆమె చెబుతూ ''మే జిద్ది హూన్‌ (నేను మొండిదానిని) నేను ఎప్పుడూ విఫలం కాలేదు'' అంటున్నారు.

- సలీమ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు
కరివేపాకు కలిపి...
ఇట్ల చేద్దాం
క్యారెట్‌ తినండి
క్లీనింగ్‌ ఎలా చేస్తున్నారు..?
ఆదమరిచి నిద్రపోవాలంటే..?
సమాజాన్ని సవాలుగా తీసుకుంది
ఇట్ల చేద్దాం
మీ ఇష్టాలను దూరం చేసుకోవద్దు
సంగీతానికి ముగ్ధులవుతారు
ఒత్తిడి తగ్గించుకోవాలంటే..?
బెండతో ప్రయోజనాలు
పాత న్యూస్‌ పేపర్లతో కొత్తగా
డెలివరీ తర్వాత...
ప్రతిభావంతులుగా
'నాన్న' సరిలేరు నీకెవ్వరూ
అభిరుచులే ఆదాయ వనరుగా...

తాజా వార్తలు

03:31 PM

హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

03:27 PM

జులై 1న టెట్ ఫలితాలు

03:25 PM

నడవలేని స్థితిలో నిత్యామీనన్..

03:22 PM

మద్యం తాగి వాహనం నడపకుండా ప్రతేక పరికరం..!

03:06 PM

విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ఇద్దరు మృతి

03:05 PM

అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణిల ఇంటర్ రిజల్ట్స్..

02:56 PM

ఇంటర్నెట్‌ లేకున్నా జీమెయిల్ వాడొచ్చు..

02:50 PM

పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు: మోహన్ బాబు

02:42 PM

జపాన్ నుంచి యూఏఈ బయల్దేరిన మోడీ

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.