Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చల్లని సాయంత్రం వేళ యమ్మీ.. యమ్మీ.. | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

చల్లని సాయంత్రం వేళ యమ్మీ.. యమ్మీ..

           చలికాలం వచ్చిందంటే చాలు చల్లని గాలులు నిలవనీయవు. సాయంత్రం అయిందంటే వణికిపోవాల్సిందే. అలాంటప్పుడే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఇక పిల్లలు తిండి తినిపించడం మరీ కష్టం. అందుకే కొన్ని వెరైటీ స్నాక్స్‌ ట్రై చేస్తే ఈ కాలంలో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. చల్లని సాయంత్రం వేళ యమ్మీ.. యమ్మీగా లాగించొచ్చు.
ఎర్ర కందిపప్పుతో టేస్టీ గారెలు
కావాల్సిన పదార్థాలు: ఎర్రకంది పప్పు - కప్పు, పచ్చిమిర్చి - రెండు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, అల్లం ముక్క - చిన్నది, మిరియాల పొడి - అర స్పూను, ఉల్లిగడ్డ - ఒకటి, జీలకర్ర - స్పూను, కొత్తి మీర తరుగు - రెండు స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, నీళ్లు - సరిపడనన్ని, నూనె - వేయించడానికి సరిపడా,
తయారు చేసే విధానం: ఎర్ర కందిపప్పు మూడు నాలుగు సార్లు కడిగాక కనీసం గంటసేపు నీటిలో నానబెట్టాలి. నీళ్లు వంపేసి మిక్సీలో వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి కాస్త నీళ్లు వేసి రుబ్బుకోవాలి. దాన్ని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిగడ్డ నిలువుగా సన్నగా తరిగి కలుపుకోవాలి. అలాగే ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. పెనంపై నూనె వేసి రుబ్బును గుండ్రంగా గారెల్లా అద్దుకుని పెనంపై వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక ప్లేటులో వేసుకోవాలి. పుదీనా చట్నీతో దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఉపయోగాలు: దీనిలో ప్రొటీను అధికంగా ఉంటుంది. దీనితో సాంబార్‌ చేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో. టమాటలో కలుపుకుని తింటే మరిన్ని పోషకాలు లభిస్తాయి. పసుపు కందిపప్పుతో పోలిస్తే ఎర్ర కందిపప్పు త్వరగా అరిగిపోతుంది. దీని వల్ల గ్యాస్‌, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు రావు. దీనిలో ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. గర్బిణీలకు ఇవి చాలా మేలు చేస్తాయి. బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. వారానికి రెండుసార్లు ఈ పప్పును తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది. నీరసం, అలసటతో బాధపడుతున్న వారు తరచూ ఈ పప్పును తింటే ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఎముకలు కూడా బలంగా మారతాయి.
క్యాబేజీ వడలు భలే
కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తరుగు - ముప్పావు కప్పు, మినప్పప్పు - అర కప్పు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు -రుచికి సరిపడా, నీళ్లు - తగినన్ని, నూనె - డీప్‌ ఫ్రై చేయడానికి సరిపడా, పచ్చి బఠానీ - పావు కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి.
తయారు చేసే విధానం: మినపప్పు నాలుగ్గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి. నీరు ఎక్కువగా పోయకుండా చిక్కగా రుబ్బుకోవాలి. క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి. పచ్చి బఠానీలు ఉడకబెట్టి మెత్తగా చేత్తో నలిపేయాలి. మినపప్పు రుబ్బును గిన్నెలో వేసి అందులో పచ్చిబఠానీల పేస్టు, క్యాబేజీ తరుగు, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. అందులో ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. కళాయిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. రుబ్బును వడల్లా నూనెలో వేయించుకుంటే క్యాబేజీ వడలు రెడీ అయిపోతాయి. నూనెను పీల్చే కాగితంపై వాటిని వేస్తే వడల్లో ఉన్న నూనెను పీల్చేస్తాయి.
ఉపయోగాలు: క్యాబేజీ వాసన చాలా మందికి నచ్చదు. కానీ అది పోషకాల పుట్ట. ఇందులో కాల్షియం, అయోడిన్‌, పొటాషియం, సల్ఫర్‌, ఫాస్పరస్‌, ఐరన్‌ వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ల విషయానికి వస్తే ఎ, బి, సి , ఇ, కెతో పాటూ ఫోలిక్‌ యాసిడ్లు లభిస్తాయి. ఈ కూర తినడం వల్ల బరువు పెరగరు. క్యాలరీలు చాలా తక్కువగా లభిస్తాయి. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ వైరల్‌ శక్తి అధికం. క్యాబేజీని తరచూ తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుంది. మహిళలు దీన్ని తినడం రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే అధికంగా తింటే మాత్రం సమస్యలు వస్తాయి. ఆడవారిలో థైరాయిడ్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వారానికి రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ తినకూడదు. గుండెజబ్బులు, స్ట్రోక్‌ వచ్చే అవకాశాన్ని, చర్మ సంబంధిత సమస్యల్ని, అల్సర్లను తగ్గించే లక్షణం ఉంది. దీనిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. దీనితో చేసిన వంటలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. చైనీయులు క్యాబేజీ రసాన్ని ఔషధాల్లో వాడతారు. పచ్చి క్యాబేజీ రసాన్ని తాగినా ఎంతో మేలు జరుగుతుంది. క్యాబేజీని పచ్చిగా కూడా తినొచ్చు. ఫాస్ట్‌ ఫుడ్‌లలో పచ్చిగానే చల్లుతారు. రైస్‌కు ఇవి ఎంతో రుచిని ఇస్తాయి. ఇక టమోటా వేసి వండే క్యాబేజీ కూర, క్యాబేజీ వేపుడు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు దీన్ని కనీసం వారానికి రెండు సార్లు పెట్టడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
