Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మాడిపోయిన బల్బుల్ని వెలిగిద్దాం | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 23,2022

మాడిపోయిన బల్బుల్ని వెలిగిద్దాం

             ''కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా హీనంగా చూడకుదేన్నీ కవితామయమేనోరు అన్నీ'' అని శ్రీశ్రీ గారు రుక్కులులో రాసినట్టుగా దేన్నీ హీనంగా చూడటంలేదు. అన్ని వస్తువులనూ బొమ్మల తయారీలో ఉపయోగిస్తున్నాను. ''మాడిన బల్బూ, పగిలిన సీసా, చిరిగిన చీరా, పారవేయకు దీన్నీ, కళామయమేనోరు అన్నీ'' అని ఇక్కడ కవితను మార్చుకుందాం. ఇంట్లో ఏ వస్తువునూ పారేయద్దు. దాంట్లో కూడా ఏదో ఒక అద్భుత కళాఖండం దాగి ఉంటుంది. అదేంటో కనుక్కొని ఆ రాయిని శిల్పంగా చెక్కుకుంటూ పోతే అపూర్వ కళాకృతి తయారవుతుంది. ఆ శిల్పాలను చెక్కటానికి కొన్ని సూచనలు ఇస్తున్నాం. అనంతమైన సృజనాత్మకత మీవద్ద ఉన్నది. ఈ సూచనల ననుసరించి మీలోని ప్రతిభా పాటవాల్ని బయటకు తీస్తే మన ఇల్లు ఒక మ్యూజియంలా మారిపోతుంది. మరి మనలోని సృజనాత్మకతను బయటకు తెద్దామా!
             బల్బులు ఎన్నో రకాలు వస్తున్నాయి. గదిలో వెలుతురు కోసం వాడే బల్బుల ఆకారాల్లో బోలెడు రకాలుంటున్నాయి. ఇవికాక ఈ మధ్య కాలంలో ఫ్యాన్లకు వేలాడుతూ ఎన్నో అందమైన ఆకృతుల్లో బల్బులు ఉంటున్నాయి. బల్బును కాపాడే షెల్‌ లాంటివి కూడా ఎన్నో డిజైన్లలో లభిస్తున్నాయి. ఇంకా ఫాల్‌ సీలింగ్‌ చేయించుకున్నపుడు దానికి పెట్టే బల్బులూ ఉంటున్నాయి. ఇంకా వంటింట్లోని గ్యాస్‌ స్టవ్‌ పైన ఉండే చిమ్నీలో బాదం కాయ ఆకారంలో బల్బులు ఉంటాయి. అలాగే ఫ్రిజ్‌లో, మైక్రోవేవ్‌ ఓవెన్‌లలో ఉండే బల్బులు చిన్నవిగా ఉంటాయి. ఇంకా ట్యూబులైట్లను మరిచిపోయాం. ఇన్నీ రకాల బల్బులు మాడిపోయి కళా విహీనంగా కనపడుతుంటే నాకు నిద్రెలా పడుతుంది. అందుకే బల్బుల్ని బొమ్మలుగా మార్చే పని మొదలుపెట్టాను. చూడండి.
పెద్ద బల్బుతో బొంగరం
             మాడి పోయిన పెద్ద బల్బు నొకదాన్ని తీసుకొని దాని కింద భాగంలో ఉండే అల్యూమినియం పార్టును తీసేశాను. ఇప్పుడు చివర కొసలాగా గాజు పదార్థామే ఉన్నది. దీన్ని చూడగానే పెయింట్‌ వేద్దామని పించింది. రంగులు దగ్గర పెట్టుకుని కూర్చున్నాను. దానికి రంగులు అద్దాలని మొదలుపెట్టగానే ఆ బల్బు ఆకారం చూసి బొంగరంలా మారుద్దామనుకున్నాను. పైగా ఇప్పటి తరానికి ఎక్కువగా తెలియదు. పైన లావుగా ఉండి కింద చిన్న సన్నని కాడగా ఉంది కాబట్టి పూర్వం బొంగరాలకు ఎలాంటి రంగులు, డిజైన్లు ఉండేవో గుర్తు చేసుకొని రంగులు వేయడం మొదలుపెట్టాను. రంగులన్నీ పూర్తయ్యే సరికి పూర్తిగా బొంగరంలా మారిపోయింది. తాడు చుట్టి నేల మీద వేసి తిప్పాలని అనిపించింది. ఊహ వరకే నండోరు! గాజు కదా పగిలిపోతుంది. అది బల్బు అని ఎవరూ గుర్తు పట్టలేదు.
సిఎఫ్‌ఎల్‌ బల్బుతో
             మనం ఇళ్ళలో ఈ మధ్య మామూలు బల్బుల స్థానంలో సిఎఫ్‌ఎల్‌ బల్బులను వాడడం మొదలుపెట్టాం. ఇవి మామూలు బల్బులు కన్నా మూడు నాలుగురెట్లు ధర ఎక్కువగా ఉంటుంది. అయితే వీటివల్ల కరెంటు వాడకం తక్కువగా ఉంటుందని అందరూ కొనుక్కుంటున్నారు. అలాంటి సిఎఫ్‌ఎల్‌ బల్బ్‌ మాడిపోయి దర్శనమిచ్చింది ఒకరోజు. వెంటనే దాన్ని కూడా పెయింట్‌ చేశాను. కరెంటు ప్రయాణంలో రాగి తీగలు నాలుగు ములుపులు తిరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి దీనిని ఏం చేద్దామా అనుకున్నాను. దీనిని బంగారు రంగు ట్రీడి పెయింట్‌తో అలంకరిదా మనిపించింది. వెంటనే గోల్డెన్‌ కలర్‌ త్రీడి పెయింట్‌తో ఈ బల్బు వంటి నిండా డిజైన్లు గీసేశాను. అబ్బ ఎంత బాగుందో. బంగారు రంగు జరీ పట్టుచీర కట్టుకున్న మహిళల ధగధగా మెరిసిపోతున్నది. వెంటనే అద్దాల షెల్ఫ్‌లో పెట్టేశాను.
