Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజస్థానీ అద్దాల చిత్రకళ | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

రాజస్థానీ అద్దాల చిత్రకళ

         రాజస్థానీ వాస్తు నిర్మాణశైలి, ఆలయ గోపురాల శైలి విలక్షణమైన రీతిలో అబ్బుర పరుస్తూ ఉంటుంది. రాజస్థానీయులు చేసే పెయింటింగులను ''రాజపూత్‌ పెయింటింగ్‌'' అంటారు. పర్దేయన్‌ మోఘల్‌, చైనీస్‌, యురోపియన్‌ శైలుల్ని మిళితం చేసుకున్న రాజపూత్‌ చిత్రకళ అందర్ని అలరిస్తూ ఉంది. రాజస్థాన్‌ కళాత్మక శైలుల గురించి నేర్పడానికి మేవార్‌, దుర్విర్‌, హదోటీ. ధందర్‌ పాఠశాలలున్నాయి. వస్త్రంపై చేసిన రంగురంగుల స్క్రోల్‌ పెయింటింగులను 'ఫార్‌పెయింటింగులు' అంటారు. పార్‌ పెయింటింగ్‌ కూడా రాజస్థాన్‌ సంప్రదాయ కళ. రాజస్థాన్‌లోని జైన దేవాలయాల్లో కుడ్య చిత్రకళ ఎక్కువగా వాడబడింది. మధ్య యుగాల్లో జైన, హిందూ కళలు ప్రాచుర్యం పొందాయి. వీరి చిత్రకళలో పొడవైన కోసుగా ఉండే ముక్కులు, ముందుకు పొడుచుకు వచ్చిన కండ్లతో మూడు వంతుల దృశ్యంలో కనిపిస్తూ ఉంటాయి. రెండు కండ్లూ కనిపించేలా చిత్రాలుంటాయి. నిండు రంగుల బట్టలు, ఆభరణాలు, తలపాగాలతో అందచైన ఆహార్యంతో అక్కడి ప్రజలుంటారు. జైపూర్‌, అజ్మీర్‌లను చూసినపుడు నాకిలా అనిపించింది.
వాద్య కారుల బొమ్మల్ని చేద్దాం
            ఇంత వరకు వాద్య కారుల బొమ్మలు చెయ్యలేదు కదా! దీనికి గట్టి అట్టలు, కొద్ది మందం ఉండే అట్టలు పాల్స్‌ ప్యాక్‌లో వచ్చేవి ఉన్నట్టుగా అన్నమాట. దీనికి బాల్‌ పెన్నులు కావాలి. బొమ్మలకు బేస్‌గా లావు అట్టల్ని ముక్కలుగా చేయాలి. గుండ్రంగా, కోడిగుడ్డు ఆకారంలో కత్తిరించుకోవాలి. వాడేసిన బాల్‌ పెన్నుల్ని తీసుకొని బేస్‌ అట్టకు మధ్యలో గుచ్చి అతికించుకోవాలి. ఇప్పుడు పలుచటి అట్టలను శరీర భాగాలుగా కత్తిరించి పెట్టుకోవాలి. ఒక్కోక్కటి రెండు ముక్కలు కత్తిరించి పెట్టుకోవాలి. బాల్‌ పెన్నుకు ముందు వెనకలుగా రెండు ముక్కలు పెట్టి అతికించుకోవాలి. ఛాతిభాగంలో, తల, కాళ్ళు మూడు భాగాలుగా అట్టలు కత్తిరించుకోవాలి. వీటిని బాల్‌ పెన్నుకు అతికించాలి. చేతుల కోసం బాల్‌ పెన్ను రీఫిల్స్‌ను వాడాలి. కొద్దిగా వంపితే చేతుల చక్కగా వస్తాయి. అలాగే వాద్య కారులు అనుకున్నాం కాబట్టి తబలా, వేణువు, సితార వంటి వాయిద్యాలను అట్టముక్కలతో తయారుచేయాలి. చేతులతో పట్టుకున్నట్లుగా వాటిని అతికించాలి. తల భాగంలో పాగా పెట్టుకున్నట్టుగా గీతలు ఉండే అట్టను పెడితే బాగుంటుంది. ఇది బిస్కెట్‌ ప్యాకెట్లలో దొరుకుతుంది అతకటం పూర్తయ్యాక రంగులు వేసుకుంటే చాలా అందంగా కనిపిప్తాయి. టేబుల్‌ మీద అలంకారంగా పనికొస్తాయి.