అదిరే పనీర్‌-బఠానీ పరాటా
కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి - ఒక కప్పు, పనీర్‌ ముక్కలు - రెండు కప్పులు, పచ్చిబఠానీలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - మూడు, గరం మసాలా - అరస్పూను, జీలకర్ర పొడి - అరస్పూను, కారం - అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు.
తయారు చేసే విధానం: మెత్తని చపాతీలను పిల్లలు ఇష్టంగా తింటారు. వాటిని మరింత పోషకాహారంగా మారిస్తే చాలా మంచిది. గోధుమపిండిని ఎప్పటిలాగే చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కలిపి ఒక గిన్నెలో వేసి మూత పెట్టి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముద్ద కలిపేటప్పుడు కాస్త నూనె వేసి కలిపితే మెత్తగా వచ్చాయి. ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు, పనీర్‌ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. పనీర్‌ని, బఠాణీలను చేత్తో నొక్కి మెత్తటి ముద్దలా చేయాలి. ఇప్పుడు చపాతీ ముద్దని తీసుకుని చిన్న పూరీలా ఒత్తి దాని మధ్యలో బఠాణీ-పనీర్‌ మిశ్రమాన్ని పెట్టి మడతబెట్టేయాలి. దాన్ని గుండ్రంగా ఒత్తుకుని పెనంపై రెండు వైపులా కాల్చుకోవాలి.
ఉపయోగాలు: ఇందులో వాడిన పనీర్‌ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది రొమ్ము క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్న వారు దీన్ని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలకు బలాన్ని అందిస్తుంది. ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు ప్రొటీన్లను అందించే ఉత్తమ ఆహారం ఇది.
ఎగ్‌ ఛాట్‌
కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన గుడ్లు - మూడు, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, టమోటోలు - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, కారం - అరస్పూను, పసుపు - పావు స్పూను, ఛాట్‌ మసాలా - అర స్పూను, కరివేపాకులు - గుప్పెడు, ఉప్పు - తగినంత, పుదీనా తరుగు - స్పూను, కొత్తిమీర తరుగు - స్పూను, నూనె - రెండు స్పూనులు.
తయారు చేసే విధానం: ఉడకబెట్టిన గుడ్లను పెంకులు ఒలిచి పచ్చ, తెల్ల భాగాలు వేరు చేయాలి. పచ్చదాన్ని పొడిలా చేయాలి. తెల్ల భాగాన్ని కాస్త పెద్ద ముక్కల్లా కట్‌ చేయాలి. స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కా పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు, టొమాటో తరుగు వేసి వేయించాలి. అవి బాగా వేగాక కారం, పసుపు, ఛాట్‌ మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమంలో కాస్త నీళ్లు పోసి మూత పెట్టి మరిగించాలి. కూరలా మగ్గాక అందులో పుదీనా, కొత్తిమీర తురుము వేసి కలపాలి. తరువాత పొడిలా చేసుకున్న గుడ్డులోని పచ్చభాగాన్ని వేసి కలపాలి. చివర్లో తెల్లగుడ్డు ముక్కల్ని కూడా వేసి కలపాలి. అంతే టేస్టీ ఎగ్‌ ఛాట్‌ రెడీ అయినట్టే. ఒకసారి తింటే పదే పదే తినాలనిపిస్తుంది.
కచ్చితంగా తినాల్సిందే: గుడ్లు కచ్చితంగా తినాల్సిందేనని చెబుతారు వైద్యులు. మనకు అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు ఇందులో ఉన్నాయి. అందుకే కోడి గుడ్డు రోజుకొకటి తింటే ఎంతో మంచిది. ఒక మనిషికి ఏడాదికి 320 గుడ్లు తినవచ్చు. మన శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే కేవలం ఇక గుడ్డులోనే 44 ధాతువులు ఉన్నాయి. ఒక పచ్చసొనలో 12 రకాల ఖనిజాలు ఉన్నాయి. రోజుకో గుడ్డు తినడం వల్ల చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చు. ప్రతి రోజు గుడ్డు తినడం వల్ల 50 శాతం ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ రాకుండా, 80 శాతం కార్డియాక్‌ అరెస్టు రాకుండా, 75 శాతం కార్డియో వాస్కులర్‌ వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?
సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు
సానుకూలంగా వ్యవహరించండి
ఇట్ల చేద్దాం
బంగారు తంజావూరు చిత్రకళ
ఇట్ల చేద్దాం
వారిని అర్థం చేసుకోవాలంటే..?
జీర్ణశక్తికి ఇవి తింటే మంచిది
ప్రేమతో ఏదైనా జయించవచ్చు
మీ ఎదుగుదలకు అడ్డం కావొద్దు
ఆవిరి పట్టండి
చితికిపోతున్న బాల్యం
కొన్ని పొదుపు సూత్రాలు పాటిస్తే...
బయటి వాటితో పనేముంది
ఇట్ల చేద్దాం
బరువు పెరుగుతున్నారా..?
మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌
తులసితో ఆకులతో ప్రయోజనాలు...
రాజ్యాంగ రూపకల్పనలో మహిళలు
శ్రామిక మహిళల భవిత ఏమిటి?
పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి..?
ఇట్ల చేద్దాం
అవాంతరాలు దాటుకుని...
పాటల పూదోటలో విరబూసిన 'పద్మ'జ

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.