బాదంకాయ బల్బులతో
             వంటింటి చిమ్నీలో వెలిగే బల్బులు మాడిపోతే పక్కన దాచి పెట్టాను. వీటిని ఉపయోగించి ఏం చేద్దాం! ఎప్పుడూ పెయింటింగులే వేస్తున్నాను. అనుకుని ఒక దాన్ని చేపగా మార్చాను. ఇంట్లో ఎమ్‌సీఎల్‌ ఉంది. దాంతో కండ్లు ముక్కు పెట్టి చేపను చేశాను. ప్రిస్టిస్‌ అనే చేపలకు పొడవు ముక్కు ఉంటుంది. అలాగ దీన్ని తయారు చేసినాక పొలుసులు వెయ్యాలి కదా అని జ్ఞాపకం వచ్చింది. సీడి మార్కర్‌ను ఉపయోగించి బల్బు మీద చేప పొలుసుల్ని చిత్రించాను. ఇంకేం చేప తయారయింది. ఇంకో బల్బును తీసుకొని దానిమీద మామూలు డిజైనును వేశాను. ఎర్రరంగు బల్బు మీద నలుపు రంగుతో ముగ్గులు పెట్టినట్టుగా డిజైను వేశాను.
ట్యూబ్‌లైట్లతో
             అన్ని బల్బులను ఆకారాలు మార్చేస్తున్నపుడు ట్యూబ్‌లైట్లను ఎందుకు వదిలిపెట్టాలి. అనుకున్నాను. అయితే దీన్ని అలంకరించాక ఎక్కడ పెట్టాలి. అనే సందేహం వచ్చింది. అందుకని ట్యూబ్‌లైట్లలో సగం సైజు ఉండే ట్యూబ్‌లైట్లతో బొమ్మలు చేయవచ్చు అనిపించింది. అంతలో మా హాస్పిటల్‌లో ఉండే మెసీన్లలో చిన్న చిన్న ట్యూబ్‌లైట్లు మాడిపోతే పక్కన పడేయటం గమనించాను. వాటిలో లేత ఆకుపచ్చ అంటే సీగ్రీన్‌ కలర్‌లో ఉండే ట్యూబ్‌లైటును చూసి మనసు పారేసుకున్నాను. ఇంకేముంది ఆ లైటు నా కళాభిరుచికి ఆహారంగా మారిపోయింది. ఇందులో ఇంకొకటి తెలుపు రంగులో ఉంది. వెంటనే ఈ రెండు ట్యూబులైట్లను నా టేబుల్‌ ఎక్కించేశాను. మామూలు పెయింటింగ్‌ ఎందుకులే 'వర్లి' ఆర్ట్‌ను వేద్దామనిపించింది. మహారాష్ట్రలోని గిరిజనులు సృష్టించిన 'వర్లి' పెయింటింగ్‌ను ఈ ట్యూబ్‌లైట్లపై వేశాను. సంప్రదాయ జానపదుల సృష్టి ఈ వర్లి కళ. ఇది ఎక్కువగా రేఖా గణిత ఆకృతిలో దర్శనమిస్తుంది. వృత్తం, త్రిభుజం, చతురస్రంలను ఉపయోగించి మానవులు, జంతువులను చిత్రిస్తారు. ఎక్కువగా ప్రాచీన కాలపు గోడలపై ఈ చిత్రకళ కనిపిస్తుంది. దీన్ని నా ట్యూబ్‌ లైట్లపై చిత్రించాను. చూడటానికి సులభంగా ఉంది అనుకున్నాను గానీ వేస్తున్నపుడు గాని తెలియలేదు దీని కష్టం.
ఎల్‌ఈడీ బల్బుతో
             ఈ మధ్య ఎక్కువగా ఎల్‌ఈడీ బల్బులను వాడుతున్నారు. అసలు ఎల్‌ఈడీ అంటే ఏమిటో తెలుసా? లైట్‌ ఎలిమిలింగ్‌ డియోడ్‌ అని దీనర్థం. ఇపుడు వేగంగా వ్యాప్తి చెందుతున్న బల్బులివి. సరే వీటినెందుకు వదలాలి అని దీంతో ఒక బొమ్మను చేశాను. ఈ బల్బు సగం మూసేసి, సగం మాత్రమే బల్బుగా కనిపిస్తుంది. సగం మూసేసిన వైపు ఫెవికాల్‌ రాసి దాని మీద బంగారు రంగు మెరుపును చల్లాను. బంగారు బల్బులా మెరిసిపోతోంది. మిగతా సగాన్ని పెయింట్‌ చేశాను. పూర్తిగా రంగుతో నింపేశాను. దీనికి ఒక తాడును కట్టి వేలాడు దీసుకునేలా కూడా అమర్చవచ్చు. లేదంటే అలాగే అద్దాల అలమరలో అలంకరించవచ్చు.
ఫ్యాన్‌ కింద వేలాడే బల్బుతో
             మా ఇంట్లో నేను వేలాడే బల్బులున్న ఫ్యాన్లనే కొనుకున్నాను. దాంతో ఇంటినిండా రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో మెరుస్తూ కనిపిస్తాయి. కొన్ని రోజులకు ఆ ఫ్యాన్‌ చెడిపోగా కిందనున్న బల్బును తీసి పెయింట్‌ చేశాను. ఆర్టిస్ట్‌ అంటే కేవలం కాగితాల మీదనే బొమ్మలు వెయ్యక్కరలేదు. మాడిపోయిన బల్బును కూడా కాన్వాసుగా చేసుకోవచ్చు. ఫొటోలో చూడండి. ఈ బల్బు ఎంత ముద్దుగా తయారయిందో.

- డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జొన్నలతో భలే రుచులు
వాటి గురించీ ఆలోచించండి
సారీ చెప్తున్నారా..?
ఇట్ల చేద్దాం
ప్రజాస్వామ్యం చెరసాలలో వుంది
లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు
కరివేపాకు కలిపి...
ఇట్ల చేద్దాం
క్యారెట్‌ తినండి
క్లీనింగ్‌ ఎలా చేస్తున్నారు..?
ఆదమరిచి నిద్రపోవాలంటే..?
సమాజాన్ని సవాలుగా తీసుకుంది
ఇట్ల చేద్దాం
మీ ఇష్టాలను దూరం చేసుకోవద్దు
సంగీతానికి ముగ్ధులవుతారు
ఒత్తిడి తగ్గించుకోవాలంటే..?
బెండతో ప్రయోజనాలు

తాజా వార్తలు

09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

07:09 PM

ఓటీటీపై టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం

07:04 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..!

06:46 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

06:40 PM

వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు.. వీడియో..

06:36 PM

ఉద‌య్‌పూర్ హ‌త్య ఉగ్ర సంస్థ ప‌నేనా..!

06:15 PM

'హ్యాపీ బర్త్‌ డే`ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి

06:12 PM

రెబల్ ఎమ్మెల్యేల ముంబై ప్రయాణం వాయిదా

06:05 PM

రేపు అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

06:01 PM

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..!

05:46 PM

ఐపీఎల్ పై జై షా కీలక ప్రకటన

05:35 PM

విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌

05:28 PM

మలేషియా ఓపెన్‌లో సైనా శుభారంభం

05:13 PM

మహారాష్ర్ట సీఎంకు మరో షాక్

05:04 PM

ట్వి‌ట్ట‌ర్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది నోటీసులు

04:43 PM

దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.