వాల్‌ హ్యాంగింగ్‌
            దీనికి గట్టి అట్టను తీసుకొని నలుచదరంగా కత్తిరించి పెట్టుకోవాలి. ఈ అట్టమీద అతికించడానికి మామూలు వస్త్రం కాకుండా పట్టు వస్త్రం తీసుకోవాలి. రాజస్థానీయుల ఆర్ట్‌ను తీసుకుంటున్నాం కాబట్టి మెరుపులు బాగా ఉండాలి. ఈ అట్ట మీద చుట్టూ బార్డర్‌ వలె నలుపు రంగు వేసుకోవాలి. మధ్యలో చదరంగం గళ్లవలె రంగులు వెయ్యాలి. ఈ గళ్ళలో సిడి ముక్కలు లేదా అద్దాలు అతికించుకోవాలి. రాజస్థాన్‌ను గుర్తుచేసువాలి అంటే అద్దాలు వాడవలసిందే. ఇక్కడ నేను పాతసీడీ తీసుకుని ముక్కలుగా కత్తిరించి అతికించాను. ఆ తర్వాత నేను ఊలుతో చిన్న ఉండలు, కుచ్చులు తయారు చేసుకున్నాను. నలుపురంగు బార్డర్‌ మీద ఊలు ఉండలు అతికించాలి. కుచ్చులు అట్టకు చివర్లన కట్టాలి. అట్ట పై భాగాన ఒక తాడు అతికిస్తే గోడకు వేలాడతీసుకోవచ్చు.
కాలెండర్‌ పెయింటింగ్‌
            అందంగా అలంకరించుకున్న రాజస్థానీ మహిళల చిత్రాలను కాలెండర్లుగా తయారుచేస్తారు. అటువంటి వాటిలో మనకు నచ్చిన దొకటి తీసుకోని దానికి అలంకారం చెయ్యాలి. రోడ్డు మీద పెట్టుకుని ఇలాంటి చిత్రాలు ఎక్కువగా అమ్ముతుంటారు. నేను అలాగే కొనుక్కున్నాను. కాలెండర్‌ పైన కింద ఉండే ఇనుప చువ్వల్ని కత్తిరించేయాలి. ఇందులో అమ్మాయి పెట్టుకునే నగల్ని అలంకరిచాలి. ముత్యాలు, బీడ్స్‌, తళుకులు, కుందన్లు వంటి వాటితో నగల్ని అందంగా అలంకరించాలి. ఏ నగను ఎలాంటి రాళ్ళతో అలంకరించాలో కొద్దిగా అవగాహన ఉంటే చాలు. అంతేకాక అమ్మాయి బట్టల్ని కూడా హైలైట్‌ చెయ్యాలి. మెరుపుతాడు బంగారు రంగులోనూ, సిల్వర్‌ రంగులోనూ తొరుకుతాయి వాటితో సన్నగా ఉంగే బోర్డర్లు అతికించేయాలి. ఇంకా చీరలు, లంగాల కింది భాగంలోని బార్గర్‌లను జరీ బార్గర్‌లాగా లేసులను అతికించాలి. ఇంకా చీరలకు మఖమల్‌ బట్టను వాడవచ్చు. జాకెట్ల డిజైన్లకు పువ్వుల్లాంటి అతుకులు వాడితే బాగుంటుంది. పూర్తయ్యాక చిత్రాన్ని ప్రేమ్‌ చేయించాలి. ఇలా అమ్మాయిల చిత్రాలే కాదు ఏ చిత్రాలనైనా చేయవచ్చు.
ప్లాస్టిక్‌ కప్పుతో
            ఈ రకమైన వాల్‌ హ్యాగింగ్‌లు మనకు లేపాక్షి షోరూమ్‌లలో ఎక్కువగా అభిస్తాయి. అయితే ఖరీదు పెట్టి కొనకుండా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఈ వాల్‌ హాంగింగ్‌లో చిలకల్ని తయారు చేస్తున్నాం. చిలుక ఆకారంలో రెండు బట్ట ముక్కల్ని కత్తిరించి పెట్టుకోవాలి. చుట్టూ కుట్టుకుట్టి మధ్యలో స్పాంజి లేదా పత్తిని నింపితే చిలక బొమ్మ తయారవుతుంది. ఈ చిలుక కోసం ఎరుపు, బులుగు, ఆకుపచ్చ, పసుపు, నారింజ వంటి రంగులు వాడితే బాగుంటుంది. ఏ బోమ్మ తయారు చేసినా నిండు రంగులో చేయాలి. నిండు రంగుల వస్త్రాలు, ఆభరణాలు, తలపాగాలు, అద్దాలు పెడితే రాజస్థానీ అలంకారం కనిపిస్తుంది. ప్లాస్టిక్‌ కప్పుకు కప్పుతూ బాందినీ ప్రింటిడ్‌ బట్టను అతికించాలి. దీని మీద బంగారు రంగు లేసులు, అద్దాలు అతికించాలి. ఈ కప్పును బోర్లా పెట్టి చుట్టుతా చిలకల తాళ్ళను కట్టాలి. పై భాగాన వేలాడ దీసేందుకు రంగుల లేసుల్ని తాళ్ళనీ వాడవచ్చు.
రాజస్థానీ పెయింటింగ్‌
            ఒక అట్ట మీద గానీ అద్దం మీద గానీ ఈ చిత్రాన్ని చేయవచ్చు. పెద్ద పెద్ద మీసాలు, తలను చుట్టేసి ఉండే పగోడా పెడితే రాజస్థానీ పురుషుడు తయారవుతాడు. నేను దీనిని రంగులతో చిత్రించాను. లేదంటే వస్త్రపు ముక్కల్ని అతికించి సైతం చేయవచ్చు. ఒక గుండ్రటి అద్దాన్ని తీసుకుని దాని మీద చిత్రించే ప్రయత్నం చేశాను. రాజస్థాన్‌ అంటేనే మిర్రర్‌ వర్క్‌ అంటారు కాబట్టి మిర్రర్‌ మీదనే పెయింటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. ముందుగా కార్బన్‌ పేపర్‌ సాయంతో బొమ్మను గీసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏయే రంగులు వేస్తే బాగుంటుందో ఆలోచించుకుని వేస్తే రాజస్థానీ పెయింటింగ్‌ బాగుంటుంది. అద్దాలతో కుట్టిన లెహంగాలు, జాకెట్లు, ఓణీలు ఎంతో బాగుంటాయి. మిర్రర్‌ వర్క్‌ జాకెట్లు నేను కూడా చాలా ఎక్కువే వాడతాను. అద్దాల కుట్టు కూడా ఇష్టంతో నేర్చుకున్నాను.

- డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కజొన్న వంటలు అదుర్స్‌
ఆర్ధిక పొరపాట్లతో...
సహజమైన నిగారింపుకై...
బలమైన మహిళా శ్రామికశక్తి
ఈ లక్షణాలుంటే...
ఔషధ గుణాలు ఎన్నో...
సుస్వర 'వాణి'
చర్మానికి మేలు చేస్తుంది
బోలెడు ప్రయోజనాలు
ఇట్ల చేద్దాం
కొబ్బరాకుల కళాకృతులు
మార్పులకు కంగారుపడొద్దు
ఇట్ల చేద్దాం
వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే
మూసవిధానానికి స్వస్తి చెప్పండి
బరువు తగ్గాలంటే వీటిని కలిపి తినొద్దు
ఈ పద్ధతి పాటించండి
పిల్లలతో ఇలా మాట్లాడండి
పనులు పంచుకోండి
ఆరోగ్యానికి ప్రమాదం
సమానత్వం వైపు పయనం
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇట్ల చేద్దాం
మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?

తాజా వార్తలు

06:51 PM

ప్రధాని మోడీ డిగ్రీ కేసు..తీర్పు రిజర్వ్‌ చేసిన గుజరాత్‌ హైకోర్టు